జాతీయ వార్తలు

బెంగాల్‌లో ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా: బెంగాల్‌లోని ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రేగిన ఆందోళనలు బెంగాల్‌ను తాకాయి. సోషల్‌మీడియాలో అసత్య ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను ఐదు జిల్లాల్లో నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మాల్దా, ముర్షీదాబాద్, హౌవ్‌డా, నార్త్ 24 పరగణా, సౌత్ 24 పరగణా జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. దేశ వ్యాప్తంగా పౌరసత్వ వ్యతిరేక ఉద్యమాలుతీవ్రస్థాయిలో హింసాత్మక మలుపు తిరిగాయి.పశ్చిమ బెంగాల్‌లో ఆందోళనకారులు శనివారం సాయంత్రం ఐదు ఖాళీ రైళ్లను దగ్ధం చేశారు. ముర్షీదాబాద్ జిల్లాలోని లాల్‌గోలా రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులు ఈ విధ్వంసానికి పాల్పడ్డారు. రాష్టవ్య్రాప్తంగా రైలు, రోడ్డు సర్వీసులను దిగ్బంధనం చేశారు. ఇప్పటివరకు ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైన ఈ ‘క్యాబ్’ వ్యతిరేక ఘటనలు తాజా ఘటనతో పశ్చిమ బెంగాల్‌లోనూ రగులుకున్నట్టు అయింది. హౌరా ప్రాంతంలోని సంక్రాయిల్ రైల్వే స్టేషన్‌కు వందలాదిగా తరలివచ్చిన ఆందోళనకారులు ఒక భాగాన్ని దగ్ధం చేశారు. అలాగే, సమీపంలోని కొన్ని దుకాణాలకు నిప్పుపెట్టారు. అనంతరం రైల్వే స్టేషన్ కాంప్లెక్స్‌లోకి ప్రవేశించి టికెట్ కౌంటర్‌ను తగులబెట్టారు. శాంతియుతంగానే నిరసన ప్రదర్శన చేయాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, గవర్నర్ ధన్‌కర్ అప్పీలు చేసినప్పటికీ పశ్చిమ బెంగాల్‌లో హింసాకాండ తీవ్ర స్థాయిలోనే కొనసాగుతోంది.