మెయిన్ ఫీచర్

సంతోషంతో నిండు నూరేళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ వ్యాప్తంగా రానే వచ్చింది మార్చి 20. అంతర్జాతీయ సంతోష దినోత్సవం మోసుకొచ్చే ఉత్సాహం.. ఉల్లాసం. ఈ ఉత్సాహం రోజులు గడిచేకొద్దీ కరిగిపోకుండా ఉండేందుకు, ఈ సంతోషం కాలంతోపాటే కరిగిపోకుండా ఉండేందుకు, జీవితాంతం ఇంతే ఆనందంగా ఉంటే ఎంతో బాగుంటుంది కదా! కచ్చితంగా ఉంచుకోవచ్చు. మన సంతోషం పూర్తిగా మన చేతుల్లోనే వుంటుంది. సంతోషమే సంపూర్ణబలం అనే నానుడి మనకందరికి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులను ప్రపంచంలోని ప్రజలను పరిశీలించి చూసినట్లయితే సంతోషంగా ఉన్నవాళ్లే సంపూర్ణ జీవితాన్ని అనుభవించగలుగుతున్నారు. ఉదయం లేచినప్పటినుండి పడుకునేంత వరకు, పలకరింపు నుంచి మొదలుకొని వీడ్కోలు చెప్పేంత వరకూ.. ప్రతిదీ మన సంతోషానికే. ఈ రోజునుండే మన జీవితాలను మరింత సంతోషభరితం చేసుకుందాం.
సంతోషమే సంపూర్ణ బలం...
ఒకప్పటి మన తాతలు, అమ్మలు సంతోషమే సగం బలం అనేవారు కానీ ప్రస్తుతం సాంకేతికంగా అభివృద్ధి చెందుతూ ఆధునిక యుగంలో కాలంతోపాటు పడుతూ లేస్తూ ఉరుకుల పరుగుల జీవితాన్ని అనుభవిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సంతోషం అనేది కరువైపోయిందా అని అనిపిస్తుంది. అందుకేనేమో ప్రస్తుత పరిస్థితుల్లో సంతోషమే సంపూర్ణ బలం.
సంతోషంతో హాయగా...
జీవితం అత్యంత ముఖ్యమైనది. సంతోషంతోటే నిండు నూరేళ్ళు. రోజులో ఉదయానే్న నిద్ర లేచిన మొదలు ఆ రోజుకు ఏదో ఒక అర్థం, సార్థకత, ప్రత్యేకత ఉండాల్సిందే. ఈరోజు నేను ఎలా గడిపాను అని విశే్లషణ చేసుకుంటూ ఉండాలి. సంతోషంగా గడపడానికి ప్రతిరోజులో కొంత సమయాన్ని ఖచ్చితంగా కేటాయించుకోవాలి. ఈ సంతోష సమయం మిగిలిన సమయాన్ని కూడా సంతోషంగా జీవించడానికి దోహదం చేస్తుంది. ప్రతి పనిని అంకితభావంతో పనిచేయాలి. ప్రతిఫలం సానుకూలంగా వున్నా, ఉండకపోయినా మన శక్తి సామర్థ్యాల మేరకు ఇష్టంగా పనిచేయాలి. ఉదయం లేచినప్పటినుండి పడుకునేంతవరకు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటాం. ఆ పని మంచిగా జరిగి ఫలితం బాగుంటే సంతోషమే కదా. సంతోషంగా ఉంటే నిండు నూరేళ్లు జీవించే అవకాశం ఎక్కువ. నలుగురితో కలిసిమెలిసి జీవించినంత మాత్రాన ఆయుష్షు పెరుగుతుందా? నిండు నూరేళ్లు బ్రతుకుతామని నమ్మేవారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ప్రతిరోజు ఒత్తిడితో జీవితం గడుపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. నిండు నూరేళ్లు జీవిస్తున్నవారిలో వున్న శక్తి ఏమిటి? మనకి కూడా నిండు నూరేళ్ల జీవితం సాధ్యమవుంతుందా? ఎంతోమందికి సాధ్యమైంది మనకెందుకు కాదు? నలుగురితో కలిసిమెలిసి జీవించినంత మాత్రాన ఆయుష్షు పెరుగుతుందా? అవును.. సాధ్యమే అని సర్వేలు చెబుతున్నాయి. చుట్టూ వుండే సమాజంతో మమేకమవుతూ, నలుగురితో కలిసిమెలిసి జీవించడం ద్వారా మన ఆయుర్దాయాన్ని కొనే్నళ్లపాటు పొడిగించుకోవచ్చు. కుటుంబ సభ్యులు, మిత్రులు, ఇరుగుపొరుగువారితో కలిసిపోవడం, మనకు తెలియకుండానే మనలో భద్రతాభావం, మానసిక సంతృప్తి ఏర్పడటం జరుగుతుంది. ఒంటరిగా కాలం వెళ్లదీసేవారి కంటే, నలుగురితో కలివిడిగా మాట్లాడుతూ కలిసి జీవించేవారి యొక్క ఆయుర్దాయమే ఎక్కువ. మనం చేసే పని, మనం తినే ఆహారం, ఉపయోగించే వస్తువులతోపాటూ, తమ అలవాట్లపట్లా చాలా సంతృప్తితో వున్నవారి యొక్క ఆయుష్షు ఎక్కువగానే ఉంటోంది. ప్రతి విషయంలో ఒత్తిడి కలగడానికి ప్రధాన కారణం ఆ పనిలో సంతృప్తి కలగకపోవడమే. తృప్తి భావనతో ఉండటంవల్ల మానసిక ఒత్తిళ్లు చాలావరకు దూరమైపోతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వాటంతట అవే సర్దుకుపోతాయి.
రొటీన్‌కు భిన్నం
ప్రతిరోజు ఒకే టైం టేబుల్- అయ్యో.. ఇంతేనా జీవితమంటే అనిపిస్తూ వుంటుంది. జీవితం అంటే విసుగు వస్తోంది. జీవితం ఎప్పుడూ ఆసక్తిగా, ఉత్సాహంగా ఉండాలంటే.. రొటీన్‌కు భిన్నంగా ఆలోచనలు మొదలుకావాల్సిందే. వారాంతపు సెలవులలో యాత్రలు, సముద్రయానాలు, కొత్త కొత్త ప్రదేశాలను చూసిరావడం, కొత్త కొత్త అభిరుచుల్లో మునిగితేలడం లాంటివి చేస్తుండాలి. చిత్రలేఖనం, సంగీతంవంటి వాటితోకూడా సంతోషమయమైన జీవితాన్ని పొందవచ్చు. నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అన్న నానుడి తెలిసిందే. మనస్ఫూర్తిగా నవ్వుకోవడంవల్ల శరీరం అంతా యాక్టివ్‌గా మారుతుంది. మనస్ఫూర్తిగా నవ్వితే చాలు ఒత్తిళ్లన్నీ పటాపంచలవుతాయి.
ఇవ్వడంలోనే ఆనందం..
సుఖదుఃఖాలు నాణేనికి బొమ్మ బొరుసు లాంటివి. సానుకూల దృక్పథంతో ఉండాలి. కష్టాలు వచ్చినపుడు ఏడుస్తూ కూర్చుంటే సమయం వృధా అవుతుందే తప్ప ప్రయోజనం ఉండదు. సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. ప్రతి అంశాన్ని గుర్తుంచుకొని వాటిని ఉపయోగించుకునే విధానాన్ని అలవాటుచేసుకోవాలి. సృష్టిలో పనికిరానిదంటూ ఏదీ ఉండదు. మనం చూసే విధానంలోనే తేడా వుంటుంది. ఎవరి సామర్థ్యంపై వారికి నమ్మకం ఉండాలి. ఇతరులపై ఆధారపడే విధానానికి స్వస్తి పలకాలి. తాము సంతోషంగా ఉండటమే కాకుండా చుట్టూ వున్నవారినీ ఆనందంగా ఉంచాలి. తీసుకోవడం కంటే ఇవ్వడంలోనే ఆనందం ఉంటుంది. అందుకే కానుకలు, అభినందనలు, ఆశ్చర్యకర సందేశాలద్వారా ఇతరులను సంతోషపెట్టేందుకు ప్రయత్నించాలి. అలాగే అవసరంలో వున్నవారికి సాయపడాలి. వారికి అవసరమైనపుడు ఆహారం లేదా నగదు ఇస్తే ప్రపంచంలో అంతకంటే ఆనందం మరొకటి వుండదు.
సంతోషమే జీవితంగా మారాలంటే..
ప్రతిరోజు యాక్టివ్‌గా ఉండాలి. ఉరుకుల పరుగులు తగ్గించుకోవాలి. ప్రతి నిమిషాన్నీ సావధానంగా గడపడానికి ప్రయత్నించాలి. ఏదైనా తినేటప్పుడు 20 శాతం కడుపులో వెలితిగా ఉంచాలి. కడుపులో 80 శాతం నిండేవరకు మాత్రమే తినాలి. ఖాళీ సమయాన్ని మంచి మిత్రుల మధ్యలో గడపాలి. ప్రతిరోజూ 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఇతరులపట్ల నవ్వుతూ, సద్భావంతో ఉండాలి. ఏసి గదులలో కంటే నేచురల్‌గా ఉండే ప్రదేశంలో సమయాన్ని గడపాలి. మనం ఇతరులనుండి పొందే ప్రతి సాయానికి వారికి థాంక్స్ చెప్పాలి. భూత, భవిష్యత్తులో కంటే వర్తమానంలో ఈ క్షణంలో జీవించడమెలా ఆలోచించాలి. సానుకూల ఆలోచనలతో సంతోషం. మన దగ్గరున్న దానితోనే సంతృప్తి చెందాలి. అందని దాని గురించి ఆలోచించడంవల్ల భంగపాటు తప్పదు. ఇతరులతో సత్సంబంధాలను కలిగి ఉండాలి. ప్రతి విషయాన్ని సీరియస్‌గా తీసుకోకూడదు. బాధపడకూడదు. నేటినుండే సరికొత్త సంతోషానికి స్వాగతం చెప్పండి.

-డా అట్ల శ్రీనివాస్‌రెడ్డి 97039 35321