మెయిన్ ఫీచర్

విఘ్ననాశకునకు విఘ్నారాధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే!’’

‘గణానాంత్వా గణపతిగ్‌ం హవామహే’’ అంటూ మనం చేసుకొనే పూజ ఉమాసుతునకు మంగళపూజ.
‘‘ఆదౌ పూజ్యో గణధిపః’’ అని ఆర్యోక్తి. ఏపూజకైనా ముందుగా గణపతి పూజ చేయడం సంప్రదాయం.
పిల్లా పెద్ద అనే తేడా లేకుండా అందరికీ వినాయకుడు ప్రియమయిన దేవుడు. సమస్త మంత్రములకు ఓంకారం ముందున్నట్లు ప్రతి పనికీ ముందు గణపతి పూజ చేయడం అనాదిగా ఆచారంగా వస్తోంది. భాద్రపద శుద్ధ చవితినాడు అనగా వినాయక చవితి దినమున గణపతిని యధావిధిగా అర్చించి స్వామివారి అనుగ్రహంతో ఏడాది పొడవునా విఘ్నములన్నవి లేకుండా, నీలాపనిందలు పడకుండా సుఖశాంతులతో కూడిన జీవితం గడపాలని చిన్న పెద్దా అందరూ గజానుని పూజిస్తారు.
పైగా ఈ గజాననుని పూజలో వైవిధ్యమున్నది. అందరి దేవుళ్లకు పూలు పండ్లు సమర్పిస్తే ఈ గణనాథునికి గరిక, అనేక రకాల పత్రి అంటే ఆకులను సమర్పిస్తే చాలు. గరిక ప్రియుడు గణపతి. గారెలు బూరెలు చిత్రాలన్నాలు, పాయసాన్నాలు ఇట్లాంటివి ఇతర దేవీ దేవతలకు నివేదన చేస్తే ఈ గణపయ్యకు ఉండ్రాళ్లు, కుడుములు సమర్పిస్తే చాలు. నాలుగు గుంజీళ్లు తీస్తే చాలు కోరిన కోర్కెనెల్లా తీరుస్తాడు.
గణపతి ఓ విశిష్ట దేవుడు. ఆయన ప్రభావమును గురించి బ్రహ్మణస్పతి సూక్తము, గణపతి అధర్వ శీర్షోపనిషత్, హేరంభోపనిషత్తు, గణపతి సూక్తం మొదలైన వాటిలో విపులంగా తెలియజేయబడింది. మట్టి వినాయకుడినే పూజించడం అనవాయతి. నేడు అనేక రసాయనాల పూతతో విఘ్నేశ్వరులు వచ్చినా మట్టి తత్వాన్ని తెలుసుకొనమని చెప్పడానికే వినాయక పూజనాడు మట్టి వినాయకుడిని పూజిస్తారని మొదటి నుంచి పెద్దలంటారు. రకరకాల వస్తువులతో గణపతిఆకారం చేసుకొని ఆయన్ను ఆరాధన చేసే వారున్నారు. అట్లా పూజించేవారికి ఏ ఏ ఫలితాలు వస్తాయో వివిధ శాస్త్రాలు చెబుతున్నాయ.
బంగారు విగ్రహాన్ని పూజిస్తే ఐశ్వర్యాన్ని, వెండిమూర్తిని పూజించినట్లయితే ఆయుర్‌వృద్ధిని; రాగి ప్రతిమను పూజిస్తే సంకల్ప సిద్ధి కల్గుననీ; శిలావిగ్రహాన్ని పూజిస్తేనేమో మోక్షగతిని పొందుతారని, ఇక మట్టి విగ్రహన్ని ఆరాధించినట్టయితే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడన్నది శాస్త్ర వచనం.
అంతేకాదు ముత్యం, పగడం, స్ఫటికం, తెల్ల జిల్లేడు వేరు మొదలైన వాటితో కూడా వినాయక విగ్రహాలను చేయించి పూజించినవారికి విశేష ఫలితాలు చేకూరుతాయని తెలియజేసే ఆధారాలు ఎనె్నన్నో ఉన్నాయి.
‘‘ఏకమేవా ద్వితీయం బ్రహ్మ’’ రెండు దంతాలలో ఒకటి అద్వైత సత్యమైన పూర్ణత్వాన్ని విశదపరచగా రెండవదైన విరిగిన దంతం- ఈ జగత్తుకు చిహ్నం. వ్యక్తమైన రుూ ప్రపంచం, అవ్యక్తమైన విశ్వం ఒకే పరమార్థ సత్యానికి విశేషణాలని తన దంతముల ద్వారా తెలియచేసినవాడు ఏకదంతుడు. ఒకసారి దేవతలను జయించుటకు రాక్షసులనేక విఘ్న యంత్రముల నేర్పాటు చేసికొన్నారు. గణేశుడు వానిని నాశనము చేశాడు. దానిని చూచిన శ్రీ లలితాదేవి సంతసించింది. విఘ్నయంత్రములు భేదింపబడ్డాయి. దేవతలు విఘ్నముల నుండి విడుదలయ్యారు. సంతసించిన లలితాదేవి కామేశ్వరుని ముఖముపై క్రీగంటి దృక్కుల నుంచి దంతములు కన్పించునట్లు నవ్వింది. జగన్మాత నవ్వుల కాంతుల నుండి గజరూపముగల శ్రీ మహాగణపతి ఆవిర్భవించాడని బ్రహ్మాండ పురాణం, లలితా సహస్రనామాలు వెల్లడిస్తున్నాయ.
ఇన్ని విశేషాలున్న విఘ్నేశ్వరుని ప్రపంచం అంతా ఆదిదేవుడుగా కొలుస్తారు. భారతీయులు భాద్రపద శుద్ద చవితినాడు పార్వతీ నందనునికి ప్రథమ పూజలు అందిస్తారు.
ప్రతి పండుగ వెనుకా ఓ అంతరార్థము ఉన్నట్లే ఈ వినాయకుని పండుగలోను. సర్వమానవసౌభాతృత్వమూ సకలప్రాణి హితమూ ఉన్నాయ. అంతేకాక సృష్టిలో అల్పమైన వస్తువునైనా అనల్పర్థాన్ని కలిగి ఉంధని బోధిస్తోంది ఈ పర్వం. ఈ స్వామి పుట్టుక, అతడి రూపం, విన్యాసాల గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటితోపాటు నామంలోనూఉన్న విశిష్టత- ‘గ’ కారంజ్ఞానవాచకం.‘ణ’కారం ‘నిర్వాణా’నికి సంకేతం. జ్ఞాన, నిర్వాణాలకు అధిపతి కనుక గణేశుడుగా ప్రశస్తివచ్చింది. వినాయకుని ఆకారవిశేషాల విశేషార్థాలే కాక ఆయన వాహనమూ అల్పజీవులను చులకనగా చూడరాదనే విషయంతో పాటుగా అల్పబుద్ధిని మన బుద్ధి నియంత్రణలో ఉంచుకుని అందరియెడల అన్ని స్థితులలోనూ సమబుద్ధిని కలిగి ఉండాలని ఉద్బోధిస్తోంది.
జ్ఞానమొక్కటే నన్నదానికి గుర్తుగా ఏకదంతుడు దర్శనమిస్తాడు. గణపతి దంతం జ్ఞానానికి చిహ్నం. చేటలంత చెవులున్నవానిగా ప్రసిద్ధికెక్కిన వినాయకుడు విన్నదానిలోంచి మంచిని మాత్రమే గ్రహించాలన్న నీతిని చెప్పటానికే శూర్పకర్ణుడయ్యాడు. చిన్నవైన కనులతో సృష్టిరహస్యమైన సూక్ష్మబుద్ధిని గ్రహించ మంటున్నాడు. వక్రతుండం ‘ఓంకార’ ఆకారానికి ప్రతీక, లంబోదర నామం సమస్త లోకాలను దాచుకున్న ఆయన కుక్షి ని తెలియజేస్తుంది. పాశాంకుశధరుడు అనగా - పాశం, అంకుశం ఆయన ఆయుధాలు. ఆయనను శరణన్నవారి క్రోధమును అణిచివేసి, ‘రాగ’పాశంతో మనల్ని కరుణిస్తాడని తత్వరహస్యమూ తెలుసుకోవాల్సిందే.
ఇన్ని రహస్యాలను దాచుకున్న ఈ విఘ్ననాయకుడే విఘ్నాలకు నాయకుడు. ‘వి’ అంటే ‘విఘ్నం’ కాబట్టి ఆయన విఘ్న గణాలను తన ఆధీనంలో ఉంచుకొని భక్తులకు ఆ విఘ్నాలను తొలగించి శుభాలను ప్రసాదిస్తూ ఉంటాడు.

- చివుకుల రామ మోహన్