జాతీయ వార్తలు

ఆ నవ్వుల కోసమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: తమ విడ్డూర వేషధారణతో ఎంతటి వారినైనా నవ్వించడమే వారి పని. మొండి రోగాలతో అనునిత్యం సతమతమయ్యే రోజుల ముఖాల్లో ఓ క్షణమైనా ఆనందాన్ని కలిగించి వారిని నవ్వులతో మైమరపించటమే వీరి ఆశయం. నవ్వులోనే ఆనందం ఉంది. ఆ ఆనందమే జీవితం. అలాంటి ఆనందమైన జీవితానికి దూరమైన వారికి ఒక క్షణమైనా అరమరికలు లేని నవ్వులను చిందించడమే వీరి పని. అందుకే దీన్నో వృత్తిగా మార్చుకున్న ఈ ‘విదూషకులు’ నవ్వుద్వారానే వైద్యాన్ని అందిస్తున్నారు. ఇది పూర్తిగా మానసిక మైననదే. ఆసుపత్రి పాలన ఎందరికో ఈ క్లౌన్ థెరపీ అన్నది ఎంతో ఫలితాన్ని ఇస్తోంది. ఢిల్లీ, బెంగళూరులలో అనేక ఆసుపత్రులను సందర్శించే ఈ బృందం కొన్ని క్షణాలపాటైనా తమ హావభావాలతో వేషధారణతో రోగుల ముఖాల్లో ఎనలేని ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలమతో నిస్సారమైన జీవితాన్ని గడిపే రోగులకు వీరి రాక ఆనంద హేలే అవుతుంది. స్వచ్చందంగానే కొందరు నవ్వులు అందించడం ద్వారా రోగులు ముఖాల్లో ఆనందాన్ని కలిగించడమే పనిగా పెట్టుకున్నారు. వీరి హావభావాలు, చేష్టలు కేవలం రోగుల్లో నవ్వును కలిగించడానికే పరిమితమవుతాయనుకోవడానికి వీలులేదు. ఇది ఒక రకంగా చికత్సే. ఆయితే మానసిక మైనది. కొన్ని క్షణాలపాటైనా తాము రోగులం అన్న బాధ, భావన నుంచి వారికి ఉప శమనాన్ని కలిగించేదే. ఇటీవల ఢిల్లీలోని చాచా నెహ్రూ బాల చికిత్సాలయంలోని కేన్సర్ వార్డును ఈ ‘విదూషక వైద్య బృందం’ సందర్శించింది. వారి రాక ఆ ఆసుపత్రిలో రోగులకు ఆనందాన్ని కలిగించడంతో పాటు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది. కొన్ని క్షణాల పాటైనా సర్జరీ బాధనుంచి రోగులు విముక్తం అయ్యారని, వారిలో ఒత్తిడి తొలగి ఒక రకమైన ఆనందం కూడా ప్రస్పుటించిందని వారు తెలిపారు. ఈ క్లౌన్ థెరపిస్టులు వచ్చిన మరుక్షణమే క్యాన్సర్ వార్డు స్వరూపమే మారిపోయిందని, పిల్లల నుంచి పెద్దల వరకూ ఆనందంగా గడిపారని ఆసుపత్రి వర్గాలే వెల్లడించాయి.