జాతీయ వార్తలు

కాశ్మీర్ సిఎంగా మెహబూబా ప్రమాణ స్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్: జమ్ము-కాశ్మీర్ తొలి మహిళా సిఎంగా పిడిపి అధినేత్రి మెహబూబా ముఫ్తీ సోమవారం ఉదయం రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సిఎంగా బిజెపి నేత నిర్మల్ సింగ్, కొందరు మంత్రులు కూడా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి బిజెపి తరఫున కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా హాజరయ్యారు. 87 మంది సభ్యులున్న కాశ్మీర్ అసెంబ్లీలో పిడిపి, బిజెపి సభ్యులతో మెహబూబా నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితికి తెరపడినట్లయ్యింది. అసెంబ్లీలో పిడిపికి 27 మంది, బిజెపికి 25 మంది సభ్యులున్నారు.