మెయిన్ ఫీచర్

చిన్నారులే ఇంటికి అందం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ ఇల్లు అయినా కళకళలాడుతూ కనిపించాలంటే ఆ ఇంట్లో చిరునవ్వులు చిందించే చిన్నారులు వుండాలి. చిన్నపిల్లలు వున్న ఇల్లు ఎంతో సందడిగా వుంటుంది. అందుకు పెద్దలు సైతం చిన్నారులను ప్రోత్సహించాలి. రెండేళ్ళు దాటిన చిన్నారులు లోకజ్ఞానం కోసం కుతూహలపడుతుంటారు. అలాంటి చిన్నారులకు పెద్దలు కాస్త ప్రోత్సాహం కల్పించాలి.
చిరునవ్వులు చిందించే చిన్నారులు ఆటలాడడానికి ఎంతో ఇష్టపడుతుంటారు. వారి వారి ఇష్టాయిష్టాలను బట్టి పెద్దలు తమ పిల్లల్ని ఇంకా ప్రోత్సహించాలి తప్ప వారిని కసురుకోరాదు. విసుగుకోరాదు. కసురుకుంటే చిన్నారులు చిన్నబోతారు. ఈ లేత వయసులో కాస్త ప్రేమ, అనురాగం పిల్లలపట్ల చూపాలి. అపుడు వారు ఆనందంగా వుంటారు. చిన్నారుల ఆనందమే వారి ఆరోగ్యానికి బలం చేకూరుతుంది. ‘నేటి బాలలే రేపటి పౌరులు’ అన్న నానుడిని అనుసరించి పిల్లల్ని చిన్ననాటినుండే భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడానికి పెద్దలు కృషిచేయాలి.
కొందరు చిన్నపిల్లలు పెన్నులు, పుస్తకాలు పట్ల ఆసక్తి చూపుతారు. మరికొందరు ఆటవస్తువులపై, ఇంకొందరు ఫొటోలపై, సెల్‌ఫోన్లపై మోజు చూపిస్తారు. చిన్నపిల్లలు కదా వారికి ఏదైనా కొత్త వస్తువు కనిపిస్తే వాటిపై ఆసక్తి చూపుతారు. పిల్లల మనస్తత్వం పెద్దలు గ్రహించాలి. చిన్నప్పుడు పిల్లలు ఏది చేసినా పెద్దలు వారిని ప్రశంసించాలి. అదే వారికి కొండంత ప్రోత్సాహం. వారికి ఏమైనా సందేహం కలిగితే తీర్చగలగాలి, సమయస్ఫూర్తితో తెలియజెప్పాలి. కొందరు పిల్లలు చదువుకోవడంపట్ల అత్యంత ఆసక్తి చూపుతారు. అలాంటి చిన్నారులకు నీతిదాయకమైన కథలు చెప్పాలి. భారత, భాగవతం, రామాయణం లాంటి పురాణ గాథలు వినిపించాలి. దీనివలన వారికి ఆధ్యాత్మికత అలవడుతుంది. వాటితోపాటు దేశభక్తి గీతాలు, వీరోచిత గాథలు, స్వాతంత్య్ర అనుభవాలు నేర్పించాలి. ఇంటిలో తల్లి దండ్రులే పిల్లలకు నిజమైన గురువులు. బడిలో చదివే పాఠాలు కంటే ఇంట్లో నేర్చుకునే విద్య వారికి సులభంగా అర్థం కాగలదు. కొందరు చిన్నారులు పాటలు, డాన్స్‌లంటే ఇష్టపడుతుంటారు. అలా వారి ఇష్టాయిష్టాలను భంగం కలిగించకుండా వారికి అధికంగా అభిలషించే కళలను నేర్పించాలి. అప్పుడు వారు ఆ రంగంలో రాణించగలుగుతారు. చిన్నారుల చిరునవ్వులే ఇంటికి సౌభాగ్యం, ఇల్లాలుకి వైభోగం. కళకళలాడే ఇల్లు పిల్లలతో సందడిగా వుంటుంది. ఆ అవకాశం పెద్దలు కల్పించాలి. ‘మొక్కై వంగనిది మానై వంగునా’ అన్న సామెతను అనుసరించి చిన్ననాటినుండే చిన్నారులను తీర్చిదిద్దగలగాలి తల్లిదండ్రులు. ఆనాడే చిన్నారులకు శుభోదయం కాగలదు.
కొందరు పిల్లలు అదేపనిగా అల్లరిచేస్తూ విసిగిస్తుంటారు. వారి అల్లరికి కారణం తెలుసుకోకుండా పిల్లల్ని తిట్టవద్దు, కొట్టవద్దు. ముద్దుగా చెబితే వింటారు. పిల్లల్ని లాలనగా, ఆలనగా చూసుకోవాలి. వారి భావితరం భవిష్యత్‌కు బంగారు బాట వేయాలి. అందుకే పెద్దలు ముందుకు రావాలి. అప్పుడే చిన్నారులకు మహోదయం.

- ఎల్. ప్రపుల్లచంద్ర 88865 74370