మెయన్ ఫీచర్

దేశ రక్షణ గాలిలో దీపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏప్రిల్ 22న నేపాల్‌లో ఒక సంఘటన జరిగింది. అక్కడి ప్రధానమంత్రిని కొందరు ప్రముఖ రాజకీయ నాయకులు కలిశారు. వారు ఇలా కోరారు.‘‘గత పదిహేను సంవత్సరాగా నేపాల్‌లో అంతర్యుద్ధం నడిచింది. అప్పుడు ఎందరిపైనో అప్పటి ప్రభుత్వాలు కేసులు పెట్టాయి. వాటినన్నింటిని ఇప్పుడు మీరు రద్దు చేయాలి,’’ అని. అందుకు నేపాల్ ప్రధాని అంగీకరించారు. ఎందుకంటే నేపాల్‌లో ఇప్పుడు వెనకటి హిందూ రాజ్యాంగం లేదు. ప్రస్తుతం భట్టారాయ్ వంటి చైనా ప్రేరేపిత ఉగ్రవాదులతో రూపొందించబడిన సెక్యులర్ రాజ్యాంగం ఉంది. ఉద్యమకాలంలో ఎన్నో గ్రంథాలయాలను, భవనాలను తగులబెట్టారు. ఎందరో హత్యలకు గురయ్యారు. ఇందులో ఇలాంటి కేసులన్నీ ప్రస్తుతం రద్దుచేయబడుతున్నాయి. అంటే టిబెట్టును ఆక్రమించుకున్నట్టే, నేపాల్‌ను కూడా చైనా తన చక్రబంధంలోకి తీసుకుంటున్నదని అర్థం. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సల్మాన్ ఖుర్షీద్ విదేశాంగ మంత్రిగా ఉన్నారు. ఆయనకు నేపాల్ ఎలాపోతే ఎవరికి కావాలి? అనుకున్నాడు. అందువల్ల నేపాల్ పరిణామాలను పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత నేపాల్‌లో భూకంపాలు వచ్చాయి. ఫలితంగా అక్కడి చారిత్రక చిహ్నాలు నేలమట్టమైనాయి.
నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రభుత్వం ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన తర్వాత నేపాల్‌ను ఎన్నోవిధాలుగా ఆదుకున్నది. ఐనా అక్కడి చైనా ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలవారు ఇండో-నేపాల్ మైత్రికి అడుగడుగునా అడ్డంకులు కల్పించారు. గౌతమ బుద్ధుడు జన్మించిన లుంబిని ఇక్కడే ఉంది. హిమాలయాల పాదసానువులలోని ప్రశాంత నేపాలం నేడు ప్రాచీన అస్తిత్వాన్ని కోల్పోయింది. ఇది ఎలా జరిగింది? జవహర్‌లాల్ నెహ్రూ 1955 తర్వాత టిబెట్‌ను చైనాకు దానం చేస్తే మన్మోహనన్ సింగ్, సోనియాలు 2010 తర్వాత నేపాల్‌ను చైనాకు అప్పగించారు.
ఈ సరిహద్దు(బఫర్) రాజ్యాన్ని శత్రుదేశానికి అప్పగించడం వల్ల! ఇది వ్యూహాత్మకంగా ఎంత పెద్ద పొరపాటో రాజకీయ విశే్లషకులందరికీ తెలుసు. ఆంగ్లంలో అతిపెద్ద తప్పు ఏదైనా జరిగితే ‘హిమాలయన్ బ్లండర్’ అంటారు. ఇదొక నుడికారం. తెలుగులో దీన్ని ‘కొండంత తప్పు’ అనవచ్చు. ఇది మనకళ్లముందే జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొందరు ప్రముఖులు ప్రభుత్వాన్ని కలిసి ఉద్యమకాలంలోని నేరస్థులపై కేసులు ఎత్తివేయాలని కోరారు. అందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు. ఇక్కడ కేసులను ఉపసంహరించుకోవడమంటే, చైనా ప్రేరేపిత ఉగ్రవాద సంఘాలకు ప్రత్యక్షంగా మద్దతునిచ్చినట్టే అయింది.
ఇక కాశ్మీరు నామమాత్రంగానే భారతదేశంలో అంతర్భాగంగా ఉన్నది కాని, అక్కడ భారతీయత లేదు. ‘నిట్’లోని హిందూ విద్యార్థులను తరిమివేశారు. కాశ్మీరీ హిందూ పండిట్ కుటుంబాలను వేల సంఖ్యలో తరిమివేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని కొన్ని భాగాలను చైనా దత్తత తీసుకుంది. సింధూనదిపై ఆనకట్టలు కట్టారు. ఈ సంఘటనలన్నీ భారత విదేశాంగ విధాన వైఫల్యానికి అద్దం పడుతున్నాయి.్భరత్ తన విదేశాంగ విధానంలో ఒక నిర్దిష్ట వైఖరి మొదట్నుంచీ అవలంబించినట్లయితే ఈ సమస్యలు వచ్చేవి కావు.
నెహ్రూ భార్య పేరు కమలమ్మ. ఆమె మరణించాక నెహ్రూ తన ప్రేమనంతా కుమార్తెవైపునకు మరలించారు. ఆమెను తన తర్వాత ప్రధానిగా చూడాలనుకున్నారు. అదే జరిగింది. ఇందిరాగాంధీ తన కాలంలో తన ప్రియపుత్రుడు సంజయ్ గాంధీని ప్రధాని కావాలని కోరుకుంది. అతను 1976లో అకాలమరణం పాలయ్యాడు. అందువల్ల రాజీవ్‌గాంధీకి అనువంశిక పట్ట్భాషేకం జరిగింది. ఆ తర్వాత ఆయన భార్య భారతదేశాన్ని మూడు దశాబ్దాలపాటు ఏలింది. ఇలా కుటుంబ పాలనను కాపాడుకోవడంకోసం దేశాన్ని త్యాగం చేశారు. విదేశాంగనీతిని గాలికి వదిలేశారు. చైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నది. అరుణాచల్ ప్రదేశ్‌లో భారత మంత్రి ఎకె ఆంటోనీ పర్యటిస్తుంటే, ‘ఇక్కడ నీకేం పని?’ అంటూ చైనా గద్దించింది. అప్పట్లో భారత రాష్టప్రతి ప్రతిభాపాటిల్‌కు ఇదేగతి పట్టింది. ఐనా సోనియాగాంధీ పట్టించుకోలేదు. ఎందువల్ల? ఆమెకు ఇక్కడి సంస్కృతితో ఎట్టి సంబంధమూ లేదు. కేవలం భారత్ ఒక బంగారుగుడ్లు పెట్టే బాతు అంతే!
సారాంశం ఏమంటే చైనా సామ్రాజ్యవాద విస్తరణవాదం, అమెరికా సామ్రాజ్య విస్తరణవాదం లాంటిదే..ఐతే ఈ దేశంలోని విభిన్న వర్గాలు అమెరికా సామ్రాజ్యవాదాన్ని మాత్రమే నిందించి చైనా సామ్రాజ్యవాదాన్ని స్వాగతించాయి. దీనికి పరిష్కారం నరేంద్ర మోదీ ప్రభుత్వం చూపగలుగుతుందని ఆశిద్దాం. సోనియాగాంధీకి కేంద్రంలో సంఖ్యాబలం లేనప్పుడు ఆమె ప్రకాశ్‌కరత్ మీద ఆధారపడింది. అందుకు కారత్‌గారు ‘మద్దతునిస్తాం కానీ మా అజెండాను అమలు చేయాలి’ అని స్పష్టంగా షరతు విధించారు. అధికారాన్ని ఏదోవిధంగా నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో సోనియాగాంధి ఆ షరతులకు అంగీకరించింది. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, వాటి పాఠ్య ప్రణాళికను, బోధనా సంస్థలు, కళా సాంస్కృతిక రంగాలు, పూనా ఫిలిం ఫెస్టివల్ ఇన్‌స్టిట్యూట్, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయాలు, పద్మపురస్కార కమిటీలు, సంగీత, సాహిత్య అకాడమీలు ఇత్యాదులు ప్రకాశ్‌కారత్ వర్గానికి అప్పగించాలి. తాను చెప్పిన వారినే పరిశోధనా సంస్థల అధిపతులుగా నియమించాలి. తాము చెప్పిన చిత్రాలకే పురస్కారాలు ఇవ్వాలి. ఈ షరతులన్నింటికీ సోనియాగాంధీ ఒప్పుకుంది. ఈ విధంగా భారతదేశంపై చైనా పరోక్షంగా సాంస్కృతిక విజయం సాధించినట్లయింది. ఎవరైనా భారత్ మాతాకీ జై అనినా, జై శ్రీరాం అనినా, వందేమాతరం, సుజలాం సుఫ లాం అన్నవారిని కాషాయ ఉగ్రవాదులు అని నిందించడం మొదలుపెట్టారు. ఈ వికృత రూపాన్ని గత ఫిబ్రవరి 9న జెఎన్‌యులో వీడియో సాక్షిగా బయటపడింది. అంటే నేపాల్‌లో వచ్చినట్టే ఇక్కడ అంతర్యుద్ధం వస్తే ఇక్కడి ప్రజలు పరస్పరం పొడుచుకొని చస్తే, చైనాకు ఆనందం. చిన్నగా ఇక్కడ తన ప్రాబల్యాన్ని మరింతగా పెంచుకోవచ్చుననేది దాని ఆలోచన.
2008లోమాలెగావ్‌లో సిమీ ఉగ్రవాదులు బాంబులు పేలిస్తే ఇది హిందూ ఉగ్రవాదచర్య అన్నారు. ఆత్మాహుతి బాంబర్ ఇశ్రాత్ జహాను అహ్మదాబాద్‌లో తన అనుచరులతో ప్రవేశిస్తే ఆమె బిహార్ ముద్దుబిడ్డ అన్నారు. హిందూ ఉగ్రవాది నరేంద్రమోదీ చేతిలో ఆమె మరణించిందని పాకిస్తాన్‌లోని గద్వా టైమ్స్ పత్రిక వ్యాఖ్యానించింది. మనదేశంలో కపిల్ సిబల్, వేణీప్రసాద్ వర్మ, సుప్రియ చతుర్వేది, మనీష్ తివారి వంటి సోనియా అనుచరవర్గం ఊరూరా తిరిగి ఇశ్రాత్ జహాన్ వీరమరణం పొందింది అని ప్రచారం చేసివచ్చారు. 125 కోట్ల మంది ప్రజలు గల దేశం ఇలాంటి దుర్మార్గపు ప్రచారాలకు ఎందుకు స్పందించలేదు.
‘ఐదు నిమిషాలు భారత సైన్యం దూరంగా ఉంటే చాలు భారతదేశంలో హిందువులను ఏంచేస్తామో చూడండి,’’ ఇవీ అసదుద్దీన్ ఒవైసీ మాటలు. అంటే భారత్ ఇటు పాకిస్తాన్‌నుండి, చైనానుండి, రోమన్ క్యాథలిక్ సోనియానుండి ఏకకాలంలో ప్రమాదం ఎదుర్కొంటున్నది. అయినా ఎవరూ పట్టించుకోవడంలేదు. కృపాల్ సింగ్ అనే భారత పౌరుణ్ణి వాఘా సరిహద్దు వద్ద అపహరించి పాతికేళ్లు గూఢచారి అనే కేసు కింద పాకిస్తాన్ జైలులో పెడితే ఒక్కరూ స్పందించలేదు. ఇతడు ఉగ్రవాది కాదని లాహోరు హైకోర్టు తీర్పు ఇచ్చింది కూడా. అయినా అతడిని విడిపించేందుకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వంకాని, 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన నరేంద్రమోదీ ప్రభుత్వ కాని ఎట్టి చర్యలు తీసుకోలేదు.
కొద్ది రోజుల క్రితం అతను చంపబడిన తర్వాత మృతదేహాన్ని పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌కు పంపారు. మృతదేహానికి గుండె, పొట్ట, లివర్ వంటి భాగాలు లేవు. అంటే శవాన్ని ముక్కలు చేసి 2016, ఏప్రిల్ 18న పంపారు. ఆయన కుటుంబ సభ్యులు కొద్దిమంది తప్ప కన్నీరు కార్చినవారు లేరు. అగస్టా ఛాపర్ కుంభకోణంలో వైమానిక దళాధిపతి,కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలికి ముడుపులు ముట్టాయని ఆరోపణలు వచ్చాయి. లంచాలు ఇచ్చినవారికి ఇటలీకి చెందిన మిలన్ కోర్టు శిక్షించింది. మరి వీటిని పుచ్చుకున్నవారి మాటేంటి? ఒక దేశంలో ఇటువంటి ఉన్నతస్థాయి వ్యక్తుల మీద అవినీతి ఆరోపణలు వస్తే ఆదేశ భద్రత ప్రశ్నార్థకవౌతుంది. ఇది చైనా పాకిస్తాన్‌లకు ఆనందం కలిగించే అంశం. మిలన్ జడ్జిమెంట్‌లో పొడి అక్షరాలతో కొన్ని పేర్లున్నాయి. ఎ.పి. అంటే ఏమిటి. ఆనందీ బెన్ పటేల్ (గుజరాత్ ముఖ్యమంత్రి) అంటున్నారు రాజ్యసభలో అభిషేక్ సింఘ్వి. ఎపి అంటే అకౌంట్ పేరుూ అంటున్నారు అహ్మద్ పటేల్. ఇది కూడా కాదు ఎందుకంటే ఈ ముడుపులు ఆయా వ్యక్తుల అకౌంట్లలోకే నేరుగా చేరాయి కదా! ఎపి అంటే అహ్మద్ పటేల్ అని మిలన్ అప్పీలు కోర్టు జడ్జి మైగో మార్కొ చాలా స్పష్టంగా చెప్పారు.
మరోవిషయం. వాద్రా కుంభకోణం, అగస్టా ఛాపర్, రాఫెల్ ట్రైనీ విమానాల కుంభకోణాలు జరిగినప్పుడు యుపిఎ ప్రభుత్వం సిపిఎం మద్దతుతో నడుస్తోంది. ఇక రెండవ అశం..ఇంత జరిగినా సంకీర్ణ ధర్మం పేరుతో మన్మోహన్ సింగ్ చూస్తూ ఊరుకున్నారు. మొన్న పనె్నండు మంది జైషే ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులను అరెస్ట్ చేసినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కెజ్రీవాల్ ఏవిధంగా వ్యవహరించాలి? కాని ఆయన ప్రవర్తనాశైలి విచిత్రంగా ఉంది. అటు ఉగ్రవాదులు ఢిల్లీలోకి ప్రవేశిస్తే..కేజ్రీవాల్..నరేంద్ర మోదీ బిఎ డిగ్రీ ఎక్కడ చదివాడో సర్ట్ఫికెట్ చూపండి అంటూ రాజకీయ పోరు సాగిస్తున్నాడు. మరి సిగ్నోరా గాంధీ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చదువుతున్నట్టు చెప్పుకుంటోంది కదా. మరి ఆమె సర్ట్ఫికెట్లను చూపండి అని ఎందుకు అడుగలేదు?

-ముదిగొండ శివప్రసాద్