జాతీయ వార్తలు

లోక్‌సభ స్పీకర్ ఎదుట హాజరైన భగవంత్ మాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: భద్రతా వ్యవస్థను ఛేదించి పార్లమెంటులోకి వెళ్లడంపై ఓ వీడియో తీసి సామాజిక మీడియాలో పోస్టు చేసిన ఆమ్‌ఆద్మీ పార్టీ ఎంపి భగవంత్ మాన్ వ్యవహారంపై శుక్రవారం పార్లమెంటు ఉభయసభల్లో కాంగ్రెస్, బిజెపి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఎదుట వెంటనే హాజరు కావాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ భగవంత్ మాన్‌కు సమన్లు జారీ చేశారు. దీంతో ఆయన స్పీకర్ ఎదుట హాజరై సుమారు 20 నిమిషాలపాటు వివరణ ఇచ్చారు. పార్లమెంటు భద్రతకు సంబంధించి వీడియో తీసిన భగవంత్‌మాన్‌పై చర్యలు తీసుకోవాలని రాజ్యసభలో మంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్ చేశారు. చేసిన తప్పును మళ్లీ చేస్తానంటున్న ఆప్ ఎంపీపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో సభ నిర్ణయించాలని ఆమె అన్నారు.