మెయన్ ఫీచర్

వాక్ స్వాతంత్య్రానికీ పరిమితి ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంపై ఇటీవల ఒక పరిశోధన జరిగింది. అందులో కొన్ని దిగ్భ్రాంతిని కలిగించే అంశాలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు మూడువేల గర్భ నిరోధక కండోమ్స్ దొరికాయి. మాదక ద్రవ్యాలు ఇంజక్షన్ రూపంలో తీసుకొనే సూదులు దొరికాయి. గంజాయి వంటి ఇతర పదార్ధాలు యూనివర్సిటీకి సరఫరా చేయబడుతున్నాయి. కాశ్మీరు నుండి ఉగ్రవాదులు విశ్వవిద్యాలయంలోకి ప్రవేశించి తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఏచూరు సీతారాం వంటి చైనా అనుకూల శక్తులను ఈ విశ్వవిద్యాలయమే ప్రతి సంవత్సరం ఉత్పత్తి చేస్తున్నది. ఐతే ఈ దుర్మార్గం కేవలం న్యూఢిల్లీ విశ్వవిద్యాలయానికే పరిమితం కాలేదు. దేశంలోని వివిధ విద్యాలయాల పరిస్థితి ఇలాగే ఉంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గోమాంస భక్షణా మహోత్సవం ఘనంగా టీవీ కెమెరాల సాక్షిగా నిర్వహించారు. నరకాసుర జయంతి, మహిషాసుల జయంతి జరిపారు. విద్యాలయంలో సరస్వతీ దేవాలయాలు ఎందుకు ఉండాలి? అని ఆందోళన చేశారు. హైదరాబాదు కేంద్రీయ విద్యాలయాలలలో యాకూబ్ మెమెన్ అనే ఉగ్రవాది జయంతి ఘనంగా జరుపుకున్నారు. వివేకానందుడు సూడో మేధావి అని తిట్టారు. ఒక యాకూబ్ మెమెన్ చనిపోతే ఇంటింటా యాకూబ్ మెమెన్‌లు పుడతారు అని ప్రతిజ్ఞ చేశారు.
న్యూఢిల్లీ విశ్వవిద్యాలయంలో దేశద్రోహ నేరం కింద అరెస్టు చేయవలసిన విద్యార్థులు యూనివర్సిటీలోని ప్రొఫెసర్లు తమ ఇళ్లలో తొమ్మిది రోజులపాటు రహస్యంగా దాచిపెట్టారు. హైదరాబాద్ ఆత్మహత్య చేసుకున్న రోహిత్‌ను దళితుడిగా చిత్రించి అతని తల్లిని తిరువనంతపురం ముస్లింలీగ్ సభల నుండి ఢిల్లీ జంతర్‌మంతర్ వరకు తిప్పారు. ఐక్యరాజ్య సమితగకి రోహిత్ ఆత్మహత్యను మానవహక్కుల ఉల్లంఘన నేరం కింద ఫిర్యాదు చేశారు. ఈ మొత్తం పని చైనా సమర్థవంతంగా తన అనుచరులచేత చేయించింది. చత్తీస్‌గఢ్‌లో 76 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లను మావోయిస్టులు మందుపాతరతో పేల్చి చంపితే, జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విజయోత్సవం జరిపారు.
నేరస్థులను పట్టుకొనేందుకు యూనివర్సిటీల్లోకి పోలీసలు ఎట్లా ప్రవేశిస్తారు? అని ప్రశ్నిస్తున్నారు. మరి భింద్రేన్ వాలాను పట్టుకొనేందుకు మిలటరీని స్వర్ణ దేవాలయంలోకి ఇందిరాగాంధీ ప్రవేశపెట్టడం కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులు మరచిపోయారా? ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు 1965లో సెల్ఫ్ అటానమీ పేర 1969లో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పేర 2002 నుండి 2014 వరకు తిరిగి ప్రత్యేక ఉద్యమం పేర రాజకీయ పార్టీలు వాడుకున్నాయి.
విద్యార్థి ఉద్యమాలతోనే చైనా మావోసేటుంగ్ విజయం సాధించాడు. మహాత్మాగాంధీ విజయం సాధించారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో విద్యార్థులే బలిదానాలు చేశారు. నేపాల్‌లోని హిందూ రాజ్యాన్ని కూల్చి నూతన సెక్యులర్ రాజ్య నిర్మాణం చేసింది విద్యార్థులే. ఈ సంగతులు కమ్యూనిస్టులకు తెలుసు. అందుకే వివిధ విద్యాలయాల్లోని విద్యార్థులను చైనా, పాకిస్తాన్‌లు తమ కార్యకలాపాలకు పావులుగా వాడుకుంటున్నాయి. ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, సిమి, న్యూడెమోక్రసీ, పిడిఎస్‌యు, ఆర్‌ఎస్‌యు, డిఎస్‌యు...ఇలా వివిధ విద్యార్థి సంస్థలు విద్యాలయాన్ని ఒక ప్రక్రియగా స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి పనిచేస్తున్నాయి.
జాట్ విద్యార్థులకు రిజర్వేషన్లు కావాలంటూ 2016 ఫిబ్రవరి మూడవ వారంలో హర్యానాలోని రోహ్‌తక్ వంటి ప్రాంల్లో కాంగ్రెస్ ప్రేరిత ఉగ్రవాదులు జరిపిన అల్లర్లలో అధికారికంగా రూ.20 వేల కోట్ల ఆస్తి బూడిదైంది. అనధికార అంచనాల ప్రకారం ఈ మొత్తం రూ.32 వేల కోట్లు. ఇలాంటి రాజకీయ పార్టీలను ప్రపంచంలో ఏ దేశమైనా సహిస్తుందా? లోక్‌సభలో ఫిబ్రవరి 24న మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ చేసిన ప్రసంగం చరిత్రాత్మకమైంది. అందులో ఆమె పశ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్టులు ప్రచురించిన ఒక కరపత్రం నుంచి కొన్ని పంక్తులు లక్‌సభలో చదివి వినిపించారు. ‘‘శరన్నవరాత్రి వివాదాస్పదమైన ఉత్సవాలు. దుర్గ, దేవత కాదు. సెక్స్ వర్కర్. మహిషుడు మహావీరుడు. హానీమూన్ ముగిశాక దుర్గ అతడిని దుర్మార్గం గా చంపింది,’’ ప్రపంచంలోని ఏ దేశంలో అయినా ఇలాంటి కరపత్రాలను క్షమిస్తారా?
కాలిఫోర్నియా యూనివర్సిటీ విద్యార్థులు కొందరు కన్హయ కుమార్‌కు మద్దతు పలికారు. కొలంబియా, హార్వర్డ్ తదితర విద్యాలయాలనుంచి కొందరు కన్హయ కుమార్‌కు మద్దతు పలికారు. అంటే వీరు క్రైస్తవ, ముస్లిం కమ్యూనిస్టు వర్గాలకు చెందిన వారనేది సుస్పష్టం. భారతదేశాన్ని ముక్కలు చేయండి, అఫ్జల్ జరుగు జిందాబాద్ అనడం దేశద్రోహం కాదా? అమెరికాను ముక్కలు చేయండి, అక్కడ ఐసిస్ రాజ్యం లేదా మావోయిస్టు రాజ్యం స్థాపించండి అంటే అమెరికా రాజ్యాగం అంగీకరిస్తుందా?
హర్యానాలో జరిగిన విధ్వంసం వెనుక కాంగ్రెస్ పార్టీ ఉన్నదని విచారణలో తేలింది. ఈ మేరకు మాజీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా కుడిభుజమైన వీరంద్ర సింగ్‌పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మరి ఈ మహాపురుషుడు ఇంతటి దుర్మార్గం ఎందుకు చేసినట్టు? అంటే రాబర్ట్ దావ్రా అక్రమాస్తుల కేసులు భూపేంద్ర సింగ్ మెడకు ఉచ్చు బిగిసింది. దాని నుండి తప్పించుకునే నిమిత్తం హర్యానా రాష్ట్రాన్ని తగలబెట్టాడు. ఇదీ వీరి దేశభక్తి! ఒకే ఒక్క సోనియా నేరకుటుంబాన్ని కాపాడటం కోసం మొత్తం కాంగ్రెస్ పార్టీ ఎందుకింత దేశ ద్రోహానికి ఒడిగడుతున్నది? హర్యానా విధ్వంసంలో యాభై రైల్వే వ్యాగన్లకు నిప్పు అంటించారు. రూ. 32వేల కోట్ల జాతి సంపద బుగ్గిపాలైంది. ఈ మొత్తం డబ్బును భుపేందర్-సోనియా, ఆనంద శర్మల ఆస్తులను జప్తు చేసి జాతి ప్రజలకు అందించాలి. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ బోగీల ఖర్చును కాపు ఉద్యమ నేత నుంచి వసూలు చేయాలి.
తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చనిపోయారు. అప్పుడు రాహుల్ గాంధీ రాలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 1600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపి సున్నం రాజయ్య కోడలు ఆత్మహత్య చేసుకున్నప్పుడూ రాహుల్ గాంధీ పలకరించడానికి రాలేదు. కాని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికికటికి రెండుసార్లు వచ్చి విద్యార్థులను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి వెళ్లాడు. పార్లమెంటులో ఈ ఉదంతాలపై చర్చ జరుగుతుంటే అందులో పాల్గొనకుండా బయటకు వెళ్లిపోయాడు. ఇది తగునా? న్యూఢిల్లీ జెఎన్‌యులో మహిషాసుర జయంతి జరిపితే రాహుల్ గాంధీ వెళ్లి ఆ విద్యార్థులకు మద్దతు తెలిపారు. సబర్మతీ దాబా వద్ద హఫీజ్ సరుూద్, ఉమర్ ఖలీద్, కన్హయ్య, నాగ్ వంటి ఉగ్రవాద విద్యార్థులు దేశ వ్యతిరేక నినాదాలిస్తూ కాశ్మీరు భారత్‌లో అంతర్భాగం కాదు, అంటే దానికి రాహుల్, ప్రశాంతి భూషణ్, అరవింద్ కేజ్రీవాలా మద్దతునిచ్చారు. ఇది న్యాయమా? దళితుడు కాని దళితుడైన రోహిత్ కోసం లోక్‌సభలో మాయావతి నానా అల్లరి చేసింది. అంతర్జాతీయ అమ్నెస్టీ (లండన్) వార్షిక నివేదికలో భారత్‌లో అవగాహన పెరిగిందని, 50 మంది మేధావి వర్గానికి చెందిన రచయితలు తమ పురస్కారాలను తిరస్కరించారని ప్రకటింపజేసే వరకు వీరు అల్లరి చేశారు. ఐక్యరాజ్య సమితికి రోహిత్ మరణానికి సంబంధించిన నివేదిక అందజేశారు. ఇంత లొల్లి ఎందుకు జరుగుతున్నది?అంటే అరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ గాదెకింద కమ్యూనిస్టులు చేరి దేశాన్ని దోచుకున్నారు. ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని భరించలేకపోతున్నారు.
గుజరాత్‌లో దేశభక్తుడైన దీనానాధ్ పుస్తకాలు పాఠ్యాంశాలుగా పెట్టించారని వామపక్షాలు అల్లరి మొదలుపెట్టాయ. సోనియాగాంధి కపిల్ సిబాల్ నేతృత్వంలో తీస్తా సెతల్వాద్ రూపొందించిన ఆరవ తరగతి పాఠ్య గ్రంథంలోని ఈ వాక్యాలు చూడండి, ‘‘కేరళలో రోమన్ క్యాథలిక్ మెజారిటీల మీద హిందువులు జరిపిన దాడిని వివరంగా వర్ణించండి’’- భారతదేశంలో ఇటీవల అసహనం పెరిగిపోతున్నదని అంతర్జాతీయ అమ్నెస్టీ ఇచ్చిన నివేదిక (2015)లో ఈ వాక్యాలు చూడంది, ‘‘్భరత్‌కు (మతం మార్పిడి వంటి ప్రయోజనాల కోసం) విదేశాలనుండి విడుదల చేయబడుతున్న నిధులపై నూతన (మోదీ) ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇది అసహనం కాదా?’’ అని అమ్నెస్టీ ప్రశ్నించింది. సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఇలా అన్నారు, ‘‘ జెఎన్‌యు న్యూఢిల్లీలో కొంద రు విద్యార్థులు భారత దేశాన్ని ముక్కలు చేయండి అన్నారు. అది వాక్‌స్వాతంత్య్రం కిందికి వస్తుందే కాని దేశద్రోహం ఎట్లా అవుతుంది?’’
షబనా ఆజ్మీ బహిరంగంగా ఒక ఇంగ్లీషు టీవీ ఛానల్‌లో అఫ్జల్ గురు వర్ధంతికి ఉత్సవం జరిపిన వారిని సమర్ధించింది. ఎందుకు? అరుంధతీ రాయ్ అనే తీవ్రవాద రచయిత్రి అమెరికా వెళ్లి, ఇండియాలో క్రైస్తవులకు భద్రత లేదు అని ప్రచారం చేసి వచ్చింది. కాశ్మీరు స్వతంత్ర దేశం అని న్యూఢిల్లీ వీధుల్లో మావోయిస్టు రచయితలతో కలిసి ఊరేగింపు జరిపింది. ఈమెకు భారత రాజ్యాంగం వర్తించదా? దేశద్రోహం అంటే ఏమిటి? ఈ చర్చ జరుగుతున్నప్పుడు ఒక సంచలనాత్మక అంశం వెలుగులోకి వచ్చింది. భారత హోంశాఖ మాజీ కార్యదర్వి జి.కె. పిళ్లై 2016, ఫిబ్రవరి 25న ఒక రహస్య దస్త్రాన్ని బయట పెట్టారు. ఇష్రాత్ జహాన్‌కు బిహార్ బేటీ అని పేరు. ఈమె లష్కరే తోయబా ఉగ్రవాద సంస్థకు చెందిన కార్యకర్త. ఈమె ఒక ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది. ఇది బూటకపు ఎన్‌కౌంటర్ అని యుపిఎ ప్రభుత్వం నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆనాటి గుజరాత్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిందట. ఇదిలావుండగా 2009 సెప్టెంబర్‌లో కేంద్ర హోంశాఖ ఒక అఫిడవిట్‌ను తయారు చేసిం ది. అందులోని ఉగ్రవాదుల పేరులో ఇష్రాత్ జహాన్ పేరుంది. వెంటనే, 10, జనపథ్ ఆ దేశాలమేరకు ప్రముఖ గుజరాత్ కాంగ్రెస్ నాయకుడు ఇష్రాత్ జహాన్ పేరును అఫిడవిట్ నుంచి తొలగింపజేశాడు.
ఇప్పుడీ మొదటి అఫిడవిట్, ఇష్రాత్ పేరులేని రెండవ అఫిడవిట్ ప్రజల ముందున్నాయి. ఇప్పుడు చెప్పండి. ఈవిధంగా అఫిడవిట్‌లో పేరు మార్చడం రాజద్రోహమవుతుందా కాదా? ఇప్పుడు జెఎన్‌యులో ఉగ్రవాదులు లేరని రాహుల్ వాదిస్తున్నాడు. అంటే ఉగ్రవాదులను బలపరచడం ద్వారా ముస్లిం ఓట్లను పొంది 2019లో ప్రధానమంత్రి కావాలన్నది రాహుల్ గాంధీ లక్ష్యం. జి.కె. పిళ్లై నిజాయతీని దేశంలో ఎవరూ శంకించలేరు. కాకుంటే ఈ విషయం అప్పుడే ఎందుకు బయట పెట్టలేదు? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అప్పుడు ఈ అఫిడవిట్ వెలుగులోకి వచ్చే అవకాశం లేదు మరి.
1962 కేదార్‌సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇలా చెప్పింది ‘‘ఆర్టికిల్ 19-ఎ-2 ఇచ్చిన వాక్‌స్వాతంత్య్రం దుర్వినియోగం చేసకొని దేశద్రోహానికి పాల్పడితే సహించేది లేదు’’ చైనాలో మన విద్యార్థులు కొందరు చదువుకుంటున్నారు. వారు నేడు తియానానె్మన్ స్క్వైర్ వద్ద నిలబడి ‘చైనా రాజ్యాంగం నశించాలి’ అంటే ఏమవుతుంది?

- ముదిగొండ శివ ప్రసాద్