మెయిన్ ఫీచర్

అదృశ్యానికి దృశ్యరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్ష్యసాధనకు ఏకైకమార్గం.. ఎంచుకున్న దారిలో ఎదురైన అడ్డంకుల్ని దాటుకుంటూ ముక్కుసూటిగా వెళ్లడమే.. అదేచేసింది అమెరికాకు చెందిన కంప్యూటర్ సైంటిస్ట్ క్యాటీ బౌమన్. కృష్ణబిలం గురించి మనం చిన్నప్పటి నుంచీ వింటున్నదే.. చదువుకున్నదే.. అయితే ఇవి ఎలా ఉంటాయో మాత్రం మనకే కాదు.. దీని గురంచి అధ్యయనం చేసే శాస్తవ్రేత్తలకు కూడా తెలియదు. అలాంటి చీకటి నక్షత్రం ఫొటో ఒకటి నేడు అంతర్జాలంలో వైరల్‌గా మారింది. భూమికి దాదాపు 5.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఎం87 గెలాక్సీలో ఈ కృష్ణబిలం ఉంది. దీని వ్యాసం పొడవు నాలుగు వేల కోట్ల కిలోమీటర్లు. అంటే పరిమాణంలో భూమి కన్నా ఇది 33 లక్షల రెట్లు పెద్దది. దీన్ని ఫొటోలో బంధించిడం మాట్లాడినంత సులువు కాదు. కానీ అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి అదృశ్యానికి దృశ్యరూపం ఇవ్వడంలో అమెరికన్ కంప్యూటర్ శాస్తవ్రేత్త క్యాటీ బౌమన్ కృషి అనిర్వచనీయం అని చెప్పుకోవాలి. మునుపు కృష్ణబిలాలను ఊహాచిత్రాలు, సిమ్యులేషన్ చిత్రాల్లోనే జనం చూశారు. అంతమవుతోన్న తారలు కృష్ణబిలాలుగా మారుతాయి. అత్యంత బలమైన గురుత్వాకర్షణ శక్తితో సమీపంలోని ప్రతిదాన్నీ ఇవి లోనికి లాగేసుకుంటాయి. కాంతి సహా ఏ పదార్థామూ దాని ఆకర్షణ పరిధి నుంచి తప్పించుకోలేదు. అలాంటి కృష్ణబిలం ఫొటోను క్లిక్ మనిపించడంలో ఆమె చేసిన కృషి చాలావుంది. అందుకే ఈమె పేరు నెట్టింట్లో మారుమోగిపోతోంది. వివరాల్లోకి వెళితే..
ఆకాశంలో చుక్కలెన్ని ఉన్నా, చంద్రుడి స్థానాన్ని భర్తీ చేయలేదు. అటువంటిదే మహిళా శాస్తవ్రేత్తల ప్రతిభ కూడా. చంద్రుడిపై అడుగు పెట్టిన పురుష శాస్తవ్రేత్తల గురించి ఘనంగా చెప్పుకుంటాం. కానీ అందుకు కారణమైన అపోలో స్పేస్ ప్రోగ్రామ్‌కి దిశానిర్దేశం చేసింది మార్గరెట్ హామెల్టన్ అనే మహిళ అని చాలామందికి తెలియదు. అసలు సాఫ్ట్‌వేర్ పదాన్ని తీసుకొచ్చిందే ఆవిడ. తర్వాతికాలంలో కొంతమంది మహిళా శాస్తవ్రేత్తలు ఆమె పరంపరని కొనసాగించినా తగిన ప్రాచుర్యం లభించలేదు. ఈ క్రమంలోనే ఆమె స్థానాన్ని భర్తీ చేసేందుకు తాజాగా దూసుకొచ్చిన యువకెరటమే 29 సంవత్సరాల క్యాటీ బౌమన్. శతాబ్దాలుగా కృష్ణబిలం గురించి వినడమే కానీ కళ్లారా చూడని మానవాళికి అదెలా ఉంటుందో కళ్లకు కట్టినట్లుగా చూపించడంలో క్యాటీ పాత్ర కీలకం. శతాబ్దాలుగా కృష్ణబిలాన్ని టెలిస్కోప్‌లో బంధించడానికి ఎందరో శాస్తవ్రేత్తలు విశ్వ ప్రయత్నాలు చేశారు. చేస్తున్నారు కూడా. అయితే తాజాగా 200 మంది శాస్తవ్రేత్తలతో కూడిన బృందం ఎం87 గెలాక్సీలోని కృష్ణబిలాన్ని ఫొటోను తీసేందుకు ప్రపంచవ్యాప్తంగా భూమి చుట్టూ వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎనిమిది టెలిస్కోప్‌లను అనుసంధానించి ‘ఈవెంట్ హొరైజాన్ (ఈహెచ్‌టీ) అనే భారీ టెలిస్కోప్‌ను రూపొందించడం ద్వారా శాస్తవ్రేత్తలు ఈ ఫొటోను తీయగలిగారు. ఇందుకోసం కేటీ బౌమన్ నేతృత్వంలోని బృందం ప్రత్యేక అల్గారిథమ్‌ను రూపొందించింది. ఇలా తెర వెనుక ఆమె చేసిన కృషికి ఫలితంగా కృష్ణబిలం ఫొటోను శాస్తవ్రేత్తలు విడుదల చేశాయి. దాంతో ఆ తేదీతో పాటు క్యాటీ పేరు ఇంటర్నెట్‌లో మార్మోగిపోతోంది. చరిత్రపుటల్లో నిలిచిపోయింది. క్యాటీ పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే తండ్రి అధ్యాపకుడిగా పనిచేసిన పుర్డ్యూ యూనివర్శిటీలో ఇమేజింగ్ రీసెర్చ్ చేసింది. ప్రస్తుతం కృష్ణబిలం ప్రతిబింబానికి కారణమైన ‘ఈవెంట్ హారిజాక్ టెలిస్కోప్’ గురించి 2007 నుంచే అధ్యయనం చేయడం మొదలుపెట్టింది క్యాటీ. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ కంప్యూటర్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది. తర్వాత హార్వర్డ్ యూనివర్శిటీలో పోస్ట్ డాక్టీరల్ ఫెలోగా ‘ఈవెంట్ హారిజాన్ టెలిస్కోప్ ఇమేజింగ్ టీమ్’లో చేరింది. మరో ముగ్గురు శాస్తవ్రేత్తలతో కలిసి ఆ బృందానికి టీమ్ లీడర్‌గా వ్యవహరించడంతో పాటు కృష్ణబిలం ఫొటోను బంధించడానికి అల్గారిధమ్‌ను రూపొందించడంలో కీలక కృషి చేసింది క్యాటీ. 2018 సెప్టెంబర్ రెండున మిచిగాన్‌లో జోయ్‌లియోంగ్ అనే వ్యక్తిని వివాహమాడింది ఈ యంగ్‌సైంటిస్ట్.
కృష్ణబిలం ఫొటోను తన ల్యాపీలో చూసుకుని ఒకింత ఆశ్చర్యానికి గురవుతోన్న పిక్చర్‌ను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఆమె. ‘ఇప్పటివరకూ సాధ్యం కానీ కృష్ణబిలం ఫొటో ఇప్పుడు ఆవిష్కృతమైంది. దీన్ని చూస్తుంటే ఇది కలా? నిజమా? అనిపిస్తోంది’ అంటూ తన ఆనందాన్ని పంచుకుంది క్యాటీ. ‘ఇప్పుడు కృష్ణబిలం ఫొటోలు మనం చూడగలుగుతున్నాం. కానీ భవిష్యత్తులో దానికి సంబంధించిన వీడియోలు కూడా తీసే ప్రయత్నాల్లో శాస్తవ్రేత్తలు బృందం ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది. ‘వివిధ పద్ధతులు ద్వారా సేకరించిన చిత్రాల సమాహారమే ఈ ఫొటో.. ఈ చిత్రం వెనుక కేవలం ఒక అల్గారిధమో, ఓ వ్యక్తో లేరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన శాస్తవ్రేత్తల బృందం, వారి ఎన్నో ఏళ్ల నిరంతర కృషి, డాటా ప్రాసెసింగ్ ఇమేజింగ్ మెథడ్స్, విశే్లషణాత్మక పద్ధతులు వంటివన్నీ ఇప్పటికీ అసాధ్యం కాని దాన్ని సుసాధ్యం చేసి చూపించడంలో కీలకపాత్ర పోషించాయి. ఈ బృందంలో నేను కూడా ఒక భాగమైనందుకు చాలా గర్వంగా, గౌరవంగా ఫీలవుతున్నా. ఇది నా అదృష్టం’ అంటూ పోస్ట్ పెట్టింది క్యాటీ. కృష్ణబిలాన్ని ఫొటోలో బంధించడానికి అల్గారిథమ్ టీమ్ లీడర్‌గా ఒకవైపు ఆమెను ప్రపంచమంతా కొనియాడుతుంటే.. తనేమో ఈ బృందంలో తను ఒక చిన్నభాగం మాత్రమే అంటూ తనలోని నిరాడంబరతను చాటుకుంటోంది క్యాటీ.
శాస్తవ్రేత్తలు కృష్ణబిలం ఫొటోను విడుదల చేసిన మరుక్షణం నుంచి ఇంటర్నెట్‌లో ప్రపంచవ్యాప్తంగా క్యాటీపై ప్రశంసన వర్షం కురుస్తోంది. ఇందుకు సంబంధించిన అల్గారిధమ్‌ను రూపొందించడంలో విశేషకృషి చేసిన ఆమెను ఎం ఐటీ కంప్యూటర్ శాస్తవ్రేత్త అయిన మార్గరెట్ హామిల్టన్‌తో పోల్చడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. చంద్రుడిపై మానవుడు కాలుమోపేందుకు సహాయపడే కోడ్‌ను రూపొందించారు మార్గరెట్. ఇక ఇప్పుడు కృష్ణబిలం ఫొటోను క్లిక్‌మనిపించడానికి అల్గారిధమ్‌ను రాసింది క్యాటీ. అందుకే ఇద్దరూ అల్గారిధమ్‌ను రాయడానికి ఉపయోగించిన యంత్రాల్లో ఉన్న ఫొటోల్ని జతచేసి ‘ఎం ఐటీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్ లాబొరేటరీ’ ట్విట్టర్‌లో పోస్ట్‌చేసి క్యాటీని గౌరవించింది. ఏదేమైనా క్యాటీ ప్రతిభ అనితర సాధ్యమైంది కాబట్టే ఐక్యరాజ్యసమితి కూడా ఆమెకు అభినందనలు తెలిపింది. అంతేకాకుండా విజ్ఞానశాస్త్రం మరింత పురోగతి సాధించడానికి ఆమెలాంటి మహిళలు ఇంకా రావాలని కాంక్షిస్తోంది క్యాటీ.