మెయిన్ ఫీచర్

జీవితమే పాఠాలు నేర్పింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పురుషాధిక్యమేలే మన దేశ సినీ, రాజకీయ రంగాల్లోకి ఓ యువతి కెరటం వలే దూసుకువచ్చింది. ఆటుపోట్లనెన్నింటినో ఎదుర్కొని పడిన ప్రతిసారి సునామీలా ఎగిసిపడింది. మూడు పదులు దాటిన వయసు నుంచే ఏటికి ఎదురీది అశేష ప్రజానీకం నోరారా ‘అమ్మ’అని పిలుచుకునే స్థాయికి ఎదిగింది. ఎంజీఆర్ అనే రాజకీయ పాఠశాలలో రాజకీయ ఓనమాలు దిద్దుకున్నది. అంచెలంచెలుగా ఎదిగే క్రమంలో ఎదురైన అవమానాలను, అవహేళనలను అధిగమించి అన్నాడిఎంకే అనే రాజకీయపార్టీని తన భుజస్కంధాలపై వేసుకుని దేశ రాజకీయాలను కంటిచూపుతో శాసించే స్థాయికి ఎదిగిన ఈ ‘పురుచ్చితలైవి’ ఓ రాజకీయ ధీర.
**
తన జీవితంపై ఎవరికీ ఆధిపత్యం చెలాయించే అవకాశాన్ని ఇవ్వకుండా పరిస్థితులకు ఎదురు
తిరగటాన్ని అలవాటు చేసుకుంది. ‘‘మా అందం కావాలి. మేము కావాలి. కాని పాలిటిక్స్‌లో రావటానికి జనం ఇష్టపడరు’’ అనే జయలలిత వలే చాలామంది నటీనటులు రాజకీయాల్లోకి వచ్చారు. కాని వారంతా కొద్ది కాలం మాత్రమే రాణించగలిగారు. ఎంజీఆర్, ఎన్టీయార్ తరువాత ఓ నటి ఈ స్థాయికి ఎదగటం అనేది భారతదేశ చరిత్రలోనే లేదు. కాని అలాంటి చరిత్ర ఆమె సొంతం చేసుకుంది. సహనటుడు ఎంజీఆర్ అండతో రాజకీయ అడుగులు వేసినా తన అడుగులను బలంగా మోపి వారసురాలిగా తానేమిటో నిరూపించుకునేందుకు, పార్టీని చేతుల్లోకి తీసుకునే విషయంలో ఆమె అడుగడుగునా పోరాటాలే చేసింది. కాని ఆ పోరాటం బయటకు కనిపించకుండా విజయాన్ని సొంతం చేసుకోవటం జయలలిత వౌనం వెనుక ఉన్న విజయ రహస్యం.
**
ప్రతి పోఠాటంలోనూ పడిలేచిన కెరటమే
క్యారెక్టర్ ఆర్టిస్ట్ కుమార్తెగా ఆగమనం .. ‘అమ్మ’గా నిష్క్రమణం
దేశ రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర
‘‘పుట్టినప్పటి నుంచి యుక్తవయసు వచ్చే వరకు నా జీవితమంతా కష్టాలే. తదనంతర జీవితంలోనూ అకారణంగా, అధిగమించలేని అడ్డంకులు ఎదురయ్యాయి. నాకు ఎదురైన కష్టాలను మొండిదానిగా ఎదురుతిరిగి పోరాడటమే నేర్చుకున్నాను. ఇలా చేయటం వల్లనే ఈ రోజు మీ ముందు ఇలా ఓ వ్యక్తిగా నిలబడగలిగాను’’- జయలలిత
**
ఒకేఒక శక్తిగా ఎదిగింది..
‘‘మాటలతో నీ శక్తిని వృధాచేయకు. అలా నిగూఢమైన శక్తి నిన్ను శక్తివంతం చేస్తుందనే’ మాటను అక్షరాల ఆచరణలో చూపిన జయలలిత పుట్టినప్పటి నుంచి ఒంటరితనాన్ని అలవాటు చేసుకుని శక్తినంతా కూడదీసుకుని ఎన్ని ఆటుపోట్లనైనా ఎదుర్కొనే శక్తిలా పసి వయసు నుంచి అలవర్చుకుంది. అలాంటి శక్తిగా ఎదిగి తన వెనుక అశేష తమిళ ప్రజానీకాన్ని, అన్నాడిఎంకేను తన పాదాక్రాంతం చేసుకుంది. పుస్తకాలను తన నేస్తాలుగా చేసుకుని ఆలోచనాశైలిలోనూ, మేథస్సులో ఓ మహావృక్షంగా ఎదిగింది.
ఇలా ఎదిగిన వృక్షం నీడలో సహజంగానే మొక్కలు ఎదగలేవు. ఇది రాజకీయ రంగంలో మహిళలు ఎదగటానికీ, ఓ విధంగా రాణించటానికీ దోహదం చేస్తుంది. అవినీతి అక్రమాల కేసులు ఆమెపై దాదాపు 11 వరకు నమోదైనా.. ఓటమిపాలైనా.. కిందపడిన ప్రతిసారి సునామీ వలే ఎగసిపడింది. తన చుట్టూ గౌరవంతో కూడిన భయాన్ని అల్లేసి అందులో ఒంటరిగా ఉండటం వల్ల తలపొగరు అని భావించారు.
రాజకీయాలు, సినిమాలంటే అయిష్టం
తనకు రాజకీయాలన్నా, సినిమాలన్నా చాలా అయిష్టం అని ఆమె చాలా సందర్భాల్లో చెప్పింది. కాని అడుగుపెట్టిన ఈ రెండు రంగాల్లోనూ ఆమెది నెంబర్ వన్ స్థానం. సినిమా రంగంలో క్యారెక్టర్ ఆర్టిస్టు కుమార్తె అనే వారసత్వం ఆమేది. పదిహేనేళ్లకే పొట్టకూటి కోసమో, డబ్బుకోసమో ముఖానికి రంగు వేసుకున్న ఆమె తన స్వశక్తితోనే ఆ రంగంలో రాణించింది. దాదాపు 140 సినిమాల్లో నటించిన ఆమె 23ఏళ్లకే నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. సినిమా రంగంలో ఆమె అంచెలంచెలుగా ఎదుగుతున్న క్రమంలోనే తల్లి మరణం కుంగుబాటుకు గురిచేసినా తన జీవితంపై ఎవరికీ ఆధిపత్యం చెలాయించే అవకాశాన్ని ఇవ్వకుండా పరిస్థితులకు ఎదురుతిరగటాన్ని అలవాటు చేసుకుంది. ‘‘మా అందం కావాలి. మేము కావాలి. కాని పాలిటిక్స్‌లో రావటానికి జనం ఇష్టపడరు’’ అనే జయలలిత వలే చాలామంది నటీనటులు రాజకీయాల్లోకి వచ్చారు. కాని వారంతా కొద్ది కాలం మాత్రమే రాణించగలిగారు. ఎంజీఆర్, ఎన్టీయార్ తరువాత ఓ నటి ఈ స్థాయికి ఎదగటం అనేది భారతదేశ చరిత్రలోనే లేదు. కాని అలాంటి చరిత్ర ఆమె సొంతం చేసుకుంది. సహనటుడు ఎంజీఆర్ అండతో రాజకీయ అడుగులు వేసినా తన అడుగులను బలంగా మోపి వారసురాలిగా తానేమిటో నిరూపించుకునేందుకు, పార్టీని చేతుల్లోకి తీసుకునే విషయంలో ఆమె అడుగడుగునా పోరాటాలే చేసింది. కాని ఆ పోరాటం బయటకు కనిపించకుండా విజయాన్ని సొంతం చేసుకోవటం జయలలిత వౌనం వెనుక ఉన్న విజయ రహస్యం.
అపశ్రుతులు అనేకం
ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసుల్లో ఇరుక్కుని జైలుకెళ్లిన తొలి ముఖ్యమంత్రి ఆమే. 23ఏళ్లు వచ్చే వరకూ కూడా ఆమె తల్లిచాటు బిడ్డే. కనీసం తనకు ఆదాయం ఎంత వస్తుంది. వాటికి ఎంత పన్ను కడుతున్నాం అనే విషయాలే ఈనాటికీ నాకు తెలియవు అని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పటం జరిగింది. ఇలాంటి లెక్కలు డొక్కలు తెలియని ఆమెను సులభంగా నమ్మించటం కొంతమందికి సులువుగా మారటం వల్ల అవే ఆమెకు కొన్ని శాపాలుగా మారాయి. సినిమాల్లో కోటాను కోట్లు సంపాదించిన సొమ్ము ఉండగా.. అవినీతికి పాల్పడాల్సిన అవసరం ఏముంది అని ఎన్నోసార్లు ఆక్రోశించింది. నమ్మినవారు చూసుకుంటారులే అని వదిలేసిన ఆమె అధికారాన్ని అడ్డంపెట్టుకుని చేసిన అక్రమార్జనకు ఆమె జైలు గోడల మధ్య గడపాల్సి వచ్చింది. డిఎంకే పార్టీ అధికారంలో ఉండగా.. ఆమె అక్రమాస్తుల కేసులో అరెస్టయినపుడు జయలలితను కనీస సదుపాయాలు లేని అతి దుర్భరమైన జైలు గదిలో ఉంచారు. ఆ గదిలో పందికొక్కులు సైతం తిరిగేవి. కాని వాటినన్నింటినీ సహించింది. పరిస్థితులు వ్యతిరేకంగా నిలిచినా ప్రతిసారీ మొండిగా ఎదురుతిరిగింది. జనంలోకి వచ్చి వారి అండతో మళ్లీ సునామీ వలే లేచి నిలబడింది. అసెంబ్లీలో సైతం ఆమెకు ద్రౌపదీ వస్త్రాపహరణం తరహాలో అవమానం ఎదురైనా.. ఈ అసెంబ్లీలోకి మళ్లీ సీఎంగానే అడుగుపెడతానని శపథం చేసి మరీ వచ్చి రెండేళ్లకే ఆ పీఠాన్ని అధిరోహించింది. ఓ విధంగా సినిమా జీవితానికీ, రాజకీయానికీ ఈ ఎదు రు తిరిగే మనస్తత్వం.. మొండితనమే ఆమె పునాది చేసుకుని సాగటం వల్ల సహజంగానే తలపొగరు అనే బిరుదును తగిలించటం జరిగింది.
జీవితంలో మాయని మచ్చ
కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి ఓ హత్య కేసులో జైలుపాలు కావటం జయలలిత హయాంలో జరగటం ఆమె జీవితంలో మాయని మచ్చగా చెప్పవచ్చు. భగవంతుడు ఎలా ఉంటాడో తెలియని మనుషులు ఇలాంటి స్వామీజీల్లో చూసుకుంటారు. అలాంటి నడయాడే దైవం పట్ల విచక్షణ లేకుండా వ్యవహరించిన తీరు, అనుకున్నది సాధించటం కోసం నిర్దాక్షిణ్యంగా నిర్ణయాలు తీసుకోవటం ఆమె ప్రతీకారేచ్ఛకు నిదర్శనం.
మహిళా సాధికారిత కోసం
ఎన్నో పథకాలు
పురుషాధిక్య సమాజంలో నలిగి తన అస్తిత్వాన్ని కోల్పోకుండా నిలబడగలిగిన జయలలిత మహిళల కోసం ఎన్నో పథకాలు చేసింది. దేశంలోనే తొలి మహిళా ఫైర్ ఆఫీసర్లను నియమించిన ఘనత అమెకే దక్కుతుంది. అలాగే పోలీసుల్లో మహిళా కమెండోలను, బెటాలియన్లను తయారుచేసిన సాహసి. విద్యార్థులు తండ్రి పేరుతో పాటు తల్లి పేరును తగిలించుకోవాలని ఆమె పితృస్వామ్య వ్యవస్థనే ప్రశ్నించారు. పుట్టినప్పటి నుంచి పురుషాహంకారాన్ని చవిచూసిన ఆమె ఒంటరిగానే నెగ్గుకురావాలని, తనకు అడ్డువచ్చిన వారిని రాజకీయాల్లో ఇందిర తరువాత నిర్థాక్షిణ్యంగా అణగదొక్కారు.
అమ్మ మనసు
పార్టీ శ్రేణులకు, తమిళనాడు ప్రజలకు ఆమె ‘అమ్మ’. పెళ్లి చేసుకోకుండా అవివాహితగా మిగిలిపోయిన ఓ స్ర్తికి లభించిన అరుదైన గౌరవం అని చెప్పవచ్చు. అమ్మ అంటే ఆలనా పాలనా చూసేదన్నట్లుగా ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టింది. ఆమెను ఓ దేవతగా భావిస్తారు. నవజాత శిశువులను ఆమె పాదాల వద్ద ఉంచి ఆశీస్సులు అడుగుతారు. ఆమె ఆ బిడ్డకు ముద్దిచ్చి పేరు పెట్టి పంపితే పొంగిపోతారు. ఇలాంటి సంఘటనలు చూస్తే ఆమెలో కాఠిన్యం వెనుక పసి మనసు దాగివుందని తెలుస్తుంది. తనను రాజకీయంగా తీర్చిదిద్దిన ఎంజీఆర్ తన పోయెన్ గార్డెన్‌లోని తన సొంతింటి గృహప్రవేశానికి రాకపోయినా లెక్కచేయలేదు. సినిమా పరిశ్రమలో పిఆర్‌ఓను నియమించుకున్న తొలి నటి కూడా జయలలిత. ఆమెకు పిఆర్‌ఓ ఉన్నాడని తెలిసి ఎంజీఆర్ ఒకింత కినుకు వహించినా ఆమె తనదైన శైలిలో గుండె ధైర్యంతో పరిస్థితులను చక్కదిద్దుకున్నారు.
రాతి గుండె వెనుక జయలలితలో అమ్మ మనసు దాగి ఉందని నిరూపించుకున్నారు. ప్రత్యర్థులకు అపరకాళిగా, అభిమానులకు అమ్మగా భారతీయ రాజకీయ చరిత్రలో నిలచిన ఈ పురుచ్చితలైవి ఓ సామాన్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ కుమార్తెగా అరుదెంచి.. అమ్మగా నిష్క్రమించటం అరుదైన ఘనత.

-టి.ఆశాలత