జాతీయ వార్తలు

భయపెట్టిన మరో డ్రోన్ లాస్ ఏంజెలిస్‌లో తాజా ఘటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజెలిస్, మార్చి 19: అమెరికాలోని లాస్ ఏంజెలిస్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో పైలట్ రహిత డ్రోన్ ఒకటి లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌కు చెందిన జెట్ విమానానికి 200 అడుగుల సమీపంలోకి వచ్చింది. విమానాశ్రయంలో దిగుతున్నప్పుడు మధ్యాహ్నం 1.30 గంటలకు డ్రోన్ ఒకటి తమ విమానంపైగా వెళ్లిందని పైలట్ తెలియజేశాడని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ పాలనా విభాగం ప్రతినిధి ఇయాన్ గ్రెగర్ చెప్పారు. ఆ సమయంలో విమానాశ్రయానికి 14 కిలోమీటర్ల దూరంలో లాస్‌ఏంజెలిస్ శివారు ప్రాంతాల్లో 5 వేల అడుగుల ఎత్తులో విమానం ఎగురుతూ ఉంది. అయతే ఆ తర్వాత విమానం సురక్షితంగా దిగింది. దీనిపై వ్యాఖ్యానించాలంటూ లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌కు పెట్టిన మెస్సేజికి ఎలాంటి సమాధానం రాలేదు. ఈ డ్రోన్‌కోసం ఓ కనే్నసి ఉంచాలని పోలీసులను, లాస్ ఏంజెల్స్ కౌంటీ పోలీసు అధికారి హెలికాప్టర్లను ఆదేశించారు కానీ ఈ డ్రోన్ ఎక్కడినుంచి ప్రయోగించారు, లేదా ఎక్కడ దిగింది అనే దానిపై వెంటనే ఎలాంటి సమాచారం లేదు. ‘డ్రోన్ ఒక విమానాన్ని దాదాపు కూల్చివేసే మరో సంఘటన. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. 200 అడుగుల దూరంలోంచి డ్రోన్ దూసుకుపోవడం అంటే డ్రోన్‌లను నిర్లక్ష్యంగా ఉపయోగించడంవల్ల ఎంతగా ప్రమాదం ఉందో మరోసారి గుర్తుచేస్తోంది’ అని సెనేటర్ డయానె్న ఫీన్‌స్టీన్ పేర్కొన్నారు. డ్రోన్‌లు ఎక్కడ, ఎలా ఎగురవచ్చు, అలాగే ఇలాంటి ప్రమాదాలను తప్పించుకునే సాఫ్ట్‌వేర్‌ను అమర్చుకోవలసిన అవసరాన్ని పేర్కొంటూ గత ఏడాది కాలిఫోర్నియా డెమోక్రటిక్ పార్టీ సెనేటర్ అయిన ఫీన్‌స్టీన్ ఒక బిల్లును ప్రవేశపెట్టారు.

దాదాపుగా పక్షిని పోలి ఉండే డ్రోన్ గనుక విమానం ఇంజన్‌లోకి చొరబడినట్లయితే విమానాలు కూలిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం, పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు డ్రోన్‌లు విమానాన్ని ఢీకొట్టిన సంఘటన ఏదీ జరగనప్పటికీ అవి విమానాలకు దగ్గరగా వచ్చిన సంఘటనలు ఇప్పటివరకు దాదాపు 241 జరిగాయి.

117 కాంతి సంవత్సరాల దూరంలో
కనిపించిన చపలచిత్త గ్రహం!
లాస్ ఏంజెల్స్, మార్చి 19: భూమికి దాదాపు 117 కాంతి సంవత్సరాల దూరంలో మన సౌర కుటుంబానికి వెలుపల ఉండే, ఇప్పటివరకు ఏ గ్రహంలో కూడా కనిపించని అత్యంత చపలచిత్తమైన పరిభ్రమణం కలిగిన ఒక గ్రహాన్ని పరిశోధకులు కనుగొన్నారు. ఇలాంటి అసాధారణమైన పరిభ్రమణం కలిగిన గ్రహాలు తన నక్షత్రానికి అత్యంత చేరువగా వచ్చినప్పుడు ఆ గ్రహంనుంచి కాంతి వెలువడుతుంది. హెచ్‌డి 20782గా పిలవబడే ఈ గ్రహంనుంచి వెలువడే కాంతికి చెందిన సిగ్నల్‌ను శాన్‌ఫ్రాన్సిస్కో స్టేట్ యూనివర్శిటీకి చెందిన శాస్తజ్ఞ్రులు గుర్తించారు. మన సౌర వ్యవస్థకు చెందిన గ్రహాలు దాదాపుగా అన్నీ గుండ్రంగా పరిభ్రమిస్తే ఈ తరహా గ్రహాలు చాలా వరకు అత్యంత అసాధారణమైన పరిభ్రమణం కలిగి ఉన్నట్లు శాస్తజ్ఞ్రులు గుర్తించారు. హెచ్‌డి 20782 గ్రహానికి అత్యంత అసాధారణమైన పరిభ్రమణం కక్ష్య అంటే పాయింట్ 96 కక్ష్య ఉన్నట్లు అంచనా వేశారు. అంటే ఈ గ్రహం దాదాపు నేరుగా అంటే ఒకసారి తన నక్షత్రానికి చాలా దూరంగా వెళ్లి, అంతే వేగంగా దానికి చాలా దగ్గరగా వస్తుంది. ఈ గ్రహం దూరంగా వెళ్లినప్పుడు మన భూమికి, సూర్యుడికి మధ్య ఉన్న దూరానికి రెండున్నర రెట్ల దూరం వెళ్తుంది. అలాగే దగ్గరగా వచ్చినప్పుడు భూమికి, సూర్యుడికి మధ్య ఉన్న దూరంలో 0.06 శాతం అంత సన్నిహితంగా అంటే బుధగ్రహం సూర్యుడి చుట్టూ పరిభ్రమించే దానికన్నా చాలా దగ్గరగా వస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.