జాతీయ వార్తలు

మూడో దశలో 66 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఎస్పీ సీనియర్ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ తదితర బడా రాజకీయ నాయకులు పోటీ చేస్తున్న లోక్‌సభ మూడో దశ ఎన్నికల్లో 65.89 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ సందర్భంగా జరిగిన హింసలో ఒక కాంగ్రెస్ కార్యకర్త మరణించగా కేరళలో పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో నిలబడ్డ తొమ్మిది మంది ఓటర్లు వేడికి తట్టుకోలేక అక్కడే అసువులు బాసారు. ఉత్తరాదిన ఇద్దరు పోలింగ్ అధికారులు అనారోగ్యం, వ్యక్తిగత కారణాలతో మరణించారు. పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్ సందర్భంగా పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. టీఎంసీ, కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. పశ్చిమ బెంగాల్, కేరళ, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ యంత్రాలు మొరాయించాయి. దీంతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఓటు వేసేందుకు అరగంటపాటు వేచి చూడాల్సివచ్చింది. దేశం మొత్తం మీద 62 శాతం ఓటింగ్ జరగ్గా అస్సాంలో నాలుగు సీట్లకు 80.73శాతం, బిహార్‌లోని ఐదు సీట్లకు 69.97శాతం, గోవాలోని రెండు లోక్‌సభ సీట్లకు 73.88శాతం, గుజరాత్‌లోని మొత్తం 26 సీట్లకు 63.67 శాతం, జమ్ముకాశ్మీర్‌లోని ఒక సీటుకు 12.86 శాతం, కర్నాటకలో 14కు సీట్లకు 67.64 శాతం, కేరళలో ఇరవై సీట్లకు 71.83 శాతం, మహారాష్టల్రో పధ్నాలుగు సీట్లకు 59.15 శాతం, ఒడిశాలో ఆరు లోక్‌సభ సీట్లకు 60.87 శాతం, త్రిపురలోని ఒక సీటుకు 79.76 శాతం, ఉత్తర్‌ప్రదేశ్‌లోని పది సీట్లకు 61.40 శాతం, పశ్చిమ బెంగాల్‌లోని ఐదు సీట్లకు 79.77 శాతం, చత్తీస్‌గఢ్‌లోని ఏడు సీట్లకు 68.41 శాతం, దాదర్‌నగర్ హవేలీలోని ఒక సీటుకు 71.43 శాతం, డామన్ డయ్యులోని ఒక సీటుకు 71.82శాతం ఓటింగ్ జరిగింది. పధ్నాలుగు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 116 లోక్‌సభ నియోజకవర్గాల్లో మంగళవారం జరిగిన పోలింగ్‌లో దాదాపు పది మంది మరణించినట్లు వార్తలు వచ్చాయి. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్‌లో కాంగ్రెస్, టీఎంసీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్త తియారుల్ కలాం మరణించగా, మహబూబ్ షేక్ (కాంగ్రెస్), తహిజుల్ షేక్ (టీఎంసీ) కార్యకర్తలు గాయపడ్డారు. కేరళలోని వివిధ ప్రాంతాల్లో ఏడుగురు ఓటర్లు అనారోగ్య కారణాల మూలంగా పోలింగ్ కేంద్రాల వద్ద పడిపోయి మరణించినట్లు వార్తలు వచ్చాయి. ఓటర్ల జాబితాలో తన పేరు లేదని తెలియగానే ఒక ఓటరు అక్కడిక్కడే కుప్పకూలినట్లు చెబుతున్నారు. ఇదిలాఉంటే ఇద్దరు పోలింగ్ అధికారులు కూడా మరణించారు. దెంకనాల్‌లోని కనత్‌పాల్ గ్రామంలో ఒక పోలింగ్ అధికారి విధి నిర్వహిస్తూ గుండెపోటుతో మరణించాడు. బూలూర్‌ఘాట్ లోక్‌సభ నియోజకవర్గంలోని దక్షిణ దినాజ్‌పూర్ పరిధిలోని బునియాద్‌పూర్‌లో ఒక పోలింగ్ అధికారి తన ఇంట్లో ఉరి వేసుకుని మరణించాడు. కాగా పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, కాంగ్రెస్ కార్యకర్తలు బాంబులు విసురుకున్న సంఘటనలు చోటుచేసుకున్నాయి. టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. పశ్చిమ బెంగాల్‌లోని ముర్షీదాబాద్ పరిధిలోని రాణినగర్‌లోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద టీఎంసీ, కాంగ్రెస్ కార్యకర్తలు బాంబులు విసురుకున్నారు. మాల్దాలో కూడా హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. మోతీగంజ్‌లో బీజేపీ, టీఎంసీ కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు.
కేరళ, పశ్చమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు చాలాసేపు లైనులో వేచి ఉండవలసి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో పలుచోట్ల ఈవీఎంలు పని చేయలేదని మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆరోపించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అహమదాబాద్ నగరంలోని రణిప్ ప్రాంతంలోని నిషాన్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. గాంధీనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పోలింగ్ కేంద్రం వెలుపల నరేంద్ర మోదీకి స్వాగతం చెప్పి లోపలికి తీసుకుపోయారు. అహ్మదాబాద్ గాంధీనగర్ లోక్‌సభ పరిధిలోకి రావటం గమనార్హం. నరేంద్ర మోదీ ఓపెన్ జీపులో పోలింగ్ స్టేషన్‌కు వచ్చారు. నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్న తరువాత విలేఖరులకు వేలి సిరాను చూపిస్తూ ఉగ్రవాదుల ఐఈడి (ఇంప్రొవైజ్ట్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్) కంటే ఓటరు ఐడి (ఓటరు గుర్తింపు కార్డు) బలం అధికమని చెప్పారు. ఇదిలాఉంటే మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ అస్సాంలోని దిస్పూర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మన్మోహన్ సింగ్ అస్సాం నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించటం తెలిసిందే.

చిత్రాలు.. ఓటు వేసిన అనంతరం వేలికున్న మార్కును చూపుతున్న ప్రధాని నరేంద్ర మోదీ,
*మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, *ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ