మెయిన్ ఫీచర్

తగినంత నిద్ర అవసరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లల్లో ఎదుగుదలకు ఆహారం తరువాత నిద్ర అత్యంత అవసరం. అటు శరీర పెరుగుదల, మెదడు వికసించడం రెండూ దాదాపు నిద్రలోనే జరుగుతాయి. నిద్ర విషయంలో పెద్దవారిలాగే పిల్లలు కూడా ఎవరికి వారు ప్రత్యేకమే. నిద్ర తగినంతగా లేకపోతే పిల్లల్లో ఎదుగుదల సమస్యలతో పాటు ప్రవర్తనలో కూడా లేడా కనపడుతుంది. ఈ తేడా ఒక్కో బిడ్డలో ఒక్కో రకంగా ఉంటుంది. చంటి బిడ్డలు అయితే నిద్ర చాలనప్పుడు ఊరికే ఏడుస్తూ ఉంటారు. అదే పెద్ద పిల్లలు అయితే ఊరికే నస పెడుతుంటారు. మొండిగా ప్రవర్తిస్తుంటారు. పిల్లల్లో ఎవరు ఎంతసేపు నిద్రపోవాలనే దాంట్లో కొంత మినహాయింపులు ఉన్నప్పటికీ నాలుగేళ్ల నుండి పదేళ్ల మధ్యన ఉండే పిల్లలకు కావల్సినంత సరాసరి నిద్రపోయే వేళలు ఉండాలి.
చిన్నపిల్లలు అంటే నాలుగు నుంచి ఐదు సంవత్సరాల వయస్సు పిల్లలు 11 గంటల నుండి 12 గంటల వరకు నిద్ర పోవాల్సి ఉంటుంది. ఐదు నుండి ఎనిమిది సంవత్సరాల వయస్సు పిల్లలు 10 నుండి 11 గంటల వరకు నిద్ర పోవాల్సి ఉంటుంది. ఎనిమిది నుండి పది సంవత్సరాల వయస్సు పిల్లలు 9 నుండి 10 గంటలు నిద్ర పోవాల్సి ఉంటుంది. నిద్ర కొరవడితే పిల్లల మనసు నిలకడగా ఉండదు. దీనితో పనిపై ధ్యాస పెట్టలేరు. నిద్ర తక్కువైన పిల్లల్లో పెద్దవారిలో ఉన్నట్టే మబ్బుగా ఉంటుంది. జ్ఞాపకం తగ్గడం, నిర్ణయాత్మక శక్తి లోపించడం జరుగుతుంది. ఇవన్నీ నిద్ర సరిగా లేనందువల్ల పిల్లల్లో కనిపించే సాధారణ లక్షణాలు. వీటికి అదనంగా కాస్త పెద్ద పిల్లలు అయితే దుడుకు స్వభావాన్ని చూపిస్తారు. కొందరు చిన్నపిల్లలు అయితే మందమతితో ఉండి చీటికి, మాటికి ఏడుస్తూ నసపెడుతుంటారు. కారణం లేకుండానే ఏ చంటిబిడ్డ అయినా నస పెడుతుంటే ముందుగా ఆలోచించాల్సింది ఆ బిడ్డకు నిద్ర చాలలేదని.. ఎదిగే పిల్లలకు రోజుల తరబడి నిద్ర తక్కువ అయినప్పుడు శారీర ఎదుగుదల కూడా మందగిస్తుంది.
ఆధునిక జీవనవిధానంలో వచ్చిన మార్పులు అందరిలోనూ నిద్ర తగ్గడానికి కారణాలు అవుతున్నాయి. టీవీ సంస్కృతి వచ్చాక చాలామంది పిల్లలు వారికి వారుగా త్వరగా నిద్రపోరు. సెలవుల్లో అయితే ఫరవాలేదు. కానీ బడి ఉన్నప్పుడు వారిని పొద్దునే్న నిద్రలేపి పపించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు వారికి నిద్ర సరిపోదు. పిల్లల్లో ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లను చాలా చిన్న వయస్సు నుండే అలవాటు చేయాలి. ఇలా అలవాటు చేయటాన్ని వైద్య పరిభాషలో ‘బెడ్ రొటీన్స్’ అంటారు. రాత్రి భోజనం అయ్యాక వారితో కబుర్లాడటం, నిద్ర పోవటానికి ముందు పళ్లు తోముకోవడం, స్నానం చేయించటం, పడక దుస్తులు తొడగడం వంటివి ప్రతిరోజూ ఒక నిర్ణీత సమయంలో చేయించాలి. పడకపైకి చేరగానే బొమ్మల పుస్తకాలు తిరగెయ్యడం, కథలు చెప్పించుకోవటాన్ని ప్రోత్సహించాలి. ఈ పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వరుస క్రమం మారకుండా ప్రతిరోజూ చేయించాలి. ఈ మొత్తం ప్రహసనం కనీసం అరగంటకు తక్కువ కాకుండా ఉండాలి. ఇలా చేయించడం వల్ల ఆ పని మొదలు పెట్టినప్పటి నుండీ వారికి తెలియకుండానే నిద్రకు ఉపక్రమిస్తారు. ఇలా చేయటం వల్ల వారిలో నిద్రవేళలు సరిగ్గా ఉంటాయి.
* వయస్సుకు తగినట్టు పిల్లల్ని నిద్రపోయేటట్టు అలవాటు చేయాలి.
* సెలవుల్లో పిల్లలు నిద్రవేళలు క్రమం మారకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ మారినా, బడి తెరవడానికి కనీసం వారం రోజుల ముందు నుండి నిద్రవేళల్ని సరిచేయాలి.
* సెలవులతో సంబంధం లేకుండా ప్రతిరోజూ పడుకోవటం, లేవటంలో ఒకే సమయాన్ని పాటించే విధంగా చూడాలి.
* పిల్లల గదుల్లో టీవీలు, కంప్యూటర్లు, వీడియోగేములు లాంటివి ఉంచొద్దు. అలాగే నిద్రవేళకు అరగంట ముందు వాటిని చూడనీయకూడదు. నిద్రకు అరగంట ముందు చదవటం, హోం వర్కు చేయడం నిలిపివేయాలి.
* సాయంత్రం, రాత్రిపూట పిల్లలు తినే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలి. సాయంకాలం తర్వాత చాక్లెట్లు, సాఫ్ట్ డ్రింకులను తాగనీయకూడదు. వీటిలో ఉండే కెఫీన్ అనే పదార్థం రోజువారీ నిద్రను చెడగొడుతుంది.
* పడుకునే ముందు రిలాక్స్ కావడం పిల్లలకు నేర్పించాలి. ‘బెడ్ రొటీన్స్’ను అలవాటు చేయాలి.
* పడుకునేముందు ఆ రోజులో చేసిన పనులన్నింటినీ ఒకసారి గుర్తుచేసుకోమని చెప్పాలి. బెడ్‌పైకి చేరగానే వౌనంగా, కళ్లు మూసుకుని కాసేపు దేవుడ్ని ప్రార్థించమని చెప్పాలి.
ఇలాంటి మంచి అలవాట్ల వల్ల పిల్లలు సుఖంగా, హాయిగా నిద్రపోయి శారీరకంగా ఆరోగ్యంగా ఎదుగుతారు.