మెయిన్ ఫీచర్

పెద్దపేగును శుభ్రపరిచే ఆహారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమర్థవంతమైన జీవక్రియలను నిర్వహించే, పోషకాలను శోషించే బాధ్యతలను పెద్దపేగు వహిస్తుంది. ఆ క్రమంలో భాగంగా ఆహారంలోని అనారోగ్యకర అంశాల దుష్ప్రభావానికి ప్రత్యక్షంగా కూడా ప్రభావితం కావచ్చు. తద్వారా ఇది అనేక రుగ్మతలకు దారితీసే అవకాశాలు ఏర్పడవచ్చు. కాబట్టి పెద్దపేగును శుభ్రంగా నిర్వహించుకోవడం ద్వారా అనేక సమస్యలకు చెక్ పెట్టవచ్చునని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. పెద్దపేగు మరింత సమర్థంగా పనిచేయడానికి సహాయపడే ఆహార పదార్థాల జాబితాను ఇటీవల ఆరోగ్య నిపుణులు విడుదల చేశారు. వీటిద్వారా జీర్ణక్రియల గురించిన జాగ్రత్తలతో పాటు, పెద్దపేగు కేన్సర్ గురించిన ఆందోళన లేకుండా నిర్వహించవచ్చు. ఆ జాబితా ఏంటో చూద్దాం..
* ఓట్స్
నేటి ఆధునిక కాలంలో ఓట్స్‌లోని ఆవశ్యక పీచుపదార్థాలు, అధిక పోషక విలువల కారణంగా అనేకమంది ప్రజలు వీటిని ఎక్కువగా తీసుకుంటారు. ఓట్స్‌లో ఫినోలిక్స్, కెరోటినాయిడ్స్, ఫైటిక్ ఆమ్లం, బీటా గ్లూకన్, విటమిన్ ఇ వంటి బయోయాక్టివ్ పోషకాలతో కూడిన ప్రత్యేక సమ్మేళనాన్ని కలిగి ఉంటాయి. ఇవి పెద్దపేగు కదలికలను పెంచుతాయి. ఓట్స్‌లోని పిండిపదార్థాలు, జీర్ణక్రియను నిర్వహించడానికి, వాటి పనితీరును పెంచడానికి సహాయపడే ఫెర్మెంటబుల్ కార్బోహైడ్రేట్లను అందిస్తుంది. ఈ కార్బొహైడ్రేట్లు, కోలిక్ బాక్టీరియాను నిర్వహించడంలో ఉత్తమంగా సహాయపడతాయి. అంతేకాకుండా ఓట్స్ పెద్దపేగు జీవక్రియలను పెంచడంలోనూ సహాయపడే షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్లను కూడా అధికంగా కలిగి ఉంటుంది.
* సిట్రస్ పండ్లు
పెద్దపేగును శుభ్రపరచడంలో నిమ్మ, ఆరెంజ్, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లు ముందుంటాయి. ఇవి ఇన్ల్ఫమేషన్‌ను తగ్గించడంలోనే కాకుండా కోలన్ కేన్సర్‌ను నిరోధించడంలో కూడా అనుకూల ఫలితాలను ఇవ్వగలవు. సిట్రస్ పండ్ల రసంలో చురుకైన సహజ జీవక్రియల శక్తి ఉన్న కారణంగా పేగులలోని ప్రత్యక్ష శోషణను ప్రభావితం చేస్తాయి. సిట్రస్ పండ్లలోని ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ ఏజెంట్స్ మూలంగా పెద్ద పేగు సంబంధిత రోగాలు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని చెబుతారు.
* అవకాడో
అవకాడో పెద్దపేగు నిర్వహణకు అత్యుత్తమైన మెడిసిన్ అని చెప్పవచ్చు. పేగుల్లోని కేన్సర్ కణాల పెరుగుదలను సమర్థవంతంగా నిరోధించగల సామర్థ్యం ఈ అవకాడో సొంతం అందువల్ల ఇది పెద్ద పేగు కేన్సర్ సమస్యకు కాంప్లిమెంటరీ చికిత్సగా కూడా ఉపయోగపడుతుంది. అవకాడోలో విషతుల్య రసాయనాలను తగ్గించడంలో పనిచేస్తూ, తద్వారా పెద్దపేగు కుహరం, పక్కనున్న కణజాలాల్లో ఒత్తిడిని తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.
* చియాసీడ్స్
కేవలం రెండు చెంచాల చియాసీడ్స్‌ను ఆహార ప్రణాళికలో చేర్చుకోవడం ద్వారా జీర్ణక్రియ ప్రక్రియలు సక్రమంగా జరిగి పెద్దపేగుపై ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాకుండా చియాగింజలు డైటరీ ఫైబర్ నిల్వలను కలిగి ఉంటాయి కాబట్టి ఈ పీచుపదార్థం పేగు కదలికలను ప్రేరేపించడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా అన్ని విషతుల్య రసాయనాలను తగ్గించడంలో సహాయపడుతూ శరీరంలోని కొలెస్ట్రాల్‌ను బయటకు పంపుతుంది.
* పెరుగు
పెద్దపేగు జీర్ణక్రియల గురించి జరిపిన అనేక పరిశోధనల్లో పెరుగు పెద్దపేగు ఆరోగ్యంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని తేల్చాయి. క్రమంగా పెద్దపేగు ఆరోగ్యాన్ని, జీర్ణక్రియలను నిర్వహించుకోవడానికి పెరుగు లేదా యోగర్ట్ తరచుగా తీసుకోవడం ఉత్తమమని సూచించాలి. పెరుగు, పెద్దపేగు ఆరోగ్యాన్ని, జీర్ణక్రియలను నిర్వహించుకోవడానికి పెరుగు లేదా యోగర్ట్ తరచుగా తీసుకోవడం ఉత్తమమైంది.
* బ్రౌన్ రైస్
బ్రౌన్ రైస్ ఆహార ప్రణాళికలో జోడించుకోవడం ద్వారా పెద్దపేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. తరచూ తీసుకునే వైట్ రైస్‌తో పోలిస్తే ఇది అధిక పరిమాణంలో ప్రొటీన్స్, మైక్రోన్యూట్రియంట్లను కలిగి ఉంటుంది. బ్రౌన్ రైస్ వినియోగం, అల్సర్స్, పేగుకోతల చికిత్సలో ఉత్తమంగా సహాయపడుతుంది.
* పాలకూర
ఆకుపచ్చని ఆకుకూరలు, విస్తృత స్థాయిలో ఆరోగ్య ప్రయోజనాలను అందించగలిగే గట్ బాక్టీరియాను పెంచడంలో కీలకపాత్రను పోషిస్తాయి. పాలకూరలో అధికంగా ఫైబర్ నిక్షేపాలు ఉన్నాయి. ఇది పెద్దపేగులో జీర్ణక్రియలను సమర్థవంతంగా నిర్వహిస్తూ పేగుల ద్వారా మృదువుగా ప్రయాణించేలా చూడగలుగుతుంది.
* వెల్లుల్లి
ప్రాచీనకాలం నుండి వెల్లుల్లి వివిధ శ్రేణుల రుగ్మతలకు ఔషధంగా పనిచేస్తోంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ సమ్మేళనాలు పెద్దపేగుల్లో కేన్సర్ కణాల విస్తరణ తగ్గుదలలో ఉత్తమంగా పనిచేస్తాయి.
* దానిమ్మ రసం
దానిమ్మరసంలో అధిక గాఢత కలిగిన ఫినోలిక్స్, ఫ్లేవనాయిడ్స్ ఉన్న కారణంగా పెద్ద పేగును అంటువ్యాధులు, కేన్సర్ వంటి జబ్బుల బారిన పడకుండా చూడటంలో ఇవి సహాయం చేయగలవు.
* ఆపిల్స్
ఆహారప్రణాళికలో ఆపిల్ చేరినప్పుడు గట్‌లో మైక్రోబయల్ ఫ్లోరా విస్తృతమైన పెరుగుదలను ప్రోత్సహిస్తాయని శాస్ర్తియ ఆధారాలు సూచిస్తున్నాయి. ఇవి పేగుల కదలికల్లో మృదువైన ప్రవాహాన్ని పెంచుతూ పోషకాలను శోషించడంలో సహాయం చేస్తాయి. ఆపిల్స్‌ను తరచుగా తీసుకోవడం మూలంగా జీర్ణక్రియ వేగాన్ని పెంచుకుంటూ గుండె సంబంధిత వ్యాధులను నయం చేసుకోవచ్చు.