మెయిన్ ఫీచర్

మొబైల్ అవసరం.. ఎంతవరకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెల్‌ఫోన్.. ఇవ్వాళ నిత్యావసర వస్తువులు ఇంట్లో లేకున్నా ప్రతి ఒక్కరికీ ఇది అత్యవసరమై పోయింది. నిద్ర లేవడానికి అలారం పెట్టడంతో మొదలయ్యి, శుభోదయం మెస్సేజ్‌లతో సాగుతూ రాత్రి నిద్రపోయే సమయంలో శుభరాత్రి వరకు సాగుతూనే ఉంటుంది. సెల్‌ఫోన్ లేని ఇల్లు లేదు. ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కరికి రెండేసి మొబైల్స్ ఉండటం రివాజుగా మారింది. ఒకప్పుడు ఊరిలో ఒక్కరిద్దరికి ల్యాండ్ ఫోన్లుండేవి. రానురాను అవి కూడా ఇంటికొకటి అయిపోయాయి. ఆ తరువాత నెమ్మదిగా కొంతకాలానికి ఇప్పుడు ఈ హ్యాండ్ ఫోన్స్ (సెల్‌ఫోన్లు) బయలుదేరాయి. అయితే ఇవి కూడా 2000, 3000 రూపాయలలోపుగల కీప్యాడ్ ఉన్న ఫోన్స్ మొదట్లో వచ్చాయి. మామూలు ఫోన్లు ఉన్నప్పుడు ఇంటికి ఒక్కటి మాత్రమే ఉండేవి. అవి కూడా అవసరం ఉన్నవాళ్ళే కొనుక్కునేవారు. రానురాను కమ్యూనికేషన్స్ ఎక్కువయ్యి ఒకరికుందని ఇంకొకరు ఇలా అవసరం లేకున్నా కొని వాడటం మొదలయ్యింది. ఇక వాటి కొనుగోళ్ళు పెరగడంతో రకరకాల మొబైల్స్ మార్కెట్‌లోకి వచ్చాయి. మొదట్లో కేవలం ఫోన్లను మాట్లాడటానికి మాత్రమే ఉపయోగించేవారు. ఆ తరువాత మెసేజ్ చేయటానికి అలవాటుపడ్డారు. ఇంకాస్త ముందుకెళ్ళి కెమెరా ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. వాటి ధర కాస్త ఇంకా ఎక్కువగా ఉన్నప్పటికీ పెద్దగా ధరతో తేడా ఉండకపోవడంతో 4,000, 5,000 రూపాయలు ఖర్చుచేసి వాటిని కూడా కొని వాడటానికి జనాలు వెనక్కి తగ్గలేదు. మనిషి జీవన విధానానికి, స్థితిగతులకు మొబైల్స్ అవసరం అనుసంధానమై ఉంది. సెల్ వాడకంవల్ల జేబుకు చిల్లులు పడ్తున్నాయి.
ఇక కెమెరా మొబైల్ ఇంట్లో ఉంటే ఎంతో గొప్పగా ఫీలయ్యేవారు. ఆ కెమెరా ఫోన్లతో ఏదయినా చిన్నచిన్న ఫంక్షన్లు గానీ, ఫ్రెండ్స్ అంతా ఏదయినా పిక్‌నిక్‌లాంటి వాటికి వెళ్ళినప్పుడు అలాంటి పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడానికి ఫొటోలు తీసుకునేవారు. అలా ప్రతి ఒక్కరికి చేతిలో కెమెరా ఫోన్లు విచ్చలవిడిగా తయారయ్యాయి. ఎంత పెద్ద మొబైల్ ఉంటే ఇప్పుడు అంత గొప్పలకు పోతున్నారు. ఒకప్పుడు కేవలం నగరాలు, పట్టణాల్లో మాత్రమే ఉండేవి. అవి రానురాను మండలాలు, గ్రామాల్లోకి నెమ్మదిగా వెళ్ళాయి. నెట్‌వర్క్ సంస్థలు కూడా వాటి యొక్క పరిధిని పెంచేశాయి. మొదట్లో లైఫ్‌టైమ్ రీఛార్జ్ చేసుకోవాలంటే దాదాపు రూ.1000/-లు (బీఎస్‌ఎన్‌ఎల్ లాంటివి) ఉండేవి. ఆ తరువాత సిమ్‌ల వాడకం పెరగడంతో వాటి యొక్క ధరను కాస్త తగ్గించారు. అదే విధంగా ఎంప్లాయిస్‌కు ప్రీపెయిడ్ మాత్రమే కాకుండా పోస్ట్‌పెయిడ్ రీఛార్జెస్, ఆఫర్స్ వచ్చాయి. పోస్ట్‌పెయిడ్ అంటే నెల మొత్తంలో ఎంత అయితే వాడతామో ఆ బిల్లు సిమ్‌కు లేదా ఫోన్‌కు మెసేజ్ రావడంతో బిల్ కట్టే పద్ధతి. ఇంకా ప్రీపెయిడ్ అంటే రీఛార్జ్ చేసుకుంటేనే ఫోన్ నుండి ఔట్ గోయింగ్ పోతుంది. ఇక రానురాను ఇలాంటి ఆఫర్స్ ఎన్నో వచ్చాయి. జనాల అవసరాలనుబట్టి ఆఫర్లు ఇచ్చిన సంస్థలు చాలానే వున్నాయి. చూస్తుండగానే ఇంటికో కెమెరాఫోన్ వచ్చేసింది. సాధారణ ఫోన్‌తోపాటు కెమెరా ఫోన్ ఒకటికి ఒకటి తోడయ్యాయి. కొంత కాలానికి ఇంట్లో ఉన్న చిన్న కీపాడ్ ఫోన్ పాడైతే దాని స్థానంలో మళ్ళీ ఇంకొక కెమెరా ఫోన్ కొనుక్కునే పరిస్థితికి వచ్చారు జనాలు.
ఇక ఆ తరువాత కొంత కాలానికి మనిషి సెల్‌ఫోన్ లేకుంటే మనుగడ సాగే పరిస్థితి లేని స్థితికి వచ్చాడు. ఇక పిల్లలు పట్టణాల్లో చదువుకునేవారికి వారి మంచి చెడులు తెలుసుకోవడానికి వారికో సెల్‌ఫోన్ ఇలా అలవాటయిపోయాయి. రానురాను వారిపై చదువుల అవసరాల రీత్యా మరిన్ని ఆప్షన్స్ ఉండే మొబైల్స్ కొనిస్తున్నారు తల్లిదండ్రులు. అంటే ఇప్పుడు వాటి అవసరం కూడా అంతే ఉందనుకోండి. ఆ తరువాత ఏ ప్రభుత్వ కార్యాలయంలో ఎలాంటి దరఖాస్తులు పెట్టుకున్నా మళ్ళీ దరఖాస్తుదారుకు సమాచారం చేరవేసేందుకు గాను ఆ దరఖాస్తుతో వ్యక్తిగత సెల్ నంబరును వ్రాయాల్సి వుంటుంది. తద్వారా ఎలాంటి సమాచారాన్నయినా త్వరగా తెలుసుకునే వీలుంది. మంచి పరిణామమే ఇది. ఇక బ్యాంకులన్నీ ఆన్‌లైన్ అయిపోయాయి. ఒక వ్యక్తి బ్యాంకులో ఖాతాను తెరిచినట్లయితే ఆ అక్కౌంట్ నంబరుకు సంబంధించిన లావాదేవీలన్నీ అప్పుడు వ్రాసినటువంటి దరఖాస్తులో నంబర్‌కు మెస్సేజ్ రూపంలో ఎప్పటికప్పుడు వస్తుంటాయి. అలా రావడం మంచి సదుపాయమేనని చెప్పవచ్చు. ఏ ప్రభుత్వ సంస్థ నుండి అయినా, ఎల్‌ఐసి కార్యాలయాలనుండి అయినా, ప్రైవేటు వ్యక్తుల ద్వారా అయినా విద్యార్థులకు స్కాలర్‌షిప్స్ గానీ, విద్యార్థులు దేనికయినా దరఖాస్తు చేసినట్లయితే దానికి సంబంధించిన సమాచారం వగైరా సంబంధిత మొబైల్స్‌కి సమాచారం రావడం గొప్ప విషయమే.
ఇలా మొబైల్స్ నిత్య జీవితంలో మనిషికి అత్యవసరం అయ్యాయి. ఎంతగా అవసరమయ్యాయంటే సెల్‌కు ఫోన్ రాకుంటే ఆరోజు పనులేవీ సాగనంతగా. మొబైల్స్ వచ్చాక కాలం వృథాకావడం తక్కువైపోయింది. ఏదైనా అవసరం ఉంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సి వుండేది. ఇప్పుడు మొబైల్స్ రావడంవల్ల ఇంట్లోనుండే కాల్ చేసి విషయాన్ని పరిష్కరించుకునే అవకాశం ఉంది. అంటే వెళ్ళివచ్చే సమయం ఎంతో కొంత ఆదా అవుతుంది. కాలాన్ని వృథా చేయకపోవడం జీవితంలో ముఖ్యఘట్టం. ఇక ఇంతకుముందు 1000 రూ.ల నుండి 5,000 రూ.లు, 6,000 రూ.లు వరకు ఉన్న మోబైల్స్‌నే వాడిన జనాలు ఇప్పుడు అదే మొబైల్స్‌ను 10,000 రూ.లు నుండి వేలు, లక్షల్లో కూడా ఖర్చుచేసి కొంటున్నారు. ఎన్నోరకాల కంపెనీలు రోజురోజుకు ఎన్నో రకాల సెల్‌ఫోన్స్‌ను మార్కెట్లోకి తెస్తున్నారు. వాటి ధర ఒక్కొక్కటి 50వేల రూపాయల పైమాటే. ఒక విషయాన్ని నమ్మలేకపోవచ్చు కానీ ఇది నిజంగానే నమ్మాల్సిన నిజం. నీతూ అంబానీ వాడే ఫోన్ ధర అక్షరాల రూ.351 కోట్లు. ఇది వెనుకవైపు మొత్తం వజ్రాలతో పొదగబడి ఉంటుంది. ఈ ధర పెట్టి కొన్న ఫోన్ వాడాలంటే ఎన్ని వేల కోట్లు గల్గిన సంపన్నులై ఉండాలి మరి. ఇలాంటి వారు ప్రపంచంలో ఇంకెందరో ఉండి ఉండొచ్చు. కానీ ఇది మాత్రం అతిగానే భావించాలి.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, లక్షల్లో జీతాలు తీసుకునేవారు కూడా దాదాపు 50వేల నుండి లక్ష రూపాయల వరకు విలువ చేసే మోబైల్స్‌నే వాడుతున్నారు. కాకపోతే వీటిలో వారు చేస్తున్నటువంటి వృత్తికి సంబంధించినటువంటి సమాచారాన్ని చూసుకునే వీలు ఉంది. టెక్నాలజీని విపరీతంగా వాడుకుంటున్నామనుకోండి. వ్యవస్థలో ప్రతీది ఆన్‌లైన్ అయిపోయాయి. ఇంట్లో ఉండి ప్రతీ విషయాన్ని మొబైల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పుడొస్తున్న ఫోన్లలో ఎన్నో క్రొత్త క్రొత్త యాప్స్‌ను ప్రవేశపెడుతున్నారు.
* మొబైల్ ఒకప్పుడు మాట్లాడుకోవడానికే పరిమితం.
* ఆ తరువాత మెసేజ్ చేసుకోవడానికి
* వాట్సాప్ దీని ద్వారా ఫోటోలను, వీడియోలను, ఏదేని రికార్డులను కాగితాలను ఫొటో తీసి సంబంధిత వ్యక్తులకు సెండ్ చేస్తున్నారు.
* ఫేస్‌బుక్ ద్వారా ఇంకాస్త అడ్వాన్స్ అవుతున్నారు.
* గూగుల్: దీని ద్వారా కావలసిన సమాచారాన్ని పొందుతున్నాం.
* యూట్యూబ్: దీనిలో కూడా ఏ సమాచారాన్నయినా పొందవచ్చు.
* జీమెయిల్: సమాచారాన్ని మెయిల్ చేసుకోవచ్చు.
* షేర్ ఇట్: దీనిని ఒక మోబైల్ నుండి ఇంకొక మొబైల్‌కి సమాచారం పంపవచ్చు.
* ట్రూ కాలర్: క్రొత్త నంబర్ నుండి కాల్‌చేస్తే దీని ద్వారా ఎవరిదో తెలుస్తుంది.
* వేర్ ఈజ్ మై ట్రెయిన్: దీని ద్వారా మనం రెస్యూమ్ చేసుకున్న ట్రెయిన్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు.
ఫోన్ పే: ఈ యాప్ ద్వారా సెల్ ఫోన్‌కు బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను లింక్ చేసుకొని ద్వారా ఉన్న చోటి నుండే కావలసిన వ్యక్తులకు నగదును ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు.
గూగుల్ పే: దీని ద్వారా కూడా నగదు బదిలీ చేయవచ్చు.
న్యూస్ చానల్ యాప్స్: దీని ద్వారా రాత్రి 3 గం.లకే దేశంలోని సమాచారాన్నంతటినీ ఏ ప్రదేశంలో చూసుకునే వీలుంది.
గేమ్స్: ఇక పిల్లలకయితే ఎన్నో రకాల గేమ్స్ యాప్స్ ఉన్నాయి. ఇవేకాకుండా ఎన్నో యాప్స్ వాడుకలోకి వస్తున్నాయి.
సెల్‌ఫోన్ వల్ల లాభాలు: ప్రతీ సమాచారం సెల్‌ఫోన్ ఉండటంవల్ల చాలా సులువైపోయింది. బ్యాంకు లావాదేవీలు ఉభ్నచోట నుండే చేసుకోవడం, దరఖాస్తులు వాటి స్టేటస్ తెలుసుకోవడం, న్యూస్ యాప్స్‌వల్ల ఎక్కడవున్నా కూడా అన్నీ దినపత్రికలు, మీడియాలో ప్రసారం చేస్తున్న విషయాలు తెలుసుకోవడం, వాట్సాప్ ద్వారా ఫొటోలు సెండ్ చేయడం, కావలసిన విషయాన్ని ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయడం, విషెస్ చెప్పుకోవడం, గూగుల్ యూ ట్యూబ్ ద్వారా తెలుసుకునే వీలున్న ఎన్నో క్రొత్త విషయాలు, సమాచారాన్ని మెయిల్ చెయ్యడం, వేర్ ఈజ్ మై ట్రెయిన్ ద్వారా తాము బుక్ చేసుకున్న ట్రెయిన్ ఎక్కడ వుందో తెలుసుకోవడం ఇవన్నీ కాలాన్ని వృథా కాకుండా చేసేవి అని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. అయితే మంచికన్నా చెడు కూడా ఎక్కువే జరుగుతుంది. ఇంకొక విషయమేమిటంటే దూరాన వున్నటువంటి వ్యక్తులను వీడియోకాల్ ద్వారా చూస్తూ దేశ విదేశాల్లో ఉన్నవారిని కావచ్చు, దగ్గరలో వున్న వారిని కావచ్చు చూస్తూ మాట్లాడుకునే వీలుంది.

- శ్రీనివాస్ పఠ్వతాల