జాతీయ వార్తలు

నిన్న బెంగళూరు.. నేడు అమరావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత్- సింగపూర్ బంధం అద్వితీయం
వాణిజ్యపరంగా మరింత మమేకమవుదాం
సింగపూర్ లెక్చర్‌లో ప్రధాని మోదీ పిలుపు

సింగపూర్, నవంబర్ 23: బెంగళూరు ఐటి పార్క్ మొదలుకుని ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి వరకూ భారత్‌లోని అనేక రాష్ట్రాలతో సింగపూర్‌కు బలమైన వ్యాపార, వాణిజ్య, సాంస్కృతిక బంధం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మలేసియా పర్యటనను ముగించుకుని సోమవారం సింగపూర్ చేరుకున్న ఆయన ప్రతిష్టాత్మ ‘సింగపూర్ లెక్చర్’ ఇచ్చారు. సముద్రాలు, సైబర్, రోదసీని తదుపరి అభివృద్ధి కేంద్రాలుగా మార్చాలే తప్ప సంగ్రామ కేంద్రాలుగా మార్చవద్దన్నారు. దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనా- తూర్పు ఆసియా దేశాల మధ్య సంఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మోదీ ఇచ్చిన పిలుపు అంతర్జాతీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. సరిహద్దు సమస్య దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నప్పటికీ భారత్- చైనాలు శాంతియుత సంబంధాలనే కొనసాగిస్తున్నాయని తెలిపారు. పరస్పర సహకార ప్రాతిపదికన భవిష్యత్‌ను నిర్మించుకోవడానికి అన్ని దేశాలూ కలిసిరావాలన్నారు. ఇందుకు తూర్పు ఆసియా ఫోరం, ఇతర కేంద్రాలు బలంగా పనిచేయాలన్నారు. తూర్పు ఆసియాలోని దేశాలతోనే కాకుండా అమెరికా, రష్యా వంటి దేశాలతో అన్ని విధాలుగా కలిసి పని చేయడానికి భారత్ సిద్ధంగా ఉందన్నారు. సముద్రాలు, రోదసీ, సైబర్ ప్రపంచం ఉమ్మడి అభివృద్ధి కేంద్రాలుగా మారాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు. భారత అభివృద్ధిలో సింగపూర్‌కు మరింత భాగస్వామ్యం కల్పిస్తామని, వ్యాపార, వాణిజ్య పరంగా మమేకమవుతామని తెలిపారు. ఇప్పటి వరకూ అనేక మంది భారత నేతలు సింగపూర్ లెక్చర్ ఇచ్చారని, వారి అడుగుజాడల్లోనే తానూ ముందుకు సాగుతున్నానని తెలిపారు. మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాం, మాజీ ప్రధానులు పివి నరసింహారావు, వాజపేయి తదితరులు గతంలో సింగపూర్ లెచ్చర్ ఇచ్చారు. కలలను వాస్తవాలుగా మార్చుకోవడం ఎలానో సింగపూర్ అభివృద్ధి కళ్లకు కట్టిందన్నారు. సింగపూర్ అభివృద్ధి ఎందరో భారతీయులకు స్ఫూర్తిదాయకమని, అనేక సంక్షోభ సమయాల్లో ఇరు దేశాలూ కలిసి పని చేశామని మోదీ తెలిపారు. (చిత్రం) సింగపూర్ లెక్చర్ ఇచ్చిన నరేంద్ర మోదీకి ప్రత్యేక బహుమతిని అందించి సత్కరిస్తున్న సింగపూర్ ఉప ప్రధాని ధార్మన్ షణ్ముగరత్నం