మెయిన్ ఫీచర్

ఆమెది ఆకాశమంత మనసు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడుపున పుట్టిన బిడ్డకు క్యాన్సర్ సోకితే కన్నవారి గుండెకోత ఎలా ఉంటుందో ఆమెకు తెలుసు. బిడ్డలకు లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి ఖరీదైన వైద్యం చేయించలేక వారు పడే ఆవేదనను గ్రహించింది. రేపటి పౌరులైన ఆ చిన్నారులను జాతి సంపదగా తీర్చిదిద్దే ఆశయంతో స్థాపించిన ‘ఓదార్పు’ స్వచ్ఛంద సంస్థ ఎంతోమంది జీవితాల్లో వెలుగులను నింపుతుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కన్నకూతురు కళ్ల ముందే క్యాన్సర్‌తో కన్నుమూయటంతో తన వలే మరో తల్లి ఇలా బాధపడకూడదని ‘ఓదార్పు’ స్వచ్చంధ సంస్థను ఏర్పాటుచేసిన షీబా అమీర్ నేడు 1500 మంది బిడ్డలకు తల్లయింది. క్యాన్సర్ సోకిన బిడ్డలకు సరైన చికిత్స చేయించకుండా కుమిలిపోయే తల్లులకు పెద్దతల్లిగా సాంత్వన కలిగిస్తోంది. కొంతమంది తమ పిల్లలను ఆసుపత్రుల్లో చేర్పించి డబ్బుఖర్చుపెట్టలేక అలాగే వదిలేసి వెళ్లిపోతుంటారు. అలాంటి వారి వివరాలను తెలుసుకుని వారిని తీసుకువచ్చి చికిత్స చేయించి తల్ల వలే ఆదుకుంటుంది. ఎంతమంది వచ్చినా అందరిని ఆదుకోవాలనే తపన పడుతోంది. ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నా.. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతోంది.
కేరళకు చెందిన షీబా అమీర్ నిస్వార్థ తల్లి. 1500 క్యాన్సర్, వివిధ ప్రాణాంతక వ్యాధులు సోకిని పిల్లలకు కన్నతల్లిగా మారి అన్నీతానై చూసుకుంటూ వారి కోసం పోరాటం చేస్తోంది. నెలకు ఎనిమిది లక్షల రూపాయలను కోసం ఖర్చుచేస్తోంది. ఇందులో అధిక భాగం ఆమె కష్టార్జితం. పిల్లల్లో ముఖాల్లో కనిపించే చిరునవ్వు చూసేందుకు తపించిపోతుంది. షీబా ఇలాంటి నిస్వార్థ సేవామార్గంలోకి వచ్చేందుకు ఆమె జీవితంలో చోటుచేసుకున్న విషాధ సంఘటనే కార ణం. ధనవంతుల కుటుంబంలో ఆమె తండ్రికి పబ్లిషింగ్ హౌజ్ ఉంది. దీంతో చాలామంది రచయితలు ఇంటికి వస్తూపోతుంటారు. అలా పసి వయసు నుంచే ఆమె ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకుంది. శాస్తవ్రేత్త అమీర్‌తో వివాహమైన తరువాత భర్తతో పాటు గల్ఫ్‌కు పయనమైంది. అక్కడ 15 సంవత్సరా లు ఉంది. వర్షపు జల్లు లు, పక్షుల కువకువలు వినిపించని ఆ దేశంలో ఉండలేక ఆమె భారతదేశానికి తిరిగి వచ్చేసింది. అప్పటికే ఆమెకు ఇద్దరు పిల్లలు. కుమార్తెకు 13 ఏళ్ల వయసు ఉన్నపుడు రక్తకణాల క్యాన్సర్ సోకింది. టాటా మెమోరియల్ ఆసుపత్రిలో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి చికిత్స చేయించారు. సోదరుడు బోన్ మేరోట్రాన్స్‌ప్లాంట్ చేశాడు. చికిత్స దిగ్విజయంగా జరిగి కుమార్తెను ఇంటికి తీసుకువెళదామనుకుంటుం గా.. కిమోథెరపీ సైడ్‌ఎఫేక్ట్ వల్ల గుండె దెబ్బతింది. అంతేకాదు రెండు తొడలు కూడా పాడై ఆసుపత్రి నుంచి వచ్చిన కొ న్ని రోజులకే కన్నుమూసింది. కుమార్తె మరణంతో ఆమె జీవితం చీకటిమయమైంది. కొన్నిరోజుల పాటు తేరు కోలేకపోయింది.
ఏడేళ్ల శ్రమ ఫలితం
క్యాన్సర్ చికిత్స సందర్భంగా కన్నకూతురు పడిన శారీరక బాధను చూసిన ఆ తల్లి మరోబిడ్డకు ఇలాంటి కష్టం కలిగినపుడు తల్లిగా ఓదార్పునివ్వాలనే సంకల్పంతో ‘ఓదార్పు’ అనే స్వచ్చంధ సంస్థను ఏర్పాటుచేసింది. ఏడేళ్లు ఓ ఆసుపత్రిలో పనిచేయగా వచ్చిన డబ్బుతో ఈ సంస్థను ఏర్పాటుచేసింది. వైద్యుల సలహా సంప్రదింపులతో మెడికల్ కాలేజీలో మూడు లక్షలతో వార్డు ఏర్పాటుచేసింది. ప్రాణాంతక వ్యాధులు సోకిన చిన్నారులకు సేవచేస్తున్న ఆమెకు వైద్యులే కాదు ఎంతో మంది తోడ్పాటునందించారు. ఓదార్పు సంస్థ ద్వారా చికిత్స పొందుతున్న పిల్లలు పైసా ఖర్చు చేయకుండా చక్కటి చికిత్స చేయించుకుంటారు. ఏ తల్లి కూడా కన్నీళ్లు పెట్టకుండా ఆనందంగా తమ బిడ్డకు చికిత్స చేయించుకుని వెళ్లాలనేదే షీబా ఆశయం. అహర్నిశలా ఇలాంటి బిడ్డల కోసం కష్టపడటానికి కావల్సిన శక్తిని పైనుంచి తన కుమార్తే అందిస్తుందని షీబా గర్వంగా చెబుతోంది.
1500 పిల్లలకు చికిత్స
ప్రస్తుతం షీబా 1500 పిల్లలకు చికిత్స చేయిస్తుంది. వీరిలో అధికం గా క్యాన్సర్‌బారిన పడినవారే. అంతేకాదు తలసేమియా, గుండె జబ్బు తదితర వ్యాధులతో బాధపడేవారికి కూడా చికిత్స చేయిస్తోంది. ఇంతమంది పిల్లలకు పైసా ఖర్చు లేకుండా అన్నీ సమకూర్చటమనేది సామాన్య విషయం కాదు. పిల్లల సంఖ్య పెరుగుతుండటంతో ఖర్చులు పెరిగి ఆర్థిక ఇబ్బందులు కూడా తలెత్తటం సహజం. అయినప్పటికీ నిరాశను దరిచేయనీయకుండా దయగల వారి వద్ద నుంచి విరాళాల రూపంలో కొంత నగదు వసూలుచేస్తోంది.
ఈ 1500 పిల్లలకు నెలకు 9 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. కాని మా వద్ద 8 లక్షలు మాత్రమే ఉంది. అయినప్పటికీ మా వద్దకు వచ్చే ఏ బిడ్డ కూడా విచారంతో వెనక్కివెళ్లకుండా వారిని ఆదుకుంటామని ఆనందంగా చెబుతోంది. ఆమె సేవా దృక్పథానికి నిదర్శనంగా ఎన్నో అవార్డులు వరించాయ. వీట న్నింటి కంటే చిన్నారుల చిరునవ్వులే తనకు కొండంత శక్తినిస్తాయని షీలా విశ్వాసం.