జాతీయ వార్తలు

తీవ్రవాదం ప్రపంచానికి పెనుభూతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాంతీయ కోణంలో చూడవద్దు
ఇటీవల వివిధ దేశాల్లో జరిగిన దాడులే నిదర్శనం
ప్రపంచమంతా ఏకమై సంఘటితంగా పోరాడాలి
తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో మోదీ ఉద్ఘాటన

కౌలాలంపూర్, నవంబర్ 22: ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలను పట్టిపీడిస్తున్న తీవ్రవాదం ప్రాంతీయ సమస్య కాదని, ఈ సమస్యను తుదముట్టించేందుకు ప్రపంచ దేశాలన్నీ సరికొత్త వ్యూహాలను అనుసరించాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇటీవల వివిధ దేశాల్లో జరిగిన తీవ్రవాద దాడుల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఆదివారం ఆయన తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగిస్తూ, ఇప్పటివరకూ తీవ్రవాదాన్ని ప్రాంతీయ సమస్యగా భావించామని, కానీ ఈ సమస్య ప్రపంచంలోని ఎన్నో దేశాలను పట్టిపీడిస్తున్నట్లు ఇటీవల పారిస్, అంకారా, బీరుట్, మాలీ తదితర దేశాలతో పాటు రష్యా విమానంపై జరిగిన దాడులు స్పష్టం చేస్తున్నాయన్నారు. తీవ్రవాదానికి ఏ దేశం వత్తాసు పలకరాదని, ఈ సమస్యను అంతమొందించేందుకు ప్రపంచ దేశాలన్నీ ఏకమై రాజకీయాలకు అతీతంగా సరికొత్త వ్యూవహాలను అవలంబించాల్సిన అవసరం ఎంతో ఉందని ఆయన స్పష్టం చేశారు. మతం నుంచి తీవ్రవాదాన్ని వేరుచేయాలన్న నిబద్ధతను, అన్ని మతాలు ప్రవచిస్తున్న మానవతా విలువలను పెంపొందించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను మోదీ స్వాగతించారు.
తూర్పు ఆసియా సమష్టి అభివృద్ధికి ఈ శిఖరాగ్ర సమావేశమే కీలక వేదిక అని, అంతర్జాతీయ సవాళ్లు, సమస్యలకు పరిష్కారానికి ప్రపంచమంతా ఇప్పటికీ తూర్పు ఆసియా వైపే చూస్తోందని ఆయన అన్నారు. వాతావరణ మార్పులపై త్వరలో పారిస్‌లో జరిగే చర్చలు పర్యావరణ సమస్యలపై స్పష్టమైన, సమతూకంతో కూడిన కార్యాచరణను ఖరారు చేసేందుకు మాత్రమే పరిమితం కాకుండా తీవ్రవాదంపై పోరులో ప్రపంచం వెనుకంజ వేసే ప్రసక్తే లేదన్న సందేశాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని మోదీ వక్కాణించారు. ఆసియాన్ నేతృత్వంలో జరుగుతున్న భద్రతా చర్చలు, సహకార వేదికల్లో భారత్ చురుకుగా పాల్గొంటున్న విషయాన్ని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేస్తూ సమ్మిళితమైన, సమతూకంతో కూడిన, పారదర్శకమైన ప్రాంతీయ భద్రతా, సహకార వ్యవస్థ ఏర్పాటుకు తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం మద్దతు కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అంతర్జాతీయ నియమ నిబంధనలకు కట్టుబడుతూనే ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు తూర్పు ఆసియా దేశాలు మరింత నిబద్ధతతో కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. (చిత్రం) కౌలాలంపూర్‌లో ఆదివారం జరిగిన తూర్పు-ఆసియా దేశాల శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న మోదీ