మెయిన్ ఫీచర్

ప్రతి ఇల్లూ పూలవనమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెరడు మాయం అయింది. భూమి బంగారమైపోయింది. అపార్ట్‌మెంట్‌లలో కాస్తంత స్థలం కనిపించినా మొక్కలు పెంచుకుంటే పచ్చదనాల హరివిల్లే. ఆరోగ్యంతో పాటు పర్యావరణానికి తోడ్పడినవారవుతారు. దీనికి కావల్సిందల్లా గాలి, వెలుతురు ఉంటే చాలు కొద్దిపాటి స్థలంలోనైనా కనువిందు చేసే గార్డెన్‌ను పెంచుకోవచ్చు. ఇంటి పైకప్పులు, బాల్కనీలు, కిటికీల్లో కూడా కుండీలు లేదా వేలాడే కుండీలను ఏర్పాటుచేసుకుని పూల మొక్కలు పెంచుకోవటానికి వీలుగా వివిధ రకాల పూలమొక్కల గురించి ఇస్తున్నాం. ఈ పూల మొక్కలన్నీ నర్సరీల్లో లభ్యమవుతాయి. వీటిని మట్టి, ప్లాస్టిక్ కుండీలలోనే కాకుండా నిరుపయోగమైన ప్లాస్టిక్ బకెట్లలో పెంచవచ్చు. ఇలాచేస్తే ప్రతి ఇల్లూ కూడా పూలవనమే అవుతుంది.

పెటునియా
ఈ పెటునియా మొక్కలను వ్రేలాడదీసే బుట్టలో పెంచుతున్నపుడు వీటి పూలు విడిగా గుంపులుగా ముడతలు పడినట్లుగా, మృదువైన పూరేక చారల లేక మందంగల రంగుల్లో వికసిస్తాయి. ప్రస్తుతం అమ్ముడవుతున్న పెటునియా ఎక్కువగా హైబ్రిడ్ కోవకు చెందినది. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. అవి గ్రాండ్‌ఫ్లోర్, మల్ట్ఫ్లిర్. గ్రాండ్‌ఫ్లోర్ పెద్ద పూలువి. కంటైనర్‌లలోగాని, బుట్టలలోగాని పెంచడానికి వీలుగా ఉంటుంది. మల్ట్ఫ్లిర్ చిన్న పూలవి, ముఖ్యంగా గార్డెన్‌లలో పెంచుకోవడానికి వీలుగా ఉంటుంది. ఎక్కువగా సూర్యరశ్మి తగిలేటట్లు వ్రేలాడదీస్తే ఎక్కువగా పుష్పాలు వికసించి గుబురుగా కనబడటానికి ఆస్కారం వుంటుంది. సాధారణంగా నీటిని తక్కువ మోతాదులో ఇస్తూ వీలైనంత వరకు సూర్యరశ్మి తగిలేటట్లు ఉంచాలి.

లాంటనకెమెరా
ఇవి సులభంగా పెరుగుతాయి. తక్కువ తేమ ఉన్నా ఫర్వాలేదు. మొక్కలు గుబురుగా ఉండి విభిన్న రంగులలో పూసే పూలు గార్డెన్‌కి అందాన్ని తీసుకువస్తాయి. పూలు ప్రకాశవంతంగా ఉండి దాదాపుగా వేసవి, చలికాలంలో మొత్తం పూస్తాయి. ఈ మొక్కల్లో పాకే రకాలు, వ్రేలాడదీసే బుట్టలలో పెంచడానికి వీలుగా ఉంటాయి. ఈ మొక్కలు దాదాపుగా 6 ఇంచుల వరకూ పెరుగుతుంటాయి. ఇందులో ముఖ్యంగా పసుపు, ఆరెంజ్, తెలుపు, ఎరుపు, ఊదా రంగుల్లో మొక్కలు అందుబాటులో ఉన్నాయి. వీటిని వసంతకాలంలో నాటుకోవడం మంచిది. ఎక్కువగా సూర్యరశ్మి తగిలేటట్టు పెట్టుకోవాలి. అన్ని నేల మట్టిల్లో పెరుగుతుంది. ముఖ్యంగా పాక్షిక ఆమ్లనేలలు సరిపోతాయి. నాటిన తర్వాత వెంటనే నీటిని ఎక్కువగా దఫాలవారీగా అందించాలి. పెరుగుదల సమయంలో కొద్దిగా ఇచ్చినా సరిపోతుంది.

బ్లాక్ ఐ సుసాన్ వైన్
ఈ మొక్కలు ప్రధానంగా బహు వార్షికంగా వుంటాయి. వీటిని తుంబెర్జియా ఆలటా అని కూడా అంటారు. పెంచడం సులభం. ఈ మొక్కలను వ్రేలాడదీసే బుట్టలలో హౌస్ ప్లాంటులుగా పెంచుకుంటారు. వీటి ఆకులు మందంగా ఉంటూ హృదయాకారంలో లేక బాణం గుత్తి ఆకారంలోనైనా ఉంటాయి. వీటి పూరెక్కలు ఆరెంజ్, పసుపు లేక తెలుపు వర్ణాలలో ఉండి కనువిందు చేస్తుంటాయి. ఇది త్వరితంగా పెరిగే స్వభావాన్ని కల్గి ఉంటుంది. వ్రేలాడదీయడంవల్ల మరి త్వరితంగా పాకుతూ పెరుగుతుంది. సూర్యరశ్మి అవసరం అవుతుంది. వీటిని తడిగా ఉండే నేల మట్టిపై పెంచుకోవాలి. దాదాపుగా క్రమం తప్పకుండా నీటిని అందిస్తూ ఉండాలి. ఎక్కువగా వేడి వాతావరణం ఉన్నపుడు తెల్ల దోమ, సాలీడు వంటి పురుగులు వ్యాపించే అవకాశం ఉంటుంది.

స్వీట్ అల్లిసం
వీటిని లాబులెరియా మారిటమ్ అని కూడా పిలుస్తారు. తక్కువ ఎత్తులో పెరుగుతుంటాయి. వీటిని సాధారణంగా వ్రేలాడదీసే బుట్టలలో లేక కంటైనర్‌లలో కాని పెంచవచ్చు. ఎందుకనగా ఇవి అందంగా, సువాసన వెదజల్లే గుణం కలిగి ఉండి చూడటానికి ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. వీటి పూలు మెలికలు తిరిగిన రెక్కలు కలిగి తెలుపు, పింకు,ఉదా రంగుల్లో ఉంటాయి. మురుగునీరు నిల్వ ఉండని మట్టిని మరియు తేమ శాతాన్ని మధ్యస్థసంగా ఉంచితే మంచిది. ఈ మొక్కలని ఎక్కువగా సూర్యరశ్మి తగిలే విధంగా లేక పాక్షిక నీడలో కూడా పెంచుకోవచ్చు. వీటి పెరుగుదలపై ఎక్కువగా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉండదు.

పూచియా
ఈ మొక్కలు చాలా అందంగా ఉండటంవలన వ్రేలాడదీసే బుట్టలలో పెంచడానికి మక్కువ చూపుతారు. ఇవి దక్షిణ అమెరికాలో పుట్టాయి. ఇందులో ముఖ్యంగా పొదలుగా లేక చిన్న చెట్లుగా పెరుగుతుంటాయి. ఇవి ముఖ్యంగా రెండు రకాల వర్ణాల్లో ఉండి సున్నితంగా ఉండటంవలన వీటిని ఎక్కువగా పెంచుతున్నారు. వీటి ఆకులు ,శాఖలు వేరే ప్రదేశానికి తాకుతున్నపుడు కీటకాలు వ్యాపించకుండా చూసుకోవాలి.

మిలియన్ బెల్స్
మిలియన్ బెల్స్ పెంచడం చాలా సులువు. వివిధ రంగుల్లో పూచే ఈ పూలు వసంతకాలం నుంచి చలికాలం వరకు పరిమళిస్తుంటాయి. ఈ మొక్కను పెంచుతున్న బుట్టలలో నేల మట్టితో సేంద్రియ ఎరువును కలపాలి. తేమగా, నీటిని నిల్వ ఉండకుండా చూడాలి. ఇవి ముఖ్యంగా సూర్యరశ్మిని అధికంగా తీసుకుని పూస్తాయి. ఇవి వేసవి నెలల్లో మధ్యాహ్నం సమయంలో నీడలో బుట్టలని పెట్టాలి.

లాబెలియా
అన్ని ప్రదేశాలలో పెరిగి ఆ ప్రదేశానికే అందాన్ని తెచ్చిపెడుతుంది. లాబెలియా మొక్కలను వ్రేలాడదీసే బుట్టలలో పెంచడంవల్ల చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. పూలు పూచే ఈ మొక్కలు 3 నుండి 5 ఇంచుల ఎత్తు పెరుగుతుంటాయి. కాని కొన్ని రకాలు మాత్రం దాదాపుగా 3 ఫీట్‌ల వరకూ పెరుగుతాయి. ఇవి సాధారణంగా లేత నీలి రంగునుండి ఊదా రంగుల్లో ఉండి లేత ఆకుపచ్చ, పసుపు రంగు ఆకులను కల్గి ఉంటాయి. అయినప్పటికీ ఇందులో చాలా రకాలు వివిధ రంగుల్లో (తెలుగు ఎరుపు నీలి,పింకు) ఉన్నాయి. ఈ మొక్కలకి ఎక్కువ సూర్యరశ్మి తగిలేటట్టు వ్రేలాడదీయాలి. పాక్షిక నీడలో అయినా సరే పెరుగుతాయి. అదనంగా వీటికి ఎక్కువ తేమ మంచి నేల మట్టి అవసరం. ఈ మొక్కలు సులభంగా పెరిగి, చల్లని వాతావరణాన్ని చుట్టూ వున్న ప్రదేశాలకు కల్పిస్తాయి. ఒక్కసారి ఇది నాటిన తర్వాత అంతగా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉండదు.

పొర్టులాక
వీటిని సాధారణంగా సన్‌రోజ్ లేదా మాస్ రోజ్ అని పిలుస్తారు. ఇది చిన్నగా నేలపై పాకుతూ పెరుగుతుంటుంది. వీటిని ప్రధానంగా రోడ్లకి ప్రక్కన (ఇళ్ళల్లో), వేలాడదీసే బుట్టలలో (హ్యాంగింగ్ బాస్కెట్‌లలో) పెంచుతారు. మాస్ రోజ్‌లో పింక్, ఎరుపు, పసుపు, ఆరెంజ్ , తెలుపు రకాలు అందుబాటులో ఉన్నాయి. క్రమం తప్పకుండా నీటిని పోయాల్సిన అవసరం ఉండదు. ఇవి ఎక్కువగా సూర్యరశ్మిని వాడుకుని పెరుగుతుంటాయి. కాబట్టి కొంచెం వెలుతురు ఎక్కువగా ఉండే ప్రదేశంలో వ్రేలాడదీయాలి. అన్ని రకాల నేలలపై పెరుగుతాయి. ముఖ్యంగా సారవంతమైన, నీరు ఎక్కువగా నిలవకుండా వుండే నేలలని కుండీలలో పెంచడం మంచిది.

పెలార్‌గోనియం
పెలార్‌గోనియంను సాధారణంగా ‘బెరెనియం’ అని కూడా పిలుస్తారు. ఇవి పెద్ద గ్రూపులుగా, సతత హరిత మొక్కలుగా ఉండి ముఖ్యంగా వ్రేలాడదీసే బుట్టలలో, ఇళ్లలోగాని లేదా గార్డెన్‌లో కాని పెంచుతారు. అన్ని పూలు మధ్యలోనుండి వికసిస్తాయి. ఆకులకు పెద్ద కాడలు ఉం టాయి. పెలార్‌గోనియంని పెంచడం అనేది అన్నింటికంటే వేరుగా ఉంటుంది. ఇది తక్కువ వెలుతురుని కూడా తట్టుకొని పెరుగుతుంది. పగటి, రాత్రి పూట ఉష్ణోగ్రతలు అవసరం.

బిగొనియా
బిగొనియాలను వ్రేలాడదీసే బుట్టలో పెంచుకోవడానికి చాలా వీలుగా ఉంటాయి. వీటికి ఎక్కువ శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉండదు. సులభంగా పెరిగి అందమైన పూలనిస్తాయి. ఖాళీ ప్రదేశాలలో కూడా పెంచుకోవచ్చు. వివిధ వాతావరణ పరిస్థితులలో సులభంగా పెరుగుతాయి. అందువల్ల ఈ మొక్కలు చాలా నర్సరీలో లభిస్తాయి. వీటి పూలు గులాబీలను పోలి ఉండి 6 నుంచి 9 ఇంచుల ఎత్తువరకు పెరుగుతాయి. అనేక రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ఇవి దాదాపుగా ఎక్కువ వెలుతురుని కోరుకుంటాయి. కాని మరి ఎక్కువ వేసవి ఉన్న రోజులలో కొంచెం నీడలాంటి ప్రదేశాలలో నాటడం మంచిది. కంటైనర్‌లలో లేదా బుట్టలలో పెంచుతున్నట్టయితే వాడిపోయిన పూలను మరియు ఎక్కువ పొడవున్న కొమ్మలను కత్తిరించి వేయాలి.

ఎ. సునీల్ కుమార్, జునాగఢ్ వ్యవసాయ విద్యాలయం, గుజరాత్