జాతీయ వార్తలు

తప్పయిపోయింది.. క్షమించండి.. !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: పార్లమెంటు వద్ద భద్రతావ్యవస్థను ఎలా ఛేదించాలో సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సామాజిక వెబ్‌సైట్లలో పోస్టు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపి భగవంత్ మాన్ చివరకు క్షమాపణలు చెప్పారు. తక్షణం తన ముందు హాజరుకావాలంటూ ఆయనకు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సమన్లు జారీ చేశారు. దీంతో భగవంత్ మాన్ శుక్రవారం ఉదయం స్పీకర్‌ను కలిశారు. పార్లమెంటు భద్రతకు సంబంధించిన అంశాలను ప్రపంచానికి తెలిసేలా చేయడం క్షమించరాని నేరమని స్పీకర్ ఆయనను మందలించారు. దీంతో తాను చేసింది తప్పేనని, ఇక ముందు ఇలాంటి పనులు చేయనని మాన్ స్పీకర్‌ను వేడుకున్నారు. పార్లమెంటు సభ్యుల భద్రతను ప్రమాదంలో పడేయడం సరైనది కాదని స్పీకర్ మండిపడ్డారు. కాగా, క్షమాపణలు చెప్పినంత మాత్రాన భగవంత్ మాన్‌ను వదిలేయకూడదని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్లమెంటులో పలువురు ఎంపీలు పట్టుబట్టారు. మాన్‌పై స్పీకర్ చర్య ఎలా ఉంటుందన్న విషయం ఇపుడు చర్చనీయాంశమైంది.