క్రీడాభూమి

ముర్రేకు జేజే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

79 ఏళ్ల తర్వాత బ్రిటన్‌కు డేవిస్ కప్
లండన్, నవంబర్ 30: బ్రిటిష్ క్రీడాభిమానులంతా ఆండీ ముర్రేకు జేజేలు పలుకుతున్నారు. ప్రతిష్ఠాత్మక డేవిస్ కప్ టెన్నిస్ ట్రోఫీని బ్రిటన్ 79 సంవత్సరాల తర్వాత కైవసం చేసుకోవడంలో ముర్రే కీలక పాత్ర పోషించడమే అందుకు కారణం. 1936 తర్వాత బ్రిటన్‌కు డేవిస్ కప్ లభించడం ఇదే మొదటిసారి. బెల్జియంతో జరిగిన పోరులో బ్రిటన్ 3-1 తేడాతో విజయభేరి మోగించింది. మొదటి మ్యాచ్‌లో కైల్ ఎడ్మండ్‌ను ఢీకొన్న బెల్జియం క్రీడాకారుడు డేవిడ్ గోఫిన్ 3-6, 1-6, 6-2, 6-1, 6-0 తేడాతో విజయం సాధించాడు. మొదటి రెండు సెట్లను కోల్పోయినప్పటికీ అతను పట్టుదలతో మిగతా మూడు సెట్లలో ఎదురుదాడికి దిగి గెలుపొందడం విశేషం. అయితే, మొదటి మ్యాచ్‌తోనే 1-0 ఆధిక్యాన్ని సంపాదించిన ఆనందం బెల్జియంకు ఎక్కువ సేపు నిలవలేదు. రూబెన్ బెమెల్మన్స్‌ను 6-2, 6-2, 7-5 తేడాతో వరుస సెట్లలో ఓడించిన ఆండీ ముర్రే స్కోరును సమం చేశాడు. ఆతర్వాత తన సోదరుడు జెమీ ముర్రేతో కలిసి అతను స్టీవ్ డార్సిస్, డేవిడ్ గోఫిన్ జోడీపై 6-4, 4-6, 6-3, 6-2 తేడాతో గెలుపొందాడు. దీనితో బ్రిటన్‌కు 2-1 ఆధిక్యం లభించింది. అనంతరం డేవిడ్ గోఫిన్‌ను ఆండీ ముర్రే 6-3, 7-5, 6-3 స్కోరుతో చిత్తుచేసి, బ్రిటన్‌కు తిరుగులేని విధంగా 3-1 ఆధిక్యాన్ని అందించాడు. ఫలితంగా కైల్ ఎడ్మండ్, రూబెన్ బెమెల్మన్స్ మధ్య జరగాల్సిన చివరి మ్యాచ్ రద్దయింది. (చిత్రం) సహచరుల కేరింతల మధ్య డేవిస్ కప్ ట్రోఫీతో బ్రిటిష్ టెన్నిస్ స్టార్ ఆండీ ముర్రే