జాతీయ వార్తలు

ఏక కాలంలో రెండు డిగ్రీలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 21: ఒకే విశ్వవిద్యాలయం నుంచి కాని, వేర్వేరు విశ్వవిద్యాలయాల నుంచి కాని ఏక కాలంలో రెండు లేదా అంతకన్నా ఎక్కువ డిగ్రీలు చేసేందుకు వీలు కల్పించే విధానం త్వరలో అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విధానం సాధ్యమా? కాదా? అనే అంశాన్ని యూనివర్సిటి గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) అధ్యయనం చేస్తోంది. ఒకే విశ్వవిద్యాలయం నుంచి కాని వేర్వేరు విశ్వవిద్యాలయాల నుంచి డిస్టెన్స్ విధానం, ఆన్‌లైన్ విధానం లేదా పార్ట్ టైమ్ విధానంలో ఒకే విద్యార్థి ఏకకాలంలో రెండు డిగ్రీలు చేసే అంశాన్ని పరిశీలించడానికి యూజీసీ వైస్ చైర్మన్ భూషణ్ పట్వర్ధన్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటయింది. అయితే, యూజీసీ ఈ అంశాన్ని పరిశీలించడం ఇదే మొదటిసారి కాదు. యూజీసీ 2012లోనూ ఏక కాలంలో రెండు డిగ్రీలు చేసే విధానాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ తనకు అప్పగించిన అంశంపై సంప్రదింపులు కూడా జరిపింది. కాని, చివరకు ఆ అంశం అటకెక్కింది. తాజాగా యూజీసీ గత నెలలో కమిటీని ఏర్పాటు చేసింది. ‘గత నెల చివరలో కమిటీ ఏర్పాటయింది. ఈ కమిటీ ఇప్పటికే ఒకసారి సమావేశం అయింది. ఈ ఆలోచన ఆచరణలో సాధ్యమవుతుందా? కాదా? అనే అంశంపై కమిటీ సంబంధీకులందరితో ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతోంది’ అని ఒక సీనియర్ యూజీసీ అధికారి ఒక వార్తాసంస్థకు చెప్పారు. యూనివర్సిటి ఆఫ్ హైదరాబాద్ అప్పటి వైస్ చాన్స్‌లర్ ఫుర్కాన్ కమర్ నేతృత్వంలో 2012లో ఏర్పాటయిన కమిటీ రెగ్యులర్ విధానంలో డిగ్రీ చేస్తున్న ఒక విద్యార్థి అదే యూనివర్సిటి లేదా మరో యూనివర్సిటి నుంచి ఓపెన్ లేదా డిస్టెన్ విధానంలో ఏకకాలంలో గరిష్టంగా మరో డిగ్రీని చేయడానికి అవకాశం ఇవ్వొచ్చని సిఫారసు చేసింది. రెగ్యులర్ విధానం లో రెండు డిగ్రీలు చేయడానికి అవకాశమిస్తే అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని పేర్కొంది.