జాతీయ వార్తలు

ఎమ్మెల్సీ మనోరమకు బెయిల్ ‘నో’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గయ (బిహార్): మద్యం సీసాలను అక్రమంగా నిల్వ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జెడియు ఎమ్మెల్సీ మనోరమాదేవికి బెయిల్ ఇచ్చేందుకు ఇక్కడి కోర్టు నిరాకరించింది. మనోరమ కుమారుడు రాకీ యాదవ్ గయ పట్టణంలో పట్టపగలు నడిరోడ్డుపై ఓ యువకుడిని తుపాకీలో కాల్చి చంపిన కేసులో అరెస్టు కాగా, ఆ కేసు విచారణలో సహకరించనందుకు మనోరమపై కూడా పోలీసులు కేసు పెట్టారు. రాకీ కోసం గాలిస్తుండగా మనోరమ ఇంట్లో మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమెను ఇదివరకే జెడియు నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ ప్రకటించారు.