జాతీయ వార్తలు

అనుకున్న సమయానికే మంగళగిరి ఎయిమ్స్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: మంగళగిరిలో ఏర్పాటు చేస్తున్న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) నిర్మాణాన్ని 2020 సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీకుమార్ చౌబే మంగళవారం రాజ్యసభలో తెలిపారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ రాజ్యసభా పక్షం నాయకుడు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు చౌబే సమాధానం ఇస్తూ ఎయిమ్స్ నిర్మాణం పనులను 2020 సెప్టెంబర్ నాటికి పూర్తిచేసి వైద్య, విద్యా సేవలు ప్రారంభిస్తామన్నారు. మంగళగిరిలో ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయాలని 2015 అక్టోబర్ ఏడోతేదీనాడు కేంద్ర మంత్రివర్గం నిర్ణయించటం తెలిసిందే. ఎయిమ్స్ నిర్మాణం కోసం మొత్తం రూ.1618 కోట్లు మంజూరు చేయగా కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు రూ.385.54 కోట్లు విడుల చేసిందని మంత్రి చెప్పారు. ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ బ్లాక్, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం పనులు 70 శాతం పూర్తయ్యాయి.. ఆసుపత్రి, అకడమిక్ కాంప్లెక్స్ నిర్మాణం పనులు 26 శాతం పూర్తయ్యాయని అశ్వినీకుమార్ చౌబే తెలిపారు. 2019 మార్చిలో మంగళగిరి ఎయిమ్స్‌లో ఔట్ పేషంట్ డిపార్ట్‌మెంట్ వైద్య సేవలు ప్రారంభమయ్యాయని మంత్రి చెప్పారు. ఎయిమ్స్ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు నిర్ణీత కాల వ్యవధిలోనే సాగుతున్నందున నిర్మాణ వ్యయం అంచనాలు పెరిగే అవకాశమే లేదని మంత్రి తెలిపారు.
ఫార్మ్-డి కోర్సు ఎంబీబీఎస్‌కు సమానం కాదు
ఆరేళ్ల ఫార్మ్-డి కోర్సు ఎంబీబీఎస్‌కు సమానం కాదని అశ్వినీకుమార్ స్పష్టం చేశారు. విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇస్తూ ఫార్మ్-డి కోర్సును క్లినికల్ ఫార్మసిస్టులకు సమానంగా గుర్తించాలన్న డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి వచ్చాయన్నారు. ఫార్మ్-డి కోర్సును ఎంబీబీఎస్‌తో సమానంగా గుర్తించాలనే డిమాండ్ ఏదీ తమ వద్దకు రాలేదని అన్నారు. ఆరు సంవత్సరాల ఫార్మ్-డి కోర్సులో ప్రతి విద్యార్థి రెండో సంవత్సరం నుండి నాలుగో సంవత్సరం వరకు ఏడాదికి 50 గంటలపాటు ఆసుపత్రిలో పని చేయవలసి ఉంటుంది.. ఐదో సంవత్సరం ప్రతిరోజు ఒకపూట వార్డు రౌండ్ డ్యూటీ చేయవలసి ఉంటుందని మంత్రి వివరించారు. ఫార్మ్-డి కోర్సును విజయవంతంగా పూర్తిచేసిన విద్యార్థులకు వారి ప్రొవిజనల్ సర్ట్ఫికెట్‌పై డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అని రాయటంతోపాటు వారి పేరు ముందు డాక్టర్ అని కూడా పెట్టాలని 2012లో ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విశ్వవిద్యాలయాలను ఆదేశించినట్లు మంత్రి వివరించారు. ఇదేవిధంగా ఫార్మసీ ప్రాక్టీస్ రెగ్యులేషన్ చట్టం కింద ఫార్మ్-డి ఉత్తీర్ణులైన వారిని ఫార్మసీ ప్రాక్టీషనర్‌గా మార్చడం జరిగినట్లు చౌబే తెలిపారు. డ్రగ్ ఇన్ఫర్మేషన్ ఫార్మసిస్ట్, సీనియర్ ఫార్మసిస్ట్, చీఫ్ ఫార్మసిస్ట్ ఉద్యోగాలకు అవసరమైన విద్యార్హతల కింద ఫార్మ్-డి కోర్సును కూడా చేర్చినట్లు మంత్రి వెల్లడించారు.
చిత్రం... కేంద్ర మంత్రి అశ్వినీకుమార్