మెయిన్ ఫీచర్

కళకు వయసు అడ్డంకి కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ము ప్ఫై ఏళ్ళు నిండకుండానే ఉస్సురస్సురంటూ నిట్టూర్చేవారికి చక్కని స్ఫూర్తి.. కాస్త వయసు మళ్లగానే ఇంకేం చేయలేం.. మూలన కూర్చొని ముచ్చట్లాడుకోవడం తప్ప అనుకునేవారికి మార్గదర్శకురాలు ఈ బామ్మగారు. ఇంతకీ ఈ బామ్మగారు సాధించిన ఘనకార్యమేంటని అనుకుంటున్నారా..? చెవులు పనిచేయక, కనులు సరిగా కనిపించక ముదివగ్గుకు అసలైన ప్రతిరూపంలా ఉన్న భానుమతీరావు 92 సంవత్సరాల వయసులో బెంగళూరులో స్టేజిమీద అద్భుతమైన నాట్య ప్రదర్శన ఇచ్చి, ఏదైనా చెయ్యాలంటే వయసు అడ్డంకి కాదని నిరూపించారు. ఆ ప్రదర్శన ఏదో నాలుగు ముద్రలు చూపించడం కాకుండా ఎంతో ఉత్సాహంగా, చురుగ్గా నాట్యం చేసి అందరూ ముక్కుమీద వేలేసుకునేలా చేసారు. ఆమె కుమార్తె ఈ నృత్య ప్రదర్శనను చిత్రీకరించి యూట్యూబ్‌లో పెడితే దాదాపు ఆరు లక్షలమంది చూశారట. 92 ఏళ్ళ వయసులో ఇంత చురుకైన నాట్య ప్రదర్శన అంటే మాటలా మరి..!
1923లో కేరళలోని కోజికోడ్‌లో జన్మించిన భానుమతీరావు చక్కటి నృత్యకారిణి. భరతనాట్యం, కథకళి నృత్యాలను అనేకచోట్ల ప్రదర్శించారు. వివిధ దేశాలలో నాట్య కళాకారిణిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. నృత్య కళాకారిణిగానే కాదు, సామాజిక కార్యకలాపాలలో కూడా ఆమె చురుగ్గానే పాల్గొనేవారట. యుద్ధ బాధితుల సహాయనిధి కోసం విదేశాల్లో అనేక ప్రదర్శనలిచ్చారు. మన తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సమక్షంలోనూ ఆమె నాట్య ప్రదర్శన ఇచ్చారు.
స్ర్తిలు ఇంటి నుంచి బయటకు రావడం కూడా అరుదుగా ఉండే ఆ రోజుల్లో భానుమతీరావు 22 సంవత్సరాల వయసులో లండన్ వెళ్లి ఉన్నత విద్యాభ్యాసం చేశారు. 1940లలో ప్రసిద్ధ నృత్యకారుడు రామ్‌గోపాల్ బృందంతోపాటు నృత్యప్రదర్శనలిస్తూ యూరప్ అంతా పర్యటించారు. లండన్‌లో ప్రదర్శన ఇచ్చిన సమయంలోనే న్యాయశాస్త్ర నిపుణుడిగా అంతర్జాతీయ ఖ్యాతి నార్జించిన కృష్ణారావు ఆమె నృత్యానికి ప్రభావితుడై ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహానంతరం న్యూయార్క్‌లో స్థిరపడిన భానుమతీరావు అక్కడ ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. సంప్రదాయ నృత్యరీతులకు మరిన్ని సొగసులద్ది, ఎన్నో ప్రయోగాత్మక ప్రదర్శనలు నిర్వహించి విదేశీయుల మన్ననలు అందుకున్నారు.
స్వాతంత్య్రానంతరం భర్తతోపాటు తిరిగి మాతృదేశానికి వచ్చారు. అప్పటినుండి ఆమె ఎంతోమందికి తన విద్యను అందించారు. 1990 వరకు ఎంతోమంది శిష్యులను తయారుచేసిన ఈమె తొంభైలలో తన వ్యాపకాలన్నిటినీ పక్కన పెట్టేసి హిమాచల్‌ప్రదేశ్‌లోని చిన్మయానందాశ్రమంలో చేరారు. ఆ తరువాత చాలా ఏళ్ల పాటు తన కార్యకలాపాలకు దూరంగానే ఉన్నారు.
కొద్ది నెలల క్రితం బెంగళూరులోని తన కుమార్తె దగ్గరకు వచ్చినపుడు మళ్లీ తన నృత్య శిక్షణను మొదలుపెట్టారు. ఆ సందర్భంలోనే అభినయ గ్రూప్ అకాడమీ వారి అభ్యర్థన మేరకు బెంగళూరు భారతీయ విద్యాభవన్‌లో గత ఏడాది డిసెంబరు 5వ తేదీన 92 ఏళ్ల వయసులో అద్భుతమైన ప్రదర్శననిచ్చారు. వృద్ధాప్యం కారణంగా కొన్ని శారీరక సమస్యలున్నప్పటికీ, తన మనసుకు మాత్రం ముసలితనం రాలేదని ఆమె చెబుతుంటారు. లైబ్రరీ సైన్స్‌లో పట్టానందుకున్నా, నృత్యం తనకెంతో ఇష్టమైన విషయమని, ఈనాటికీ నృత్యం గురించి తలచుకుంటే తన మనసు ఉర్రూతలూగుతుందని అంటారామె.

-మావూరు విజయలక్ష్మి