మెయిన్ ఫీచర్

సాహసయాత్ర 196

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆడపిల్లని దూరంగా పంపాలంటే ఇప్పటికీ చాలామంది తల్లిదండ్రులు ఒప్పుకోరు. అలాంటిది 27ఏళ్ల కాస్సీ డీ పికాల్ రెండేళ్లలో 196 దేశాలు చుట్టేసెయ్యాలని కంకణం కట్టుకుంది. సాహసోపేతంగా ఎంచుకున్న ఈ యాత్రలో ఆమె ఎన్నో అను

భవాలను మూటగట్టుకుంది. దీనికి ‘‘సాహసయాత్ర 196’’ అని పేరు కూడా పెట్టుకుంది. తాను వెళ్లే పర్యటక ప్రదేశాల్లోని ప్రకృతితో మమేకమవుతూ ఆమె డాక్యుమెంటరీలను సైతం తీస్తోంది. తొలి డాక్యుమెంటరీ ఉమెన్‌గా రికార్డుల్లోకి ఎక్కాలని, ఎన్నో స్వతంత్ర దేశాల జీవన పరిస్థితులను తన కెమెరాలో బంధించాలని ఆరాటపడే కాస్సీ ఎక్కడకు వెళ్లినా.. అక్కడి ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను నిశితంగా పరిశీలిస్తూ వాటిని తన కెమెరాలో బంధిస్తూ ముందుకు సాగుతోంది. అల్బేనియా గ్రామస్తులతో కలిసిపోయి వారి జీవన పరిస్థితులను అధ్యయనం చేసింది. మంచుకురిసే వేళలో ఎత్తయిన పర్వతాలు, హిల్ స్టేషన్లు, గిలిగింతలు పెట్టే మంచుముద్దలు, పచ్చటి లోయలు, ఇక్కడ సంచరించే తోడేళ్లు క్రూర మృగాలకు సైతం భయపడకుండా ఐస్‌లాండ్ సందర్శించింది. ఇక్కడ సూర్యోదయం 11.30కు ప్రారంభమవుతోంది. సూర్యాస్తమయం 3.30కి ముగుస్తుంది. అయినా చలిని లెక్కచేయక ఈ ప్రాంతంలో పర్యటించటం ఆమె సాహసయాత్రకు మచ్చుతునక. భూటాన్‌లోని టైగర్ నెస్ట్‌లోకి నిర్భయంగా వెళ్లింది. వర్షకాలంలో కాలు బయటకు పెట్టాలంటే చిరాకు. కాని కాస్సీ వానచినుకులతో దుప్పటి కప్పుకుని మూలన కూర్చోదు. రద్దీలేని ప్రదేశాలకు వెళ్లి వర్షాల్లో వింత అందాన్నిచ్చే వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తోంది. వర్షాలు కురుస్తున్నపుడు కొండ ప్రాంతాలకు వెళ్లటం ఎంతో ప్రమాదం. కాస్సీకి అలాంటి భయమే లేదు. కలర్ రాక్‌ను కళ్లారి చూసి ముచ్చటపడింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్‌ను చూసి పులకించిపోయింది. నిత్యం బ్యాగ్‌లను సర్దుకుని రెడీ టు లీవ్ అనటానికి సిద్ధంగా ఉండే కాస్సీకి ఇష్టమైన ప్రదేశాలు ఏమిటో తెలుసా? మనదేశంలోని ఒడిస్సా, ఉక్రెయిన్ అం టే ఆమెకు ఎంతో ఇష్టం. ఇప్పటికే ఈ ప్రపంచ యాత్ర లో 181 దేశాలు పూర్తిచేసింది. ఈ ఏడాది చివరినాటికి మిగిలిన దేశాలలో పర్యటించి తన లక్ష్యాన్ని పూర్తిచేయాలనుకుంటుంది. చిన్నతనం నుంచి ఆమెకు ప్రపంచాన్ని చుట్టిరావాలని కల లు కనేది. ఆకలను నెరవేర్చుకునేందుకు ఎన్ని కష్టాలకైనా సిద్ధమే అంటుంది. ఏదైనా ప్రాంతానికి బయలుదేరే ముందు తనకు ఉచిత వసతి సౌకర్యం కావాలని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. తనకు వచ్చిన ఆహ్వానాలను జాగ్రత్తగా పరిశీలించుకుని బస చేస్తోంది. గత ఏడాది అంటే 2015 నుంచి ఈ ప్రపంచ యాత్ర ప్రారంభించింది. ఇప్పటి వరకూ ఈ ‘ప్రపంచ పౌరురాలు’ తన పర్యటనకు 2,09,060 డాలర్లు మేరకు ఖర్చు చేసింది.

అల్బేనియా అందాలను తన కెమెరాలో
బంధిస్తున్న కాస్సీ
రష్యాలోని ఓ చర్చి ముందు..

వారానికి రెండుసార్లు చొప్పున నెలరోజుల పాటు పది మందారపూలు, 20 కరివేపాకులు, కొద్దిగా పాలు కలిపి రుబ్బి, మూడు స్పూన్ల తేనె, ఒక గుడ్డుసొన కలిపి తలకు పట్టించి 40 నిమిషాలాగి తలస్నానం చేస్తే జుట్టురాలడం తగ్గుతుంది.
రెండు టీ స్పూన్లు ఆముదం, ఒక స్పూన్ గ్లిజరిన్, గుడ్డులోని తెల్లసొన కలిపి ఈ మిశ్రమాన్ని తడిజుట్టుకు మసాజ్ చేసి కడిగేస్తే జుట్టు ఆరోగ్యంగా మెరుస్తుంది.
కొబ్బరి, బాదం నూనెల్ని సమపాళ్ళలో కలిపి అరచెంచా కళ్లకింద, పెదవుల కింద మసాజ్ చేసి ఇరవై నిమిషాలాగి పాలతో కడిగేస్తుంటే కంటికింద పెదవుల చుట్టూ ఉన్న నలుపు తగ్గుతుంది.
రోజుమార్చి రోజు మోచేతులు, మోకాళ్లపై తాజా మీగడ రాసి, నిమ్మచెక్క తీసుకుని, ఒక టీ స్పూన్ పంచదార జల్లి, పంచదార కరిగేవరకు స్కృబ్ చేస్తుంటే చలికాలంలో చర్మం మృదువుగా ఉంటుంది.
పచ్చి కాకరకాయల రసాన్ని తేనె, ఉప్పు, కొద్దిగా నీరు కలిపి బాగా రుబ్బి ఆరెంజ్ పీల్ పొడి కలిపి ముఖానికి ఫేస్‌ప్యాక్ వేస్తే చర్మం కాంతులీనుతుంది.
ముఖంపై ముడతలు పోవాలంటే ముందు ముఖాన్ని సోపుతోగానీ, సున్నిపిండితోగానీ కడిగిన తరువాత బొప్పాయి లేదా అరటిపండు గుజ్జు రాసి మర్దన చేయాలి. తరువాత మినపప్పు పొడి రెండు స్పూన్లు, బార్లీ గింజల పొడి రెండు స్పూన్లు తోటకూర రసంలో కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే ము ఖం మీద ఏర్పడ్డ ము డతలు పోతాయి.