మెయిన్ ఫీచర్

యువ సైనికుడు రోయంగ్‌లో మొనగాడు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దత్తూ భోకనాల్ ఇండియన్ ఆర్మీలో జాయిన్ అయిన యువ సైనికుడు. దేశభక్తి మెండుగా ఉన్న ఈ యువకుడి నేడు దేశం గర్వించే క్రీడాకారుడిగా రాణిస్తున్నాడు. 2016 రియో ఒలింపిక్స్‌కు ఎంపికైన తొలి భారత రోవర్. కరువు తాండవించే ఓ కుగ్రామం నుంచి వచ్చిన ఈ యువకుడి శారీర సౌష్టవం, గుండెల్లో నింపుకున్న దేశభక్తి అతనిని మంచి క్రీడాకారునిగా తీర్చిదిద్దింది. దక్షిణ కొరియాలో జరిగిన ఆసియన్ ఓసినియా ఒలింపిక్‌లో వెండి పతకాన్ని సాధించాడు. ఈ ఆనందం ఇతరులతో పంచుకోకుండానే తల్లి అనారోగ్యం బారిన పడటంతో ఇంటికి తిరిగిరావల్సి ఉంది. కన్నకొడుకు సాధించిన విజయాన్ని ఆస్వాదించే స్థితిలో తల్లి లేకపోవటంతో భోకనాల్ హృదయం బాధగా మూలిగింది. కుటుంబ సమస్యలు వెంటాడుతున్న భోకనాల్ క్రీడలలో కనబరిచే ప్రతిభా పాటవాలపై మాత్రం మక్కువ కోల్పోలేదు. మరింత కష్టపడి దేశానికి ఒలింపిక్ మెడల్‌ను తీసుకురావాలని కలలు కంటున్నాడు.
మహారాష్టల్రోని తలెగావ్ ప్రాం తానికి చెందిన ఇరవై నాలుగేళ్ల భోకనాల్ పేద రైతు కుటుంబానికి చెందినవాడు. తలెగావ్‌లో గత కొనే్నళ్ల నుంచి కరవు విలయతాండవం చేస్తోంది. బోర్లు వేసినా చుక్కనీరు పడకపోవటంతో పంటలు పండక ఆ కుటుంబం అల్లాడుతోంది. చిన్నతనం నుంచే చదువుకుంటూ తండ్రికి పొలం పనులలో సహాయపడేవాడు. తండ్రీ కొడుకులు కష్టపడితేగానీ ఆ కుటుంబంలో నాలుగువేళ్లు నోట్లోకి వెళ్లవు. దురదృష్టవశాత్తు తండ్రి ఉపాధి కోసం వలసబాట పట్టారు. పసిప్రాయం నుంచే కష్టపడేతత్వంగల భోకనాల్ ఆటలలో ప్రతిభాపాటవాలు కనబర్చేవాడు.
2014లో జరిగిన జాతీయస్థాయి పోటీల లో రెండు బంగారు పతకాలు సంపాదించాడు. ఇలా ఆట లో బంగారు పతకాలు సాధిస్తూనే పెట్రోల్ బంక్‌లో రూ.5000ల వేతనంతో పనిచేసేవాడు. అలా పనిచేస్తున్న నేపథ్యంలోనే తన కలలను సాకారం చేసుకునేందు కు ఇండియన్ ఆర్మీలో జాయి న్ అయ్యాడు. సీనియర్స్ చేసిన సూచనలు మేరకు రోవింగ్‌లో శిక్షణ తీసుకునేందుకు మక్కువ చూపాడు. ఎందుకంటే ఆరు అడుగుల నాలుగ అంగుళాలు ఉన్న భోకనాల్ ఈ రోవింగ్ ఆటలో మంచి ఆట కనబరచగలడని సీనియర్ ఆర్మీ అధికారులు సూచన మేరకు ఆయన ఈ రంగంవైపు అడుగులు వేశాడు. వాస్తవానికి నాకు ఈత అంటే ఏమిటో తెలియదు. కాని పూణెలో శిక్షణ తీసుకుంటున్నపుడు నాలోని ఈతగాడు బయటపడ్డాడని భోకనాల్ వెల్లడించారు. రోయింగ్ శిక్షణను తేలికగా అంచనావేస్తూ మొదటిరోజు శిక్షణ కోసం వెళ్లాడు. బోట్ వైఫల్యం చెందటంతో నీళ్లలోకి పడబోయాడు. వెనుకనే ఉన్న భద్రతా సిబ్బంది రక్షించటంతో ప్రాణాలు నిలుపుకున్నాడు. మూడు నెలల శిక్షణ తరువాత ఎలా పడవకు తెడ్డు వేయగలనో తెలుసుకోగలిగాడు. సంవత్సరం తరువాత రోవర్‌గా మారాడు. ఆ తరువాత క్రీడలను ఆనందంగా ఆస్వాదించే మనస్తత్వాన్ని పెంపొందించుకున్నాడు. 2014లో జాతీయ స్థాయి పోటీలలో రెండు బంగారు పతకాలను సాధించటంతో ఇక వెనుదిరిగి చూడకుండా ముందుకు సాగుతున్నాడు. ఒలింపిక్ పతకం సాధించి దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషిచేస్తున్న భోకనాల్ అంతర్జాతీయ క్రీడాకారుడిగా అతనికి ఒకేఒక కోరిక ఉందట! అదేమిటంటే తన గ్రామానికి నీళ్లు తీసుకురావటం
.