మెయిన్ ఫీచర్

మెత్తని మొండిఘటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎంచుకున్న రంగంలో ఎవరెస్ట్ కావాలంటే - కార్య నిర్వహణ ఒక్కటే కర్తవ్యం. స్ఫూర్తిదాయకమైన ఇలాంటి మాటలు చెప్పేవాళ్లు లెక్కలేనంత మంది. చేసి చూపించేవాళ్లు.. వేళ్లపై లెక్కపెట్టేంత మంది. అలాంటి వేళ్లలో, వాళ్లలో నీరజ.. ఓ చూపుడు వేలు. కార్యానికీ, కర్తవ్యానికీ ఏకకాలంలో గురిపెట్టగలిగే.. బొటనవేలు. అవాంతరాలకు ఎదురీది అనుకున్నది సాధించగలిగే.. పిడికిలి.
ఎవరీ నీరజ?
చెన్నైలో పుట్టిన - బాల నటి. నిర్మలగా పరిచయమైన - గొప్ప నటి. విజయనిర్మలగా ఎదిగిన - ఎవరెస్ట్ శిఖరం. అనూహ్యంగా వచ్చిన అవకాశంతో తెరకెక్కి.. అభినయ పాటవంతో కథానాయికై.. అనుభవజ్ఞానంతో దర్శకురాలైన - స్ఫూర్తిదాయక మహిళ. అన్నం ఉడికిందో లేదో చూడాలంటే మెతుకు పట్టుకుంటే చాలు. నీడెంతో తెలుసుకోవాలంటే - చెట్టు ఆకులు లెక్కపెట్టాల్సిన పని లేదు. భిన్నమైన ఈ ఈక్వేషనే్ల క్లుప్తంగా - ఆమె జీవితం.
తెలుగు, తమిళ, మలయాళంలో నటిగానూ, దర్శకురాలిగా తనదైన ముద్ర వేసిన విజయనిర్మల, వెండితెరకు పరిచయమైన తొలిరోజుల్లో అన్నీ మగవేషాలే వేశారు. తొలిచిత్రం ‘మత్స్యరేఖ’లో రాకుమారుడిగా కనిపించిన నిర్మల, తెలుగు తొలి చిత్రం ‘పాండురంగ మహత్యం’లో కృష్ణుడిగా మాయచేశారు. కృష్ణుడి వేషంలో నిర్మలను చూసి ముసిరిపోయిన మహానటుడు ఎన్టీఆర్ - జీవితంలో గొప్పస్థాయికి ఎదుగుతావు’ అని దీవించారు. మహానటుడి ఆశీర్వాద బలమెంతో తెలీదుకానీ, ఆ ఆశీర్వాదాన్ని నిజం చేసి చూపించాలన్న నిర్మల మనోబలాన్ని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేం. మహానటుడు ఎన్టీఆర్ ఆశీర్వాదాన్ని నిజం చేస్తూ - స్ఫూర్తిదాయక స్థాయికి ఎదిగింది విజయనిర్మల. ‘ఏడో ఏటనే స్క్రీన్‌మీద కనిపించే అవకాశం వచ్చింది. పి. పుల్లయ్య దర్శకుడు. రాత్రివేళల్లో షూటింగ్ జరిగేది. కెమెరా ముందు నవ్వమంటే ఏడ్చేదాన్ని. ఏడ్వమంటే నవ్వేదాన్ని. నాకిష్టమైన పూరీ పొటాటో కళ్లముందు పెట్టి - ఆ ఎక్స్‌ప్రెషన్స్‌ని సినిమాకు అనుకూలంగా తీసుకునేవారు’ అంటూ ఓ సందర్భంలో గుర్తు చేసుకున్నారు విజయనిర్మల. ఆమె గుర్తు చేసుకున్న జ్ఞాపకాన్ని తడిమి చూడక్కర్లేకుండానే ఆమె అమాయకత్వాన్ని అంచనా వేయొచ్చు. అదే విజయనిర్మల గురించి మరో సందర్భాన్ని గుర్తు చేసుకుంటే.. ఆమె ఎలా ఎక్కడికి ఎదిగిందో అర్థం చేసుకోవచ్చు. అది.. ‘అమ్మో, మొండిఘటం. పని మొదలైతే ఆమెను పట్టుకోవడం కష్టం. అనుకున్నది సాధించేవరకూ నిద్రపోదు, నిద్రపోనివ్వదు’ అంటుండేవారు గొప్ప నటుడు గుమ్మడి వెంకటేశ్వరరావు. ఆ మాటల్ని పట్టిచూస్తే.. ఆమె ఎంత మొండిఘటమో అర్థమవుతుంది. ‘ఏ విషయంలోనైనా ఆమెను ఒప్పించాలన్నా, మెప్పించాలన్నా తలప్రాణం తోకకొస్తుంది. మానసికంగా ఆమె చాలా గట్టిమనిషి’ అన్నది.. ఆమెతో పనిచేసిన పరిశ్రమలోని ప్రముఖుల మాట. ఆర్టిస్ట్‌గా ఒకలా, దర్శకురాలిగా మరోలా.. అప్పటికప్పుడే తనను తాను సిద్ధం చేసుకోగలిగే నైపుణ్యం విజయనిర్మల సొంతం అంటారు - ఆమెను దగ్గరగా చూసినోళ్లు. కథానాయికగా వైవిధ్యమైన పాత్రలు పోషించిన విజయనిర్మల - ఆమె వ్యక్తిత్వానికి తగిన సాత్విక పాత్రలు చేసింది తక్కువే కావడం మరో విశేషం. ఆమె చేసిన సినిమాల్లోని పాత్రల్ని గమనిస్తే ఎక్కువ శాతం ధిక్కారం, తెంపరితనం, మొండితనం, పట్టుసడలని పెంకితనమే కనిపిస్తుంది. వాస్తవ జీవితంలో ఆ గుణాలకు పూర్తి విరుద్ధమట - విజయ నిర్మల. తొలి పరిచయంలోనే ఎదుటి వ్యక్తిని సరిగ్గా అంచనా వేయగలిగే గొప్ప గుణం ఆమె సొంతం. పరిచయాన్ని ఎంతవరకూ విస్తరించాలి, ఏ పరిధిలో ఉంచాలో కచ్చితమైన నిర్ణయానికి రాగలగడమే - ఆమె ఎదుగుదలకు తొలి మెట్టు అయ్యింది. తెరమీద అనేక పాత్రల్లో - డామినేటింగ్ డైలాగులతో ఆకట్టుకున్న విజయనిర్మల, తెరవెనుక మాత్రం పొదుపుగా మాట్లాడుతూ కంటి చూపుతోనే తనకు కావాల్సిన పని రాబట్టేదని ఆమె దర్శకత్వంలో పనిచేసిన సీనియర్ ఆర్టిస్టులు అంటారు. ఆర్టిస్టుగా తన అభినయంతో - దర్శకుడిని మెప్పించడంలో ఎంత నేర్పు చూపించేవారో, దర్శకురాలిగా - ఆర్టిస్టునుంచి తనకు కావాల్సింది తీసుకోవడంలోనూ అంతే ఓర్పు చూపించే గుణమే ఆమె శిఖరాగ్ర స్థాయికి ఎదగడానికి కారణమైంది.
ఇక వ్యక్తిగత జీవితంలో - మమకారాన్ని చూపించటంలోనూ, స్నేహాన్ని గౌరవించటంలోనూ ఆమెనుంచి నేర్చుకోవాల్సింది చాలానే. తన మొదటి భర్త కృష్ణమూర్తినుంచి దూరమైన తరువాత - సహనటుడు కృష్ణను వివాహమాడారు విజయనిర్మల. అయితే కృష్ణ ముందు భార్య కుటుంబం పట్లా అంతే ఆదరణ చూపించటం - ఆమె వ్యక్తిత్వానికి నిదర్శనం. అక్క కూతురు జయసుధను పరిశ్రమకు పరిచయం చేసి, ఆమెకు అవకాశాలు కల్పించి - సహజనటి స్థాయికి ఎదిగే అవకాశమిచ్చారు విజయనిర్మల. అటు కుటుంబం, ఇటు పిల్లల బాధ్యతలను మోస్తూనే - వ్యక్తిగత జీవితాన్ని స్ఫూర్తిదాయక స్థాయికి తీసుకెళ్లిన విజయనిర్మలకు దక్కిన అవార్డులు, గిన్నిస్‌లో స్థానాలు చాలా చిన్నవనే అనిపిస్తుంది. కదూ!