మెయిన్ ఫీచర్

ఏకాగ్రత ఉంటే విజయం మీదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనజాక్షికి ఇద్దరు కుమార్తెలు. నవ్య, దివ్య. చదువులో నవ్య రాణిస్తుంటే, దివ్యకు తక్కువ మార్కులొస్తున్నాయి. ప్రతిరోజూ క్లాస్ టీచర్ నుంచి ఇంటికి ఉత్తరాలే. చదువుకున్న తల్లి కాబట్టి దివ్వను తిట్ట కుండా.. కారణాలను అనే్వషించింది. పిల్లలు చదువుకోవడానికి ప్రశాంతత లేదు. ఇంటి చుట్టూ రణగొణధ్వనులు. పైగా, పిల్లలు వేరే గదిలో చదువుతున్నా.. రాత్రి ఏడు నుంచి తొమ్మిదిన్నర గంటల వర కూ టీవీ ముందే తామే ఉంటాం. తాము టీవీ చూస్తూ పిల్లలని చదవమంటే వారు ఎలా శ్రద్ధగా చదు వుతారని తనని తాను ప్రశ్నించుకుంది. పిల్లల చదివే టైంలో టీవీ బంద్, కిటికీలు బంద్. ఇంకేముం ది.. చదువులో పిల్లలు కుదురుకున్నారు. పాఠశాల నుంచి ఉత్తరాలు రావడం మానేశాయి. దివ్యకు మంచి మార్కులు వస్తున్నాయి. నవ్యకు ప్రశంసల ముంచెత్తుతున్నాయి.
****
ఏ రంగంలోనైనా సంపూర్ణంగా రాణించాలంటే ఏకాగ్రతే ప్రధానమన్న సంగతి బోధపడింది కదా! విద్యార్థులు, వ్యాపారులు, గృహిణులు, క్షురకులు, స్వర్ణకారులు ఎవరైనా.. తమ పనిలో నూటికి నూరుశాతం ఉత్తమ ఫలితాలు సాధించాలంటే ఏకాగ్రతే ప్రధాన ఆధారం. పైవారిలో ఎవ్వరిని తీసుకోండి.. వారి పనిలో ఏకాగ్రత అనే ఆయుధాన్ని విడిచిపెట్టారో ఆ పని చెడుతుంది. అంతేకాదు.. ఆ పనివంతునికి చెడ్డపేరు కూడా వస్తుంది. అందుకే ఏకాగ్రత అంత అవసరం. అయితే, ఈ ఆయుధం నిరంతర అధ్యయనం ద్వారా అలవడుతుంది. చంచలమైన మనస్సును నియంత్రించగలిగితే ఉన్నత శిఖరాలను అధిరోహించగలం. నిజానికి మనస్సు తన స్వభావంవల్లనే అలా మెలుగుతుంది. వీయడం.. గాలి స్వభావం. కాల్చడం అగ్ని స్వభావం. చెడ్డ పనులు చేయడం మూర్ఖుల నైజం. ఇందులో కొత్త సంగతేమీ లేదు. అయితే, ఇది ఉత్తముల మనస్సుకు ఉండకూడదు. ఆ మనస్సు నియంత్రణలో ఉండాలి. ఇది సాధ్యపడాలంటే, మనస్సు తాను ఇష్టానుసారంగా వ్యవహరించేందుకు కారణమవుతున్న వాతావరణానికి దూరంగా ఉంచనీయాలి.
పుట్టినప్పటి నుంచి మేకల మందలో పులి పిల్లను పెంచితే ఎలా వుంటుంది? మేకలాగనే పెరుగుతుంది. ‘నువ్వు పులివి. నీకు పౌరుషం ఎక్కువ! నీ ఆహారం మేకలు’ అని చెప్పేంతవరకూ ఆ పులికి తన బలం తెలియదు. అలానే ఏకాగ్రతను సాధించేందుకు మనస్సును తులసి వనంలాంటి వాతావరణంలో విహరింపజేయాలి. అపుడే మనసు ఏకాగ్రతతో ఏ పనైనా చేస్తోంది. ఆ పనిలో విజయాన్ని సొంతం చేసు కుంటారు.
జ్ఞానేంద్రియాల పాత్ర
ఒక పనిలో ఫలితం అనుభవించాలంటే జ్ఞానేంద్రియాల పాత్ర ఎంతో కీలకం. అసలు ‘తలంపు’ అనే ఆలోచన రావడంతోనే జ్ఞానేంద్రియాల కర్తవ్యం మొదలైనట్టు లెక్క. చెవులు, కళ్ళు, చర్మం, ముక్కు, నాలుక అనే ఈ ఇంద్రియాలు మనస్సుకు వాహనాలుగా ఉంటున్నాయి. అందుకే ముందుగా మనం ఈ మనస్సును బుద్ధి అనే ఖడ్గంతో అధీనంలో పెట్టుకుంటే ‘పని’ ప్రారంభించడం సులభమవుతుంది. ఏకాగ్రతను సాధించడానికి ఇది మొదటి మెట్టుగా చెప్పుకోవచ్చు. అలాగే మనస్సుకు తగ్గట్టు పనికి అవరమైన వౌలిక వసతులు సిద్ధం చేసుకోవాలి. శరీరాన్ని ఎంత చలాకీగా, ఆరోగ్యవంతంగా ఉంచుకుంటే అంతే లాభంగా మనస్సు ఉంటుంది. అలాగే ఘర్షణలు, చెత్త సినిమాలు, ఇతర పనికిరాని వ్యాపకాల్లో మనస్సును ముంచితే అంతా గందరగోళంగా తయారై, ఏకాగ్రతకు ఆటంకం కలుగుతుంది.
ఆత్మవిశ్వాసం అవసరం
తాము తలపెట్టిన కార్యంపై శ్రద్ధ్భాక్తి, ఆత్మవిశ్వాసం అవసరం. వ్యక్తికి బోలెడంత కండ బలం ఉన్నా, చేపట్టబోయే పనిపై శ్రద్ధ, గెలవగలనన్న ఆత్మవిశ్వాసం లేనట్టయితే విజయం వరించదు. భగవంతుడు అందరికీ సమానంగానే మెదడు ఇచ్చాడు. కానీ, దానిని క్రమశిక్షణగా, క్రమపద్ధతిలో ఉపయోగించుకుంటేనే సత్పలితాలను ఇస్తుంది.
అపారమైన జ్ఞానం ప్రతీ ఒక్కరిలో ఉంటుంది. కావాల్సిందల్లా మనస్సును నియంత్రించుకుని, బద్ధకమనే శత్రువును దరిచేయరనీయకూడదు. నిరంతర సాధన చేయాలి. ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం నిర్విరామంగా కృషి సల్పుతుండాలి. వ్యర్థ ఆకర్షణలు, మనోవికార హేతువులకు దూరంగా ఉండాలి. గురుభక్తితో మసలుకోవాలి. మనస్సుకు, ఏకాగ్రతకు యోగానుక్రమం తప్పక సాధనచేయాలి. ఉత్తమ బోధనలను వింటూ ఉత్తములతో స్నేహం చేయడం చేయాలి. అదేవిధంగా ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలి. తద్వారా మనస్సులోని మలినాలను నిర్మూలించి ఏకాగ్రత అనే శక్తిని పొందాలి. అపుడే ఆ వ్యక్తి తనను తాను ఉద్ధరించుకుంటాడు. నవ సమాజ నిర్మాణానికి నడుం బిగిస్తాడు.

- జి.కల్యాణి