జాతీయ వార్తలు

మోదీ సూటుకు గిన్నిస్‌లో చోటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూరత్ (గుజరాత్), ఆగస్టు 20: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గత ఏడాది న్యూఢిల్లీలో పర్యటించినప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ధరించిన మోనోగ్రామ్డ్ సూటు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సూటుగా గిన్నిస్ రికార్డుల పుస్తకంలో చోటు దక్కించుకుంది. ఈ సూటును గత ఏడాది ఫిబ్రవరిలో వేలం వేయగా, గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి, ధర్మానంద్ డైమండ్ కంపెనీ యజమాని లాల్‌జీ భాయ్ పటేల్ రూ.4.31 కోట్లకు కొనుగోలు చేశారు. దీంతో సుమారు ఐదు నెలల క్రితం ఈ సూటుకు ప్రపంచ రికార్డుల్లో చోటు కల్పించాలని కోరడంతో ప్రపంచంలో అత్యంత ఖరైదీన సూటుగా దీనిని గుర్తిస్తున్నట్లు గిన్నిస్ బుక్ నిర్వాహకుల నుంచి రెండు నెలల క్రితం ధ్రువీకరణ పత్రం అందిందని, ప్రపంచ రికార్డుల్లో ఈ సూటుకు చోటు లభించడం ఎంతో గర్వకారణమని లాల్‌జీ భాయ్ పటేల్ కుమారుడు హితేష్ పటేల్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రధాని ‘నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ’ పేరును చారల రూపంలో సువర్ణాక్షరాలతో పొదిగి రూపొందించిన ఈ సూటును వేలంలో 4,31,31,311 రూపాయలకు కొనుగోలు చేసి ప్రజల సందర్శనార్థం తమ సంస్థ రిసెప్షన్ హాలులోని అద్దాల క్యాబిన్‌లో ఉంచామని, ఈ వేలం ద్వారా సేకరించిన సొమ్మును గంగా నది ప్రక్షాళన కార్యక్రమానికి ఉపయోగించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ సూటును వేలం వేయడం ద్వారా మోదీ స్వానురక్తిని చాటుకున్నారని ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. కేవలం ధనికులకోసం పనిచేస్తున్న ‘సూటు-బూటు ప్రభుత్వానికి’ మోదీ నాయకత్వం వహిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిందించారు.

అత్యంత ఖరీదైన సూటులో ప్రధాని నరేంద్ర మోదీ (ఫైల్ ఫొటో)