జాతీయ వార్తలు

ఐదేళ్ళుగా దేశంలో సూపర్ ఎమర్జెన్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిలీ: ఐదేళ్ళుగా దేశంలో సూపర్ ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సరిగ్గా 34 ఏళ్ళ క్రితం ఇదే రోజున (మంగళవారం) ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ విధించారు. ఈ నేపథ్యంలో ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ ట్విట్టర్‌లో కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ళుగా దేశంలో సూపర్ ఎమర్జెన్సీ కొనసాగుతున్నదంటూ ఆమె ట్వీట్ చేశారు. 1975 సంవత్సరంలో ఇందిరా గాంధీ ఇదే రోజున ఎమర్జెన్సీ విధించారని, అది 1977 సంవత్సరం మార్చి 21వ తేదీ వరకూ కొనసాగిందని ఆమె పేర్కొన్నారు. 1975 సంవత్సరంలో విధించిన ఎమర్జెన్సీని దేశ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని ఆమె తెలిపారు. అలాగే ఇప్పుడు దేశంలో కూడా ఐదేళ్ళుగా సూపర్ ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని మమత మండిపడ్డారు. చరిత్రలోని ఈ పాఠాలతో మనం గుణపాఠం నేర్చుకుని ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాటం చేయాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్ చేశారు.
పునరావృతం కాకుండా
తీర్మానం: సీఎం కేజ్రీవాల్
ఇలాఉండగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేస్తూ అత్యవసర (ఎమర్జెన్సీ) పరిస్థితులు పునరావృతం కాకుండా తీర్మానం ఆమోదించాల్సి ఉంద ని పేర్కొన్నారు. 34 ఏళ్ళ క్రితం ప్రజాస్వామ్యాన్ని మంటగలిపి అత్యవసర పరిస్థితిని విధించడం బాధాకరమని తెలిపారు. కాబట్టి భవిష్యత్తులో అటువంటి విపత్కర అత్యవసర పరిస్థితి రాకుండా ఉండేందుకు అందరం కృత నిశ్చయంతో ఉండాలని పిలుపునిచ్చారు. 1975 సంవత్సరంలో ఇదే రోజున ఇందిరాగాంధీ విధించిన అత్యవసర పరిస్థితిని దేశ ప్రజలు 1977 సంవత్సరం మార్చి 21 వరకు భరించారని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

చిత్రాలు.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ *ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్