జాతీయ వార్తలు

అనుమానాలు ఎన్నో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 25: పశ్చిమబెంగాల్‌లో లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకోవడానికి బీజేపీ నాయకత్వం ఎమర్జన్సీ పరిస్థితులను సృష్టించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. ఆ విధంగా ఓట్లను చీల్చిందని ఆమె పేర్కొన్నారు. శనివారం ఇక్కడ జరిగిన తృణమూల్ కాంగ్రెస్ అంతర్గత సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె ‘నేను రాజీనామాకు సిద్ధపడ్డాను. అయితే, పార్టీ దానిని తిరస్కరించింది’ అని వెల్లడించారు. బెంగాల్‌లోని లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లోను ఓట్లను సంపాదించుకోవడానికి బీజేపీ నాయకత్వం మతపరమైన చీలికలు తెచ్చిందని ఆమె ఆరోపించారు. అంతేకాదు, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అత్యద్భుత రీతిలో విజయం సాధించడం పట్ల కూడా ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. ‘బీజేపీ భారీ విజయంపై అనేక అనుమానాలు ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు తుడిచిపెట్టుకుపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియలో ఏదో ‘సెట్టింగ్’ జరిగింది. దీని వెనుక విదేశీ శక్తుల హస్తం కూడా ఉంది’ అని ఆమె అన్నారు.
మమతకు అసెంబ్లీ ఎన్నికలు సవాలే
నరేంద్ర మోదీ హవాతో గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో ఘోరంగా దెబ్బతినడంతో దీని ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏమాత్రం ప్రభావం చూపకుండా ఉండేందుకు తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి తమ పార్టీ కేడర్‌ను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నారు. గత ఏడాది పంచాయతీ ఎన్నికల్లో జరిగిన హింసాత్మక ఘటనల అనంతరం ఆమె మైనారిటీలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 34 ఎంపీ సీట్లు కాస్త 22కు పడిపోయాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో కేవలం 2 ఎంపీ స్థానాలు కలిగిన బీజేపీ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఏకంగా 18 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. దీంతో అప్పటివరకు ఉన్న ఎంపీ సీట్లు కాస్త 22కు దిగజారడంతో టీఎంసీ పార్టీలోని పలువురు స్థానిక నాయకులు అగ్ర నేతలపై విరుచుకుపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ‘ముందుచూపు కొరవడడం’, ‘అహంకారంతో ముందుకు వెళ్లడం’ వంటి ప్రాథమిక అంశాల వల్లే తమ పార్టీకి తక్కువ ఓటింగ్ శాతం పడడానికి హేతువులయ్యాయని వారు ఆరోపిస్తున్నారు. అయితే, గత లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 39 శాతం ఓట్లు సాధించిన తృణమూల్ కాంగ్రెస్ ఈసారి 43 శాతం ఓట్లు పెంచుకోగలిగింది. అయితే, గిరిజనుల జనాభా అత్యధికంగా గల దక్షిణ బెంగాల్‌లోని జంగల్‌మహల్ రీజియన్‌లో మాత్రం ఈసారి గట్టి పట్టును సాధించడంలో టీఎంసీ విఫలమైంది. అదేవిధంగా ఉత్తర బెంగాల్‌లోని టీ గార్డెన్ బెల్ట్‌లో సైతం ఆ పార్టీ పట్టును నిలబెట్టుకోలేకపోయింది.
ఇదిలావుండగా, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లోని మొత్తం 42 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఏకంగా 18 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో 2014నాటి ఎన్నికలతో పోల్చుకుంటే ఈ పార్టీ 17.5 శాతం ఓటింగ్ నుంచి ఒకేసారి 40.5 శాతం వరకు ఓటింగ్ శాతాన్ని పెంచుకుంది. రాష్ట్రంలో ఎక్కువ స్థానాల్లో అధికార టీఎంసీ దక్కించుకున్నా గతంలో కేవలం రెండు స్థానాలే దక్కించుకున్న బీజేపీ ఇపుడు అమాంతం 18 స్థానాలకు ఎగబాకడం టీఎంసీ వర్గాలకు మింగుడుపడడం లేదు. రాష్ట్రంలో బీజేపీ దూకుడును చూస్తుంటే టీఎంసీ నాయకత్వంలో ఒకపక్క భయం..మరోపక్క నిరాశ, నిస్పృహలు ఒకేసారి ఆవరించుకోవడంతో దాని ప్రభావం రానున్న రోజుల్లో ప్రభుత్వ మనుగడకు ముప్పువాటిల్లబోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అధినాయకత్వం పార్టీ కేడర్‌ను పటిష్టం చేసే దిశగా యోచిస్తోంది. ఇదే విషయాన్ని టీఎంసీ సెక్రెటరీ జనరల్ పార్థ చటర్జీ ప్రస్తావిస్తూ రాష్ట్రంలో బీజేపీ ఒకేసారి అత్యధిక స్థానాలు నిలబెట్టుకుని పుంజుకున్నా అతి కేవలం ‘తాత్కాలికమే’నని అభివర్ణించారు. తమ పార్టీపరంగా జరిగిన కొన్ని పొరపాట్ల వల్లే తాము కొన్ని స్థానాలను కోల్పోయామని, కానీ ఇది జరగడానికి గల కారణాలను విశే్లషించడం ద్వారా ముందుకు సాగుతామని ఆయన పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్‌లో 2021లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
పలు జాతీయ సర్వేల ప్రకారం బీజేపీ ఇదే తరహాలో ముందుకు సాగితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్‌లోని 294 స్థానాల్లో కనీసం 130 స్థానాల్లో గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. అయితే, లోక్‌సభ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవడం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బలంగా తయారయ్యేందుకు కిందిస్థాయి నుంచి కేడర్‌ను పటిష్టం చేస్తామని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకరు తెలిపారు.