మెయిన్ ఫీచర్

తడబడుతున్న తరుణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహిళ అంటే ఒక ఆట వస్తువు (సుఖాలు ఇచ్చేది) గా భావించే భావజాలం ఇంకా సమసిపోలేదనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ.కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 2011 జనాభా లెక్కల వివరాలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా చెప్పుకోవచ్చు. దేశ జనాభా 121 కోట్లు కాగా, అందులో 58 కోట్ల మంది వివాహితులు. భార్యలు 29.3 కోట్లు కాగా, భర్తలు (వివాహిత పురుషులు) 28.7 కోట్లు మాత్రమే. దీనిని బట్టి పలువురు రెండు అంతకంటే ఎక్కువ వివాహాలు చేసుకొంటున్నట్లుగా వెల్లడి అవుతున్నది.
ప్రభుత్వం బాల్య వివాహాలను నిషేధించినప్పటికీ, దేశంలోని పలు ప్రాంతాలలో బాల్య వివాహాలు యధేచ్ఛగా జరుగుతున్నాయి. ఒకవైపు భ్రూణ హత్యలు మరోవైపు బాల్య వివాహాలు, ఇంకొకవైపు లైంగిక దాడులతో మహిళాలోకం ముప్పేట దాడిని ఎదుర్కొంటున్నది. బాల్య వివాహాలలో రాజస్థాన్ ప్రథమ స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో కేవలం పది సంవత్సరాలకే ఆడపిల్లలకు వివాహాలు జరుగుతున్నాయి. బాల్య వివాహాలలో రాజస్థాన్ తరువాత స్థానాలలో మహారాష్ట్ర, గోవా, గుజరాత్‌లు ఉండటం గమనార్హం. బాల్య వివాహాలకు ప్రధాన కారణం, నిరక్షరాస్యత కన్నా కూడా ఆడపిల్ల అంటే గుండెలమీద కుంపటి అనే భావం సమాజంలో బలంగా నాటుకుపోవడమే. బాల్య వివాహాలలో మొదటి నాలుగు స్థానాలలో ఉన్న రాష్ట్రాలలో ఒక్క రాజస్థాన్ మినహా, మిగిలిన మూడు రాష్ట్రాలు అభివృద్ధి పరంగా ముందంజలో ఉన్నాయి. బాల్య వివాహా లు కారణంగానే మన దేశంలో మాతా శిశు మరణాలు ఎక్కు వగా ఉన్నాయి. బాల్య వివాహాలు కారణం కలిగే దుష్పరిణామాలపట్ల ప్రజలను చైతన్యపరచడానికి అటు ప్రభుత్వం ఇటు స్వచ్ఛంద సేవా సంస్థ లు కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2011వ సంవత్సరంలో 7.8 లక్షల మంది బాలికలు కేవలం 15 సంవత్సరాల వయస్సులోపే తొలి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ విధంగా పుట్టిన పిల్లల్లో 50 వేలమంది పురిటిలోనే మరణించారు. ఇది ఇలా ఉం డగా, దేశంలో భర్తల అకాల మరణం కారణంగా వైధవ్యం కు గురవుతున్న మహిళల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్నది. 2001 జనా భా లెక్కల ప్రకారం, దేశ జనాభా 102 కోట్లు కాగా, అందు లో వైధ వ్యం కలిగినవారు 18.5 లక్షలమందే. అంటే దేశ జనాభాలో వీరి శాతం కేవలం 07. శాతం మాత్రమే. 2011 జనా భా లెక్కల నాటికి దేశ జనాభా 121 కోట్లకు పెరగగా, వైధవ్యం కలిగినవారి సంఖ్య కూడా 5.6 కోట్లకు చేరుకొంది. అంటే దేశ జనాభాలో వీరి శాతం 4.6 అయిందన్నమాట. వైధవ్యం కలిగిన మహిళలు ఎక్కువగా కేరళలో 6.7 శాతం, తమిళనాలో 6.4 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 6 శాతం, కర్ణాటకలో 5.7 శాతం, హిమాచల్‌ప్రదేశ్‌లో 5.3 శాతం, మధ్యప్రదేశ్‌లో 4.9 శాతం ఉన్నారు. అంటే గత దశాబ్దకాలంలో వైధవ్యం కలిగిన మహిళల సంఖ్య దేశ జనాభాలో 3.9 శాతం పెరిగిందన్నమాట. దీనినిబట్టి చూస్తే, దేశంలో పురుషుల కన్నా మహిళల జీవన ఆయుర్దాయం పెరిగిందన్నమాట. గత దశాబ్దకాలంలో దేశంలో మద్యం వినియోగం గణనీయంగా పెరిగింది. ఆదాయం కోసం పలు రాష్ట్ర ప్రభుత్వాలు మద్యపానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. మద్యపానానికి పురుషులు ఎక్కువగా బానిసలుగా మారి, వ్యాధిగ్రస్తులై మరణిస్తున్నారు. దీనివలన నష్టపోతున్నది కూడా మహిళలే. వైధవ్యం కలిగిన మహిళ అంటే అందరికీ చులకనే. వైధవ్యం అనేది మహిళల పాలిట పెను శాపంగా మారుతున్నది. ఉదాహరణకు, మధుర సమీపంలోని బృందావనంను చెప్పుకోవచ్చు. భర్త చనిపోడంతో తమ ఆలనా పాలనా పట్టించుకునే దిక్కు లేక పలువురు మహిళలు బృందావనం చేరుకొంటున్నారు. దక్షిణ భారతదేశంలో మాదిరిగా ఉత్తర భారతదేశంలోని దేవాలయాలలో ఉచిత భోజనం ఉండదు. అందువలన వితంతువు కావడంతో ఇంటినుంచి గెంటివేయబడి న మహిళ లు చావడానికి ధైర్యం లేక బృందావనం చేరతారు. బృం దావనంలో ఉండే వితంతువులలో ఎక్కువశాతం మంది బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందినవారే.
వీరు తన ఆకలి తీర్చుకోవడానికి బృందావనంలో భిక్షాటన చేస్తూంటారు. బృందావనంలో వితంతువులు బిచ్చగత్తెలుగా దీనాతిదీనమైన జీవనం గడుపుతున్నారు. వైధవ్యం అనేది వారు కోరుకున్నది కాదు. వారిని ఆదుకోవాల్సిన అవసరం సభ్య సమాజంపై ఉంది. అందరూ సమాజం మారాలి, సమాజం మారాలి అనే రంకెలు వేసేవారే తప్ప, తాము కూడా సమాజంలో భాగమేనన్న విషయాన్ని మరచిపోతున్నారు. మనం మారితే సమాజం కూడా బాగుపడుతుందనే విషయాన్ని అందరూ మరచిపోతున్నారు. ఇది దురదృష్టకరం. మహిళలు అడుగడుగునా దోపిడీకి గురవుతున్నారు. దీనికి ఫుల్‌స్టాప్ పెట్టాలంటే ముందు మహిళల ఆలోచనా సరళిలో మార్పు రావాలి. కష్టాలలో ఉన్న తోటి మహిళలను ఆదుకోవడంతోపాటు, బాలికలు, బాలురు సమానమేనన్న భావనను చిరుప్రాయంనుంచి తమ పిల్లల్లో కలుగజేయాల్సింది తల్లులే. మహిళల ఆలోచనా సరళిలో మార్పు రానంతవరకు వారు అణచివేతకు గురవుతూనే ఉంటారు.

- హైమావతి