మెయన్ ఫీచర్

ఉగ్రవాదాన్ని అదుపు చేయని అంతర్జాతీయ చట్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరియాలో అమెరికా నిర్వహించిన భారీ ఆపరేషన్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అధిపతి అబూ బకర్ అల్ బాగ్దాదీ పీడ విరుగడైంది. అల్ ఖైదా అధిపతి ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుబెట్టడంతో ప్రపంచానికి ఉగ్రవాద పీడ విరుగుడైందనుకున్న సమయంలో అది బోకోహారం రూపంలోనో, ఇస్లామిక్ స్టేట్ రూపంలోనో వేళ్లూనుకుంది. ప్రపంచవ్యాప్తంగా 210 గుర్తింపు పొందిన ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. గుర్తింపు లేని ఉగ్రమూకలు వేలల్లో ఉన్నాయి.
ప్రతి దేశానికీ చట్టం, రాజ్యాంగం, సైన్యం ఉన్నా చాపకింద నీరులా ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. చాలా దేశాల్లో ఉగ్రవాదానికి సరైన నిర్వచనం లేదు. ఏ కేసులు ఉగ్రవాదంలోకి వస్తాయో, ఏవి రావన్నదానిపై స్పష్టత లేదు. దాంతో వివక్ష వ్యక్తమవుతోంది, నచ్చని వారిపై ఉగ్రవాద ముద్ర వేసే ముప్పు ఏర్పడుతోంది. ఉగ్రవాద వ్యతిరేక చట్టం అమలులో కూడా అనేక లోపాలు కనిపిస్తున్నాయి.
అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సంపూర్ణంగా అందిపుచ్చుకుంటున్న ఉగ్రవాద సంస్థలు ఖండాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయి. వేరే ఖండాల్లో ఉన్న ఉగ్రవాదుల ఆచూకీ తెలియక చాలా దేశాలు వారి కార్యకలాపాలను అదుపు చేయలేకపోతున్నాయి. ఐక్యరాజ్య సమితి ఖండాంతర ఉగ్రవాద నిర్మూలనకు ఎన్ని చర్యలు తీసుకున్నా రోజురోజుకూ ఉగ్రవాదం పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. చాలా దేశాలు ఉగ్రవాదానికి ఉరిశిక్షను అమలుచేస్తున్నాయి. భారత్ వంటి ప్రజాస్వామిక దేశాలు కేసుల పరిష్కారానికి దీర్ఘకాలం తీసుకుంటున్నా మధ్య ప్రాచ్యదేశాలు, మలేషియా వంటి దేశాలు రోజుల వ్యవధిలోనే శిక్షను అమలుచేస్తున్నాయి.
ప్రపంచంలో గుర్తింపు పొందిన దేశాలు 195 వరకూ ఉన్నాయి. వాటిలో 193 దేశాలు ఐక్య రాజ్యసమితి గుర్తింపు పొందాయి. మిగిలిన దేశాలు పరిశీలక దేశాలుగానే ఉన్నాయి. ఇవి కాకుండా ఎవరి గుర్తింపు లేని మరో 50 దేశాలు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాయి. అంటే సుమారు 250 దేశాల్లో వందకు పైగా దేశాలు ఉగ్రవాదంతో వణుకుతున్నాయి. ప్రపంచం ఆర్ధిక దివాలాతో ఉక్కిరిబిక్కిరి అవుతుండగా మరో వైపు ఉగ్రవాదం ఊపిరిసలపనీయకుండా చేస్తోంది.
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించకముందే అమెరికాలో 1941లో ఉగ్రవాద దాడి జరిగింది. 1925 నుండే ఉగ్రవాదం ఆనవాళ్లు ఉన్నా 1970 నుండి ఏదో ఒక దేశంలో ఉగ్రవాదులు ఏదో ఒక రూపంలో తమ ఉనికిని చాటుకుంటూ వస్తున్నారు. 1980-85 మధ్య, 2004 -2009 మధ్య వారి కార్యకలాపాలు విస్తృతం అయ్యాయి. అమెరికా, రువాండ, టునీషియా, జార్జియా, మలేషియా, హైతీ, మధ్య ప్రాచ్య దేశాలు, దక్షిణాసియా దేశాలు, ఆఫ్రికా దేశాలు, లాటిన్ అమెరికా దేశాల్లో ఉగ్రవాద విధ్వంసాలు ఎక్కువగా ఉన్నాయి. బాధిత దేశాల్లో ఆఫ్గనిస్థాన్, నైజీరియా, సిరియా, పాకిస్థాన్‌లు అగ్రస్థానంలో ఉన్నాయి. న్యూజిలాండ్, అర్జంటీనా, స్వీడన్, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు తక్కువగా ఉన్నాయి.
గత రెండు దశాబ్దాల్లో ఉగ్రవాదానికి రెండున్నర లక్షల మంది బలయ్యారు. లక్షలాది మంది నిరాశ్రయులు కావడమో, గాయపడటమో జరిగిందని గ్లోబల్ టెర్రిరిజం ఇండెక్స్ చెబుతోంది. ఉగ్రవాద బాధిత దేశాల్లో భారత్ ఎనిమిదో స్థానంలో ఉంది. మతాల మధ్య చిచ్చు పెట్టడం, జనావాస భౌగోళిక ప్రదేశాలను తమ ఆధీనంలోకి తీసుకోవడం, స్థానిక ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేయడం, పౌరులను బెదిరించో భయపెట్టో తమకు నచ్చినట్టు తమ ప్రతినిధులుగా వినియోగించుకోవడం జరుగుతోంది.
ప్రపంచాన్ని వణికించిన ఉగ్రవాద సంస్థల్లో ఆల్‌ఖైదా, బోకాహారం, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) ప్రధానమైనవి కాగా, ఆల్‌ఖైదా పాకిస్తాన్, ఆఫ్గనిస్థాన్ సరిహద్దుల్లో పనిచేస్తుండగా, ఇస్లామిక్ జిహాద్ యూనియన్ ఆఫ్గన్ నుండి నాటో దళాలను వెళ్లగొట్టే లక్ష్యంతో ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది. దీని నుండి ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఉజ్బెకిస్థాన్ ప్రారంభమైంది. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్- ఆష్ -షామ్-ఖొరాసన్ ఉద్భవించింది. తెహిరిక్ ఇ తాలిబాన్ పాకిస్థాన్, తాలిబాన్ ఆఫ్గనిస్థాన్ తరహాలో ఆష్ షామ్ ఖొరాసన్ ఆఫ్గన్ సరిహద్దుల్లో ఉగ్రవాదానికి ఊతం ఇచ్చింది. అల్జీరియాలో ఆల్‌ఖైదా ఇస్లామిక్ మఖ్‌రిబ్, ఐసిస్ అల్జీరియా, కొలంబియాలో నేషనల్ లిబరేషన్ ఆర్మీ, రివల్యూషనరీ ఆర్మ్‌డ్ ఫోర్మెస్ ఆఫ్ కొలంబియా, ఈజిప్ట్‌లో హరాకత్ సావద్ మిజర్, ఐసిస్ సినై, ఇథియోపియాలో ఆల్ సబాబ్, గాజాలో ఆర్మీ ఆఫ్ ఇస్లాం, హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్, పాలస్తీనా లిబరేషన్ ఫ్రంట్, పాపులర్ ఫ్రంట్ ఫర్ లిబరేషన్ ఆఫ్ పాలస్తీనా, గ్రీస్‌లో లిబరేషన్ స్ట్రగుల్, భారత్‌లో హిజ్‌బుల్ ముజాహిదీన్, ఇండియన్ ముజాహిదీన్ , ఇండోనేషియాలో జమా ఇస్లామియే, ఐసిస్ ఇండోనేషియా ఉగ్రవాద సంస్థలు తమ ఉనికిని చాటుకుంటునే ఉన్నాయి. పాకిస్థాన్‌లో లష్కరి ఇ తొయిబా, హకాని నెట్‌వర్కు, హర్కత్ ఉల్ జిహాద్ ఏ ఇస్లామి, హర్కత్ ఉల్ ముజాహిదీన్, జైష్ ఏ మహ్మద్, శ్రీలంకలో ఎల్‌టీటీఈ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దది.
ఐసిస్, హిజబుల్, ఎఫ్‌ఏఆర్సీ, తాలిబాన్, రియల్ ఇరా, బొకాహారం వంటి ఉగ్రవాద సంస్థలు వేల కోట్లతో కార్పొరేట్ సంస్థల మాదిరి నడుస్తున్నాయి. ఈ సంస్థలు ప్రపంచ వ్యాప్తంగా నిధులను సేకరించి ఉగ్రవాదానికి పెట్టుబడులు పెడతాయి. కొన్ని దేశాల బడ్జెట్ కంటే ఈ ఉగ్రమూకల బడ్జెట్ ఎక్కువంటే ఆశ్చర్యం లేదు.
నిజానికి సామ్రాజ్యవాదమే ఉగ్రవాదం పెరగడానికి కారణమనే వాదన లేకపోలేదు. పెద్దన్న పాత్ర పోషిస్తున్న అభివృద్ధి చెందిన దేశాలు తమ స్వీయ ప్రయోజనాల కోసం కయ్యాలు సృష్టించి ఉగ్రవాదాన్ని పెంచి, తర్వాత తామే బుగ్గగిల్లి ముద్దు పెట్టిన చందంగా ఉగ్రవాద నిర్మూలన పేరిట నిధులు అందజేస్తున్నాయి. నక్కవినయం ప్రదర్శించడంలో అమెరికా వైఖరి అందరికీ తెలిసిందే. ఒక వైపు పాక్‌ను చంకనెక్కించుకుని, మరో వైపు చైనాను భుజానికి ఎక్కించుకుని భారత్‌ను కట్టడి చేయాలనే కుట్ర ఎవరూ అర్ధం చేసుకోలేనిది కాదు. వర్ధమానదేశాల్లో ఉగ్రదాడులు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకున్న అగ్రదేశాలు తాము సృష్టించిన కాలనాగు భస్మాసుర హస్తమై తమ నెత్తిమీదనే పడటంతో అమెరికా ఉలిక్కి పడింది. అయితే అమెరికాలో ఎంపైర్ ఎస్టేట్‌ను ఒసామా బిన్ లాడెన్ కూల్చివేయడమేగాక, ఐసిస్ ఉగ్రవాదంలో అమెరికా పౌరులు మరణించడంతో అమెరికా పునాదులు సైతం కదిలాయి. భవిష్యత్ ముప్పు తమకు తప్పదని గ్రహించి ఉగ్రవాదం గురించి మాట్లాడటం ప్రారంభించింది. పారిస్‌లో దాడి, భారత్‌లో 2008లో ముంబై నగరంపై దాడులు, పార్లమెంటు భవనంపై దాడులు , పుల్వామా సహా అనేక మార్లు పాక్ మూకలు ఎన్నో ప్రాణాలను బలితీసుకున్నాయి. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం-1967లోనే ఉగ్రవాద అంశాన్ని చేర్చినా, 1995లో ఉగ్రవాదాన్ని అదుపు చేసేందుకు టాడా చట్టాన్ని , ఆ తర్వాత 2002లో పోటా చట్టాన్ని తెచ్చినా వాటి నుండి సాధించింది శూన్యమనే చెప్పాలి.
సామ్రాజ్యవాదపు వికృత శిశువే ఉగ్రవాదం. సామ్రాజ్యవాదాన్ని పోషిస్తూ అంతర్జాతీయంగా మార్కెట్ వ్యవస్థపై ఆధిపత్యం చెలాయించాలని అమెరికా ఉగ్ర మూకలకు ఆయుధాలను బహిరంగ మార్కెట్లో అందుబాటులోకి తీసుకురావడం ఎవరికి తెలియదు. 1963 టోక్కో ఒడంబడికను, 1970లో హేగ్ సదస్సు, 1971లో మాంట్రియల్ కనె్వన్షన్, 1973లో డిప్లమాట్స్ కనె్వన్షన్, 1983లో న్యూక్లియర్ మెటీరియల్ కనె్వన్షన్‌లు ఉగ్రవాదాన్ని విస్తృతంగా చర్చించాయి. 1983లో ఎయిర్‌పోర్టు కనె్వన్షన్ 1988లో మారిటైమ్ కనె్వన్షన్, 1991లో ప్లాస్టిక్ పేలుళ్ల నిరోధక ఒడంబడిక, 1997లో టెర్రిరిస్టుల బాంబింగ్ నిరోధక ఒప్పందం, 1999లో తీవ్ర0వాదులకు ఆర్ధిక సాయం అందకుండా కట్టడి చేసే ఒప్పందంపై ప్రపంచ దేశాలు సంతకాలు చేశాయి. 2005లో న్యూక్లియర్ టెర్రరిజం, 2010లో బీజింగ్ సదస్సుల్లో కూడా తీవ్రవాదంపై దృష్టిపెట్టాయి. ఇందుకు సంబంధించి భద్రతా మండలి 1992లోనూ, 1993లోనూ తీర్మానాలు చేసి అన్ని దేశాలకు మార్గదర్శకాలను జారీ చేసింది. సార్కు సదస్సుల్లోనూ, జీ -7, జీ-15 దేశాల సదస్సుల్లో విస్తృతమైన చర్చ జరిగింది. 46వ జీ-7 సదస్సు వచ్చే ఏడాది అమెరికాలో జరగనుంది. అక్కడ కూడా తీవ్రవాద నిరోధంపై ప్రత్యేక కార్యాచరణను రూపొందించనున్నారు. అయినా ఉగ్రవాద నిర్మూలనకు మరింత చిత్తశుద్ధితో కూడిన కార్యాచరణ అవసరం.
ఏ రూపంలో ఉన్నా ఉగ్రవాదం ప్రపంచానికే పెనుముప్పుగా మారింది. ఉగ్రవాదుల సురక్షిత స్థావరాలను, ఉగ్రవాదుల నెట్‌వర్కులను ధ్వంసం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. అంతర్జాతీయ శాంతి , సుస్థిరతలకు ముప్పుగా మారిన ఉగ్రవాద ఆనవాళ్లను రూపుమాపాల్సి ఉంది. రాజకీయ ధృడసంకల్పంతో పాటు అంతర్జాతీయ, ప్రాంతీయ సహకారం కూడా దీనికి ఎంతో ముఖ్యం. రెచ్చగొట్టే ఉగ్రవాదాన్ని చొప్పించే ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు శక్తివంతమైన ప్రచారోద్యమం కూడా అవసరం.

- బీవీ ప్రసాద్ 99633 45056