మెయిన్ ఫీచర్

పరిష్కారం లేని సమస్యలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టీవీ, న్యూస్‌పేపర్, వాట్స్‌అప్, ఫేస్‌బుక్ ఇలా ఇపుడున్న ఏ ఆధునిక సౌకర్యాన్నైనా చూడండి. ఎక్కడో ఒకచోట ప్రతిరోజు ఆత్మహత్యల పర్వం ఉంటుంది. ఆర్థిక కష్టాలో, ప్రేమ వైఫల్యాలో, నిరాశలో, భగ్న ప్రేమికులో, పరీక్షల్లో తప్పడమో ఇలా ఏదైనా ఆత్మహత్యకు కారణం అవుతోంది.
పూర్వకాలంలో వార్తా ప్రచారాలు అంతగా ఉండేవికావు. ఒకరి క్షేమ సమాచారాలు తెలుసుకోవాలంటే కేవలం జాబులు రాసుకొనేవాళ్లు. అంతేకాదు అపుడు ఇప్పటిలా సినిమాలు, సీరియల్స్ ఇలాంటి వినోద కార్యక్రమాలు కూడా ఉండేవికావు. కానీ వారాంతంలోనో, లేక నెలకో సారో మాత్రం ముఖ్యంగా తెలుగువారిలో జానపద కళలను ప్రదర్శించేవారు. వారి కళల్లో ఏ రామాయణ మహాభారత భాగవత కథలు పురాణ పురుషుల గురించి చరిత్ర లేకుంటే దేశచరిత్రలో కలికితురాయిలా ఉండేవారి జీవితాలను గురించో లేకపోతే అష్టకష్టాలు పడి ఉన్నతంగా ఎలా బతుకుబండిని నడిపించారో వారి గురించో ఇలా ఎన్నో విషయాలు ఆ యా జానపద కళలద్వారా ఆవిష్కరించేవారు. దానే్న ఎంతో ఆనందంగా రాత్రంతా చూస్తూ పల్లెల్లో జీవించేవారు. చదుకున్న కొందరు పండుగల్లోనో, పబ్బాల్లోనో హరికథలు, బుర్రకథలు పెట్టించేవారు. వాటిని ఎంతోసంతోషంగా పాల్గొని చూచి వినేవారు. అపుడు అంతగా ఈ ఆత్మహత్యల ప్రహసనాలు కనిపించేవి కావు.
ఇపుడు ఆధునికత పెరిగింది. టెక్నాలజీ పెరిగింది. అపుడు ఇంట్లో ఒకరు ఉద్యోగం చేసేవారు. ఆ ఇంట్లో పిల్లలే పదిమంది ఉండేవారు. పెద్దలూ క్రమసంఖ్య 5, 6 ఉండేది. మరి ఆరోజుల్లో ఆర్థిక కష్టాలు ఉండేవే కావా? వాళ్లకు దినం గడవడం కష్టంగా అనిపించలేదా? వాళ్లెందుకు ఆత్మహత్యల జోలిని కదిపేవారు కాదు.
ఇపుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్. ఇంట్లో ఇద్దరే పెద్దలు. వారికి పిల్లలు ఒకరు. లేదంటే ఇద్దరూ మరొకరికి అవకాశమే లేదు. ఈ పెద్దలకు పెద్దలు వస్తే కేవలం ఒక పూటనో అదీ లేకుంటే వీడియో కాల్స్‌లోనో పలుకరిస్తూ ఉంటారు.
ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్‌లో భార్యాభర్తలిరువురూ ఉద్యోగస్థులే ఎక్కువ మంది ఉంటున్నారు. ఉద్యోగం లేకపోతే ఏదో ఒక చిరువ్యాపారమూ చేసేవాళ్లు ఉంటున్నారు. పిల్లలనూ చదివిస్తున్నారు.
ఇంతకుముందు పెళ్లిళ్లు చేస్తే ఆ పెళ్లిల్లో కలసిన భార్యాభర్తలిరువురూ వారిద్దరి మనసులు కలిసినా కలవకున్నా దాంపత్యబంధం అంటూ నూరేళ్లు కాపురం చేసేవారు. ఒక్కచోటే ఉండేవారు.
మరిప్పుడు అట్లాకాదు. వివాహాలు జరుగుతున్నాయి. విడిపోయే జంటల సంఖ్యా ఎక్కువగానే ఉంటోంది.
విడిపోయిన వారు లేక అసలు పెళ్లి చేసుకోని వారు ఇద్దరిలో సహజీవనం చేసేవారు ఈ సమాజంలో కనిపిస్తూనే ఉన్నారు.
కానీ ఇన్ని రకాల ఆలోచన్లు ఉన్న మనుష్యుల మధ్య అంతరాలు ఏర్పడుతునే ఉన్నాయి. ఆ అంతరాలు అంతంలేనివిగా మారుతున్నాయి. కలసి మెలసి ఉంటూ భవిష్యత్‌తరాలకు ఆదర్శంగా నిలవాల్సిన భార్యాభర్తల మధ్యలో పొరపొచ్చాలు. ఇగో సమస్యలు ఇంకా ఇతరత్రా అనేకానేక సమస్యలు.
తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య కూడా అంతరాలే. పుట్టడానికి కారణమైనవాళ్లు, ఎదగడానికి చేయూత నిచ్చేవాళ్లు తమ పిల్లల భవిష్యుత్తు బంగారు మయం కావాలనుకొనేవారు అట్లాంటి తల్లిదండ్రులతో పిల్లలకెందుకు గొడవలు వస్తున్నాయి. వారిరువురి మధ్య ప్రేమకు పొరలెందుకు ఏర్పడుతున్నాయి. పిల్లలిది లేతమనసు వారి లోకంలో తల్లిదండ్రులు, గురువులు వీరే సూపర్‌మ్యాన్ అట్లాంటి మనసున్న పిల్లలు పెద్దలపై ఎందుకు తిరుగబడుతున్నారు?
అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు , వదినామరదళ్లు, బావమరుదులు ఇలావీరందరి మధ్యకూడా అనుమానాలు, ఇగోలు పుడుతున్నాయి.
ఇట్లాంటి వారితో కూడిన సమాజంలో మరికొన్ని సమస్యలు.
సరే... ఎక్కడైనా సమస్యలుంటాయి. మరి ఆ ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుందికదా. కానీ పరిష్కారం లేని సమస్యలూ అంటూ దానికి ఆ సమస్యకు చావు ఒక్కటే పరిష్కారం అంటూ ఎంతోమంది తేలికగా ప్రాణాలను వదిలేస్తున్నారు. వారితో పాటు కుటుంబ సభ్యుల ప్రాణాలను తీసుకొని వెళ్తున్నారు.
సమాజం ఇలానే సాగితే దీనికి మంచి భవిష్యత్తు ఉంటుందా?
అసలు ఎందుకు ఇన్ని పరిష్కారం లేని సమస్యలు పుడుతున్నాయా? అని మానసిక వైద్య నిపుణులు, సామాజిక సంస్కర్తలు, సైకాలజీ కౌన్సిలర్స్ ఆలోచిస్తున్నారు. ఆ సమస్యలకు పరిష్కారాలు వెతికి ఆత్మహత్యలను ఆపుదామని ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నం సపలం అవుతుందా?
ఆత్మహత్యలు చేసుకోకూడదు అని చెప్పడానికి చట్టాలు ఉన్నాయి. ధర్మసూక్తులూ ఉన్నాయి. అవి ఉన్నంత మాత్రాన ఆత్మహత్యలకు సంకెళ్లు పడతాయా ? అంటే లేదు అని ప్రతి వార్తాపత్రిక చెబుతూనే ఉంది.
సమస్య కనుక్కొంటే పరిష్కారం దొరుకుతుంది. సమస్య పరిష్కారం కావాలంటే మనుష్యుల ఆలోచనల్లో మార్పు రావాలి. పక్కవారిని అనవసరంగా అభాండాలు వేయకూడదు. తప్పు చేయని వారు సాధారణంగా ఎవరూ ఉండరు. తప్పు చేసినా ఆ పని తప్పు అని తెలుసుకొని తిరిగి ఆతప్పు చేయకుండా సరిచేసుకొంటే చాలు దానికోసం ప్రాణాలు అర్పించనక్కర్లేదు అని ఆలోచన కలిగేట్లుగా మసలే మనుష్యులు పుట్టుకరావాలి. అపుడే ఈ ఆత్మహత్యలు ఆగుతాయి.
మనుషుల ఆలోచనల్లో మార్పు రానంతవరకు ఏ చట్టమూ ఏ సూక్తి మంచి ఫలితాన్ని ఇవ్వదు.
ఆ దిశగా ఆలోచిస్తే...
మనుషుల్లో త్యాగ గుణం లేకపోవడం, మానవత్వం మరుగున పడిపోవడం, నాకెందుకులే అన్న ధోరణి ప్రబలడం, పక్కవారి గురించి కాసె్తైనా ఆలోచన లేకపోవడం ఇవి సమస్యలకు కారణాలు ఎవరికైనా కనిపిస్తాయి. ఒక కుటుంబం యావత్తు మరణానికి దగ్గరైంది అంటే ఆ కుటుంబం వెనుక సమాజం ఉంటుంది కదా. వారి బంధువులు, చుట్టాలు, అక్కఅన్న అమ్మ తండ్రి ఇలాంటి వారు ఉన్నారన్న మాటే కదా.
మరి వాళ్లంతా వీరికి ఎందుకు ఊరట నివ్వలేకపోతున్నారు. వారికి చెప్పుకోలేని సమస్యలు ఎందుకు తయారు అవుతున్నాయి. ఇపుడు చెప్పిన లక్షణాలు కొరవడినందు వల్లే కుటుంబం మరణలేఖలు రాస్తాయన్నది నిజమని తేలుతుంది.
ఏ వ్యక్తి లేదా అది స్ర్తి యైనా, పురుషుడైనా, పిల్లలైనా, పెద్దలైనా ఎవరైనా సరే తాము తమ జీవితాన్ని అంతం చేసుకోవాలని అనుకోరు. ఒకవేళ అట్లా అనుకున్నారు అంటే వారి మనసులో ఎంతటి బాధను అనుభవిస్తున్నారో ఆలోచించాలి.
మనం లేకపోతే నష్టపోయే వారు బాధపడేవారు ఎందరు ఉన్నారు అని కూడా ఆలోచించాలి. మనుష్యులు ముందుగా వారు నా అనుకొనే వారి మధ్య అసహజ బంధాలు ఉంటే దూరం చేసుకోవాలి. మనస్ఫూ ర్తిగా ఎదుటివారితో బాంధవ్యా న్ని కలిగి ఉండాలి.
ఆత్మహత్య చేసుకొందా మనుకొని ఆ ప్రయత్నం నుంచి దేవుని దయ వల్ల బయట పడిన వారిని చుట్టూ ఉండే జనం వారిపైన ఎటువంటి దుష్ప్రచారం చేయకూడదు. ఎద్దేవ చేయకూడదు. చనిపోయన వారి గురించి కూడా పుకార్లు పుట్టించకూడదు. ఏ ఇద్దరి మధ్య బాంధవ్యం వారికే తెలుస్తుంది కానీ మూడో వ్యక్తికి తెలియదు. కేవలం వారి చెప్పిన మాటలను బట్టి లేకుంటే వీఠు చూసిన దృశ్యాలను బట్టి వూహించుకుని వారిపై ఆరోపణలు అసలు చేయకూడదు.
చనిపోదామనుకొనేవారు కూడా పరువుకోసమో, ఆర్థిక కష్టాలు అనుభవించలేకపోతున్నామనో అనుకోకూడదు. పరువు మరణాన్ని మించినది కాదు కదా. ఆర్థిక కష్టాలను నలుగురితో పంచుకుంటే ఏదో ఒక దారి దొరుకుతుంది. పరమాన్నం తినే చోట గంజన్నం అయినా దొరుకుతుంది. నందో రాజా భవిష్యతి అన్న సూక్తి ఉండనే ఉంది కదా. ఈరోజు ఆర్థిక కష్టాలు కృషి చేసి ఆమడ దూరానికి తరిమేయవచ్చు. దానికోసం ప్రాణాలు తృణప్రాయంగా ఎంచుకోకూడదు.
కష్టం వచ్చింది అని చెప్పుకుంటే ఒకరు కాకపోయినా మరొకరు కనికరం చూపకమానరు. కనుక ఏ సమస్య వచ్చినా ముందు అది సమస్యగా భావించక పక్కవారితో చెప్పుకోవాలి. వారి సలహాను తీసుకోవాలి. మనం ఎదుటి వారి ముందు తలవంచితే తప్పేమి లేదు అన్న భావన పెరగాలి. ఎవరు గొప్ప అని కాక మంచి ఎంత చేస్తున్నాము అని ఆలోచిస్తే చాలు మరణాల సంఖ్యను తగ్గించవచ్చు.

-వాణి కుమారి