మెయిన్ ఫీచర్

విద్యార్థుల విజయసూత్రాలివే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాఠశాలలు తెరుచుకుని దాదాపు సగం కాలం గడిచిపోయింది. కొన్నిచోట్ల రివిజన్ కూడా మొదలైపోయింది. పాఠశాల స్థాయి నుంచి కళాశాల్లోకి వెళ్ళే పదో తరగతి విద్యార్థులపై అందరి దృష్టి ఉంటుంది. వారి భవిష్యత్ బంగారంలా ఉండాలని కలలు కంటుంటారు. ఇందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా వారి వారి స్థాయిలో శ్రమిస్తుంటారు. విద్యార్థులూ పోటీపడి చదువుతూ అందరి కంటే తామే అగ్రస్థానంలో ఉండాలని పట్టుదలతో ఉంటారు. అయితే, ఇంత చదివినా ఫలితం లేకపోతే ఏమిటి పరిస్థితి? ఊహించుకుంటేనే భయమెస్తుంది కదూ.. అందుకే పరీక్షల్లో ఆఖండ విజయం కోసం ‘పరీక్షల రామసేతు’ను కట్టుకోవాలి.
పక్కా ప్రణాళికతో ఫలితాలను చేజిక్కించుకుంటారు. టైంటేబుల్ ఇంటి దగ్గర అందరికీ ఉంటుంది. కానీ, కొందరే క్రమశిక్షణతో ఫాలో అవుతారు. వీరే విజేతలవుతుంటారు! తల్లిదండ్రులు లేదా ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో ఓ టైం టేబుల్‌ను వేసుకోవాలి. ఆదివారం ఆటలకు కేటాయించుకోగా, మిగిలిన సమయానికి అనుగుణంగా టైంటేబుల్‌ను రాసుకోవాలి. పండుగలు, పర్వదినాల సందర్భాల్లో కొంతమేర వెసులుబాటుగా రూపొందించుకోవాలి.
విద్యార్థి దశనుంచే దైవభక్తిని అలవర్చుకోవాలి. జీవితంలో పురోగతికి ఇది దోహదపడుతుంది. స్నానం అయ్యాక నిద్రకు ఉపక్రమించే ముందు కూడా ప్రార్థించాలి. భగవంతుడు నీ ప్రార్థనలను తప్పక విని, ఆశీర్వదిస్తాడు. మరుసటి రోజు ఆ ప్రభావం తెలుస్తుంది.
మనస్సు, శారీరం కలుషితమైతే ఏకాగ్రత నశిస్తుంది. చికాకు ఆవరించి, చదువు వాయిదా పడుతుంది. రెండు పూటలు స్నానం చేసి, శరీరాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి.
అందరూ పరుగెత్తుతుంటారు. అందరిలో నువ్వు ఒకడివి కాకూదు. అందరి కంటే నువ్వు ముందుండాలి. ఇదే ధ్యేయం కావాలి. అంటే, రేపు చెప్పబోయే పాఠాన్ని ఈ రోజే నువ్వు చదివివుండాలి. అప్పుడే ఆ పాఠం తరగతి గదిలో సులువుగా ఆకళింపు చేసుకోగలవు. మళ్ళీ ఇంటి దగ్గర పునశ్చరణ చేసుకోవాలి. ఇలాచేస్తే పరీక్షలు శ్రమ అనిపించవ్.
చదువుకు సిద్ధమయ్యాక కనీసం ఓ గంట వరకూ చదవండి. మొదట్లో ఈ పని కష్టంగా అనిపించినా తర్వాత హాయిగా ఉంటుంది. ధైర్యం వస్తుంది. చురుగ్గా ఉంటారు. నేనూ చదువుతున్నాను అనే ధీమా కలుగుతుంది.
చదువుతున్నపుడు డౌట్లు వస్తే నిఘంటువులు ఉపయోగపడతాయి. పదాల అర్థాలు తెలుసుకుంటేనే పాఠం సులువుగా అర్థమవుతుంది.
ఇలా సాధన చేస్తే విజయం మీ సొంతం. అయితే, ఈ సాధన తెలివిగా ఉండాలి. అప్పుడే అందరి కంటే అగ్రస్థానం వరిస్తుంది.

- కళ్యాణి