జాతీయ వార్తలు

సమస్యలపై దాటవేత..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 25: పార్లమెంటు ఉభయ సభలనుద్ధేశించి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ నాయకత్వం విరుచుకుపడింది. ప్రధాని మోదీ ప్రసంగం సామాన్యులను మోసం చేసేందుకు గతంలో ఆయన అనుసరించిన ఎత్తుగడలకే అద్దం పట్టిందని, వాస్తవ అంశాల్లోనూ ఏ మాత్రం ప్రస్తావించలేదని కాంగ్రెస్ తెలిపింది. అయితే మోదీ తన ప్రసంగం చివర్లో మాజీ ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూ పేరును ఉటంకించడం కాంగ్రెస్ సాధించిన విజయంగా ఆ పార్టీ లోక్‌సభ నాయుడు అధీర్ రంజన్ చౌదరి అన్నారు. గతంలో ఎప్పుడు కూడా కాంగ్రెస్ నేతల పేర్లను ప్రస్తావించని నరేంద్ర మోదీకి ఈ సారి నెహ్రూ పేరును ఉటంకించక తప్పని పరిస్థితి ఏర్పడిందన్నారు. వ్యవసాయం నుంచి పరిశ్రమలు నిరుద్యోగం వంటి అనేక సమస్యలు ప్రజలను వేధిస్తున్నప్పటికీ వాటిని ఏ మాత్రం మోదీ ప్రస్తావించలేదని, ఆ విధంగా దేశ ప్రజలను నిరుత్సాహపరిచారని రంజన్ చౌదరి అన్నారు. చివరకు వందలాది మంది పిల్లలను బలిగొంటున్న మెదడు వాపు వ్యాధి గురించి కూడా మోదీ ప్రస్తావించకపోవడం దారుణమని అన్నారు. దీనిని బట్టి చూస్తే ఆయన ఇం లోక్‌సభ ఎన్నికల విజయోత్సాహం నుంచి బయటపడినట్లు లేదని ఆయన మంగళవారం మీడియా ముందు వ్యాఖ్యానించారు.
మోదీ తన మాటల ద్వారా అందరినీ కలుపుకుని ముందుకెళతారని భావించామని, కానీ అదేమీ జరగలేదన్నారు. పార్లమెంటులో అర్థవంతమైన, నిర్మాణాత్మకమైన వాతావరణాన్ని పెంపొందించడం ద్వారా తదుపరి సభల నిర్వహణకు మోదీ దోహదం చేస్తారని ఆశించామని అలాంటి ధోరణి ఏదీ ఆయన మాటల్లో కనిపించలేదన్నారు.