జాతీయ వార్తలు

రక్షణ బంధానికి బలిమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు భారత్-మలేసియా నిర్ణయం
పుత్రజయ, నవంబర్ 23: రక్షణ రంగంలో సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, మలేసియా నిర్ణయించాయి. పెను సవాల్‌గా మారిన ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ఉమ్మడిపోరు సాగించాలని ఇరుదేశాలు భావించాయి. భద్రత, రక్షణ రంగాల్లో వ్యూహాత్మక ఒప్పందానికి రెండు దేశాలు అంగీకరించాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ, మలేసియా ప్రధాని నజీబ్ రజాక్‌లు ఈ మేరకు పలు అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇరువురు ప్రధానులు ఇక్కడ సంయుక్తంగా మీడియాతో మాట్లాడుతూ భారత్, మలేసియాల మధ్య సంబంధాలు మరింత పటిష్టం కావాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదానికి, మతానికి ఎలాంటి సంబంధం లేదని, అయితే హింసవల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇరుదేశాధినేతల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ఓ అధికారిక ప్రకటన చేశారు. ఏ రూపంలో ఉన్నప్పటికీ ఉగ్రవాద కార్యకలాపాలను ముక్తకంఠంలో ఖండించాలని పిలుపునిచ్చారు. ఉగ్రవాద సంస్థలు, ఉగ్రవాదులను ఆశ్రయం కల్పించడం, వారి నిధులు సమకూర్చడం వంటివాటికి దూరంగా ఉండాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేశారు. ఇరుదేశాల మధ్య ధృడమైన సంబంధాలకు సంపూర్ణ పరస్పర సహకారం అందించుకోవాలన్నారు. సాంప్రదాయ, సాంప్రదాయేతర దాడుల విషయంలోనూ భారత్, మలేసియాలు కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ప్రజాస్వామ్యం, బహుళత్వం, అభివృద్ధికి అంకిభావంతో పనిచేయాలని అంగీకరించాయి. సైబర్ భద్రతకు సంబంధించి ఇరుదేశాలు ఒప్పందానికి వచ్చాయని ఆ ప్రకటనలో వెల్లడించారు.(చిత్రం) భారత్-మలేసియా బంధానికి గుర్తుగా కౌలాలంపూర్‌లో ‘తోరణ గేట్’ ప్రారంభించిన అనంతరం స్థానికులకు అభివాదం చేస్తున్న ప్రధాన మంత్రులు నజీబ్ రజాక్, నరేంద్ర మోదీ