జాతీయ వార్తలు

సైనా మోకాలికి శస్త్ర చికిత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఆగస్టు 20: మోకాలి గాయంతో బాధపడుతున్న భారత బాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ శనివారం ముంబయిలోని ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకుంది. దీంతో ఆమె నాలుగు నెలల పాటు ఆటకు దూరం కానుంది. ఈ నెల ఆరంభంలో సైనా మోకాలికి తగిలిన గాయం రియో ఒలింపిక్స్‌లో మరింత తీవ్రమవడంతో ఆమెకు శస్త్ర చికిత్స చేశారు. సైనా కుడికాలి మోకాలి చిప్ప నుంచి ఒక ఎముకలోని కొంత భాగం పక్కకు వైదొలగడంతో ఆమె తీవ్రమైన నొప్పితో బాధపడుతోందని, అందుకే ఈ శస్త్ర చికిత్స నిర్వహించాల్సి వచ్చిందని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి వైద్యుడు దిన్షా పార్దీవాలా తెలిపారు.