మెయన్ ఫీచర్

కాంగ్రెస్ మెడకు ‘అగస్టా’ ఉచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగస్త్యుడు ఒక భారతీయ ఋషి. ఈయన సముద్రయానం చేసి విదేశాలకు వెళ్లి అక్కడ భారతీయ సంస్కృతిని ప్రచారం చేశాడు. ఆయన పేరు తర్వాతి కాలంలో రోమన్ చక్రవర్తులు పెట్టుకున్నారు. అగస్టీన్ పేరుమీద ఆగస్టు నెల ఏర్పడింది! దేశ విదేశాలలో అగస్టా వంటి సంస్థలు ఏర్పడ్డాయి. మెకానికా ఇండస్ట్రీస్‌కు అనుబంధ సంస్థ అగస్టా ఛాపర్ ప్రొడక్షన్ ఇండస్ట్రీ. దీని కేంద్ర కార్యాలయం ఇటలీలో ఉంది. ఎ.కె. ఆంటోనీ భారత రక్షణశాఖ మంత్రిగా ఉన్న కాలంలో ఇటలీకి చెందిన అగస్టా సంస్థ నుంచి భారత ప్రభుత్వం కొన్ని హెలికాప్టర్లను కొనుగోలు చేసింది. ఈ లావాదేవీల్లో కొందరు కాంగ్రెస్ ప్రముఖులకు ముడుపులు ముట్టాయి. అవి 8 నుంచి 15 శాతం వరకు ఉన్నాయి. ఈ రహస్యఫైళ్లు 2016, ఏప్రిల్ 25 తర్వాత నరేంద్రమోదీ పాలనా కాలంలో వెలుగులోకి వచ్చాయి. ఇటలీలోని కోర్టు అగస్టా ఛాపర్ కేసు లావాదేవీలపై విచారణ జరిపి భారత్‌లోని రాజకీయ నాయకులకు ఈ సంస్థ ముడుపులు సమర్పించిందని తీర్పు చెప్పింది. ముడుపులు సమర్పించిన ఇటలీ సంస్థకు ఐదువేల డాలర్ల జరిమానా విధించింది. ఇంకేముంది కుమార్ కేతుర్ (మహారాష్ట్ర), రాజీవ్ దేశాయ్ (గుజరాత్) వంటి వారు రంగంలోకి దిగి ఇది కక్షసాధింపు చర్య అంటూ గగ్గోలు పెట్టారు. గమనించాల్సిన అంశమేమంటే 2013లో ఎ.కె. ఆంటోని ఈ కేసు ఫైలును మూసివేయించారు.
ఫిన్ మెకానికా అనే కంపెనీ వివిఐపిలకు హెలికాప్టర్లను అందిస్తుంది. ఇది ఇటలీ సంస్థ. అగస్టా దీనికి మాతృ సంస్థ. క్రిస్టియన్ మైఖేల్ ఈ సంస్థకు బ్రోకర్‌గా వ్యవహరించాడు. ఈ లావాదేవీలో 8నుంచి 15 శాతం వరకు ముడుపులు చెల్లించారు. వీటి విలువ 30 మిలియన్ల యూరోలు! ఆ మొత్తం సోనియాగాంధీ, మన్‌మోహన్ సింగ్, ఎస్.పి. త్యాగి, ఆయన సోదరులకు ముట్టినట్టు ఆరోపణ. ఎస్.పి. త్యాగి అప్పటి ఐఎఎఫ్‌లో ఎయిర్ మార్షల్. తాను డబ్బు తినలేదని స్పష్టంగా పేర్కొన్నాడు. మన్‌మోహన్ సింగ్ డబ్బు తీసుకున్నాడంటే ఎవ్వరూ నమ్మరు. కాబట్టి ఈమొత్తం సోనియాగాంధీ, రాహుల్ గాంధీ అకౌంట్లలోకే వెళ్లి ఉంటాయని తేలుతున్నది. ఇటలీ కోర్టు 250 పేజీలు తీర్పు వెలువరించింది. అందులో ఈ పేర్లున్నాయి.
ఇక్కడ రెండు అంశాలున్నాయి. అప్పటి ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ లోక్‌సభలో ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు అప్పటి రక్షణమంత్రి ఎ.కె. ఆంటోని తాము ఈ కంపెనీలను బ్లాక్ లిస్టులోపెట్టినట్టు చెప్పారు. అంతేకాని ముడుపులు అందలేదని చెప్పలేదు. 2016, ఏప్రిల్ 26న ఇటలీ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మళ్లీ మనదేశ మీడియాలో స్పందన మొదలైంది. అప్పుడు ఎ.కె. ఆంటోనీ..‘‘ముడుపులు అప్పుడు కొందరికి అందినమాట నిజమే. ఇప్పుడైనా దర్యాప్తు జరపండి’’ అని నరేంద్ర మోదీని ప్రోత్సహించడం గమనార్హం.
ఇంత జరిగినా నాయకులు రాజీవ్ దేశాయ్, సంజయ్ హెడ్గే, ఆనంద శర్మలు సోనియాగాంధీని వెనకేసుకొని వస్తున్నారు. కక్షసాధింపు అంటున్నారు. కాని అసలు విషయమేమంటే ఈ డాక్యుమెంట్‌ను విడుదల చేసింది ఇటలీ కోర్టుగాని, మనదేశ కోర్టు కాదు. రాహుల్ నర్వేకర్ అనే మరో కాంగ్రెస్ ప్రవక్త మరొక అడుగు ముందుకేసి ఇటలీ కోర్టు అబద్ధం చెబుతున్నది అన్నారు. 2013లో ఈ అంశంపై విచారణ జరపకుండా కపిల్ సిబల్ ఎందుకు ఆపేశారు? ఇటలీ కోర్టు తీర్పు 193వ పేజీలో సోనియాగాంధీ పేరు, 165వ పుటలో ఎస్.పి. త్యాగి సోదరుల పేర్లు ఉదహరించబడ్డాయి. అప్పట్లో ఎ.కె. ఆంటోని రక్షణశాఖ మంత్రి. ఎస్.పి. త్యాగి మాట్లాడుతూ, ‘‘తమ ఎయిర్ మార్షల్ కార్యాలయంలో ఇటువంటి కొనుగోలుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోరు’’ అన్నారు. అంటే ఆంటోనీ గారే తీసుకోవాలి. మనందరికీ తెలిసినంతవరకు ఎ.కె.ఆంటోని నిజాయతీపరుడనే పేరుంది. అంటే సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు ఈ నిర్ణయం తీసుకున్నారని సందర్భ సాక్ష్యాన్ని గ్రహించవచ్చు. అంటే ఇటలీ కోర్టు తీర్పును బట్టి కూడా ముడుపుల భోక్తలు కూడా వీరేననేది స్పష్టం. దేశ రక్షణ రంగంలో ఇంతపెద్ద కుంభకోణం జరగడం దేశ భద్రతకు, ప్రతిష్టకు శుభసూచికం కాదు. ఈ అంశం 2016, ఏప్రిల్ 16న పార్లమెంట్‌లో చర్చకు వచ్చింది.
2016, ఏప్రిల్ 27న త్యాగి మాట్లాడుతూ ‘‘నన్ను దోషిగా ఇటలీ కోర్టు ఆరోపించిందని అంటున్నారు. అదే నిజమైతే మొత్తం వ్యవస్థే నేరపూరితమైనదని అనుకోవలసి వస్తుంది. యుపిఎ, ఎన్‌డిఎ, వాజ్‌పేయి, మన్మోహన్ సింగ్, బ్రిజేశ్ మిశ్రా, ఎం.కె. నారాయణన్ అందరూ దొంగలేనా?’’ అని ప్రశ్నించారు. ఇప్పుడు సిబిఐ రంగంలోకి దిగింది. మొత్తం రూ.3600 కోట్ల ముడుపులు అగస్టా వెస్ట్‌లాండ్ నుండి భారతీయ రాజకీయ నాయకులకు అందినట్లు ప్రాథమిక సమాచారం నిర్ధారించింది. అటు ఇటలీకి, ఇటు ఇండియాకు సంధాన కర్తగా వ్యవహరించినవాడు క్రిస్టియన్ మైఖేల్. ప్రస్తుతం ఇతగాడు లండన్‌లో ఉన్నాడు. అతడిని అప్పగించాలని ఇంటర్‌పోల్ ఏజెన్సీని అభ్యర్థించింది.
గ్లైడో హస్కే, పీటర్ హుల్లెట్ రహస్య సంభాషణల టేపులు వెలుగులోకి వచ్చాయి. వీరు అప్పటి వెస్ట్‌లాండ్ ఛాపర్ సంస్థకు మధ్యవర్తులు. క్రిస్టియన్ మైఖేల్ రాసిన చేతివ్రాత ప్రతిలో కొంత సంక్షిప్త కోడ్ ఉంది. దాన్ని విశే్లషిస్తే మనకు తేలే సారాంశమేమంటే : ‘పిఒఎల్’- అంటే భారత రాజకీయ నాయకులు అని అర్థం. జెఎస్ అంటే జాయింట్ సెక్రెటరీ- ఇక రాజకీయ నేతల్లో అహ్మద్ పటేల్ వంటి వారి పేర్లు ఈ రహస్య పత్రాల్లో ఉన్నాయి. సోనియా పేరు సిగ్నోరా గాంధీ అని ఉంది. సోనియాకు ఆర్థిక సలహాదారులుగా వ్యవహరించి ముడుపులు అందుకున్న వారిలో ఆస్కార్ ఫెర్నాండెజ్ పేరు కూడా ఉంది. ప్రణబ్ ముఖర్జీ ఆర్థిక మంత్రి తర్వాత రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఒప్పందాలు కుదిరాయి. ఇటలీలోని మిలన్ కోర్టు క్రిస్టియన్ మైఖేల్ చేతిరాత ప్రతిని పరిగణలోకి తీసుకొని ఆ పేర్లను తన తీర్పులో పేర్కొంది. ఈ మైఖేల్ ఎంతటి ప్రభావశాలి అంటే ఇటు భారత్- అటు ఇటలీ ప్రధానమంత్రులు, రక్షణ మంత్రులతో మాట్లాడగలడు అని పేర్కొంది. ‘‘ఇండియాలోని కాంగ్రెస్ పార్టీ నాయకులకు భారీగా లంచాలు ఇచ్చినందుకు మిమ్మల్ని శిక్షిస్తున్నాను’’ అని మిలన్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పులో 193వ పేజీలో సోనియా గాంధీ పేరు, 163-164 పేజీల్లో మన్మోహన్ సింగ్ పేరు ఉంది. ఇటలీ ప్రధాని మారియో మోంటే, రాయబారి టెర్రా షియానో పేర్లు కూడా జడ్జిమెంట్ కాపీలో ఉన్నాయి. బహుశా అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలకు వీరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండవచ్చు.
ఫిన్‌మెకానికా మాజీ సిఇఓ గుసెప్పి ఓర్సికి క్రిస్టియన్ మైఖేల్ 2016 ఏప్రిల్ 27న ఈవిధంగా చెప్పాడు. ‘‘్భరత రాజకీయాల్లో సోనియాగాంధీ చాలా కీలకపాత్ర పోషిస్తున్నది. ఐతే గాంధీలతోనాకు ప్రత్యక్ష సంబంధాలు లేవు. మా ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవాలనుకోవడం తప్పెలా అవుతుంది?’’ ఈ అంశంపై లోక్‌సభలో, రాజ్యసభలో చర్చలు జరిగాయి. కొత్తగా సభ్యుడైన సుబ్రహ్మణ్యస్వామి ఘాటుగా గణాంకాలతో సహా మాట్లాడారు. ఆయన్ను మాట్లాడనీయకుండా కాంగ్రెస్ సభ్యులు అడ్డుకున్నారు. సోనియాగాంధీ ఏప్రిల్ 27న మాట్లాడుతూ ‘‘గత రెండేళ్లుగా నాపై కేసులు పెట్టి నా శీల హననం చేస్తున్నారు. అందుకు నేనేమీ భయపడను. నేనేమీ లంచాలు తీసుకోలేదు. ఆధారాలుంటే నిరూపించుకోవచ్చు,’’ అన్నారు.
ఈ మొత్తం వ్యవహారంలో వెలికి రాని కొన్ని చిక్కుముడులు కొన్ని ఉన్నాయి. అగస్టా ఒప్పందాన్ని రద్దు చేసిన తర్వాత నాటి రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోని విచారణ ఎందుకు చేపట్టలేదు? ఆ డబ్బు మొత్తం ఎవరి అకౌంట్లలోకి పోయింది? ఇటలీలోని బినామీ పేర్లతో ఉన్న అకౌంట్లలోకి వెళ్లి ఉంటే ఆ విషయాన్ని యుపిఎ ప్రభుత్వం ఎందుకు విచారించలేదు? ఇక రెండో అంశం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వం అగస్టాపై నిషేధం ఎత్తివేసింది. మోదీ, ఇటలీ ప్రధానుల మధ్య జరిగిన సంభాషణ వివరాలేంటి? సీక్రెట్ అకౌంట్ల పేర్లు వెల్లడించాల్సిందిగా మోదీ, ఇటలీ ప్రధానిని కోరినట్టు అనధికార వార్త. దేశాన్ని రక్షించాల్సిన త్రివిధ దళాధిపతుల్లో ఒకరిని వివాదంలోకి లాగడం దేశ భద్రత రీత్యా శ్రేయస్కరం కాదు. సోనియాగాంధీ నాటిన విష బీజాలు మెల్లగా పెరిగి దుష్ట ఫలాలు ఇవ్వడం మొదలు పెట్టాయి. క్రిస్టియన్ మైఖేల్ 1993 నుంచి దాదాపు వందసార్లు ఇండియాకు వచ్చి కాంగ్రెస్ నాయకులతో డీల్ కుదుర్చుకున్నాడు. ఇటాలియన్ ప్రాసిక్యూటర్లు విడుదల చేసిన లక్షా అరవై అయిదువేల డాక్యుమెంట్ల ఆధారంగా సిబిఐ ఛార్జ్‌షీటు తయారు చేస్తున్నది.
‘‘రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉంటూ ఎన్‌డిఎ నిద్ర పోతున్నదా? ఇది క్రిమినల్ నెగ్లిజెన్స్’’ అని మాజీ రక్షణ మంత్రి ఎ.కె. ఆంటోనీ అన్నారు.‘‘మేం బ్లాక్ లిస్టులో పెట్టిన కంపెనీని మేకిన్ ఇండియా కింద మళ్లీ ఎట్లా తీసువచ్చారు?’’ అని సూటిగా ప్రశ్నించారు. వీటికి ఎన్‌డిఎ వారు ఏదో ఒక సమాధానం చెప్పవచ్చు. కాని ఇక్కడ ప్రధాన విషయం ఏమంటే కోట్ల రూపాయల ముడుపులు సోనియా అండ్ కంపెనీకి ముట్టాయా? లేదా? అనేది. ముట్టి ఉంటే ఆ డబ్బు ఇప్పుడెక్కడ ఉంది? అగస్టాతో బాటు నాలుగు కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టినట్టు ఎ.కె.ఆంటోనీ చెప్పారు. కానీ 2014, జూలై 3న ఈ బ్లాక్ లిస్టు కాపీ విడుదలైంది. అంటే అప్పుడు ఎన్‌డిఎ అధికారంలో ఉంది కదా? మరి మనం ఎవరి మాటలను నమ్మాలి? ఇప్పుడు ఏం జరుగుతుంది? వాయుతరంగాల కేసులో చిదంబరం బలిపశువు అయినట్లే అగస్టాలో త్యాగి, అహమ్మద్ పటేల్‌లు బలిపశువులు కావచ్చు.

- ముదిగొండ శివ ప్రసాద్