మెయిన్ ఫీచర్

ఇంకా వివక్షేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలం మారుతున్నది. ప్రపంచం కుగ్రామంలా మారింది. మానవుడు రాతియుగం, మంత్రయుగం దశలు దాటి యంత్రయుగంలోకి ప్రవేశించి నేడు రాకెట్ యుగంవైపు దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో మానవజాతిలో ఒక భాగం అయిన మహిళలు అన్ని రంగాలలో ఆనాటి నుంచి ఈనాటి వరకు రాణిస్తున్నప్పటికీ.. కేవలం లింగ వివక్ష కారణంగా ద్వితీయ శ్రేణి పౌరులుగా భావిస్తూ చిన్నచూపుతో అణచివేయబడుతూ వున్నారు. అడుగడుగునా దురాగతాలు, మానభంగాలు జరుగుతూనే వున్నాయి. అన్ని రంగాలలోనే కాక బాధ్యతాయుత చట్టసభలలో సైతం మహిళలు పురుషులకన్నా మిన్నగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ కూలీలుగా, అటు పట్టణాలలో ఇటు పల్లెలలో వంటింటి కుందేళ్లుగా అణిగిమణిగి జీవితాలను సాగించిన మహిళామణులు నేడు బస్సులలో డ్రైవర్లుగా, రైలు ఇంజన్ల డ్రైవర్లుగా, విమానాలలో పైలెట్లుగానే కాకుండా కల్పనా చావ్లాలాగా అంతరిక్షంలోకి రాకెట్ ద్వారా దూసుకుపోతున్నారు. ఐఎఎస్, ఐపిఎస్ అధికారులుగా, న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా సైతం తమ సమర్థతను ఎంతగానో నిరూపించుకుంటున్నారు. ఈ విధంగా అన్ని విధాలుగా పురుషులతో సమానంగా తమ విధులు, బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ నేటి 21వ శతాబ్దంలో కూడా ప్రపంచ వ్యాప్తంగా మహిళలను రెండో కోణం చూపుతోనే చూస్తుండడం చాలా బాధాకరం. అమెరికాలో ట్రంప్‌మీద హిల్లరీ క్లింటన్ ఓడిపోవడానికి, త్రిపురలో ఇరోమ్ శర్మిల రాజకీయంగా తెరమరుగు కావడానికి పురుషాధిక్య ఆధిపత్యం, మహిళలు అనే చిన్నచూపు వంటి అంశాలే ప్రధాన కారణాలని విశే్లషకులు పేర్కొంటున్నారు. హిందూమత గ్రంథాలలోనే కాక ఇతర మత గ్రంథాలలో కూడా మహిళలను చిన్నచూపు చూసేటటువంటి అంశాలు పొందుపరిచారని విమర్శలు వున్నాయి. కొన్ని సామాజిక వర్గాలలో మహిళల ముఖం చూపకుండా పరదాలు కట్టేస్తున్న సంస్కృతి యధేచ్చగా కొనసాగుతూనే వున్నది. ఆప్ఘనిస్తాన్‌లోనైతే.. మహిళలు సినిమాలు చూడకూడదని నిషేధం వుంది. ఇలాగే భారతదేశంలో మరో సామాజిక వర్గ మహిళలను దృష్టిలో పెట్టుకుని ట్రిపుల్ తలాక్ వ్యవస్థను ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం రద్దుచేయగా.. ఇందుకు కొన్ని రాజకీయ పక్షాలు రాజకీయ లబ్ధితో విమర్శించడం చాలా బాధాకరం.
పురాణాలలో కుటుంబ వ్యవస్థ ఔన్నత్యం పెంచడానికి, తన భర్త శ్రీరాముని ఆశయ సాధనలో భాగంగా రాజ్యశ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నిండు గర్భిణీగా వున్న సీత అడవికి వెళ్లడాన్ని కొంతమంది సమర్థిస్తున్నప్పటికీ.. పర్ణశాలలో ఆమె సాదాసీదా జీవితం అనుభవించి లోలోపల ఎంతో హృదయ సంఘర్షణకు గురై నానా యాతన అనుభవించిన విషయం గురించి చెప్పడంలేదు. నిండు సభలో పురుష కండకావరంతో అవమానించిన కౌరవుల వికృత చేష్టలను ద్రౌపది ఎలా అవమానంతో భరించిందో వేరే చెప్పవలసిన పనిలేదు. ఇదే తరహాలో రెండు దశాబ్దాల క్రిందట తమిళనాడు అసెంబ్లీలో మహిళ అనే చిన్నచూపుతోనే నాటి ప్రతిపక్ష నాయకురాలిగా కొనసాగిన జయలలితమీద ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలు దాడిచేశారు. ఇదేవిధంగా నాడు చరిత్రలో కొన్ని రాజరికపు తెగలనందు భర్త చనిపోతే.. అతనితోపాటు భార్య కూడా చనిపోవాలనే సిద్ధాంతంతో సతీసహగమనం వ్యవస్థ అమలుచేసేవారు. ఈ సతీసహగమన నెపంతో ఈ మధ్య 20 సంవత్సరాల కిందట రాజస్థాన్‌లో రూప్‌కన్వర్ అనే మహిళను బలవంతంగా చంపివేశారు. అలాగే.. పంజాబ్‌లో టెర్రరిజాన్ని అణచివేసిన రాష్ట్ర డిజిపి ఒకరు ఆ మధ్య ఒక విజయోత్సవ కార్యక్రమం విందుకు విచ్చేసిన ఒక మహిళా ఐఎఎస్ అధికారి పిరుదులమీద చేయి తట్టి వికృతానందం పొందారు. ఈ విషయంమీద ఆ ఐఎఎస్ అధికారి భారత ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా ఆ పోలీసు అధికారి సమర్థవంతంగా టెర్రరిజాన్ని అణచివేసినందున దేశ శ్రేయస్సు దృష్ట్యా ఈ విషయంమీద రాజీపడాలని ఉన్నతాధికారులు సర్ది చెప్పారు. ఈ విషయంలో ఆ మహిళా ఐఎఎస్ అధికారి ఎంత మానసిక క్షోభకు గురి అయి వుంటుందో వేరే చెప్పవలసిన పనిలేదు. ఇస్లాంలో, ఖురాన్‌లో మహిళల గురించి ప్రత్యేక అంశాలు వున్నాయని, అవి ఆ వర్గ మహిళలను రెండో శ్రేణి పౌరులుగా చూసేవిధంగా అమలవుతున్నాయని కొంతమంది అబద్ధాలు చెబుతున్నారు. ఇవి కట్టుకథలేనని అప్పట్లోనే చరిత్రలో సుల్తానా రజియా రాజ్యాధికారం చేపట్టి మేటి రాణిగా.. రియల్ లీడర్‌గా రాణించిన విషయం తెలిసిందే. ఇదే సామాజిక వర్గంనందలి పాకిస్తాన్ రాజకీయాలలో బెనజీర్ భుట్టో ఎంతో సమర్థవంతంగా రాణించినప్పటికీ చివరికి ఉగ్రవాదుల తూటాలకు నేలకొరిగారు. అనేక సంవత్సరాలనుంచి బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ఎంతో సమర్థవంతమైన ప్రధానిగా పాలన అందించారు. ఈ కోణంలో నేటి రోజుల్లో కూడా అటు ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలలో ఇంకా ఇరుగు పొరుగు సమాజంనందు మహిళలమీద వివక్ష మాని, మహిళలు సృష్ట్ధిర్మానికి ప్రతీకలు అయినందున వీరిని ప్రత్యేక గౌరవభావంతో, సమభావంతో అభిమానించే విధంగా మన సమాజం ఎదగాలని నేటి అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా కోరుకోవడమైనది. అలాగే ట్రిపుల్ తలాక్ వ్యవస్థ రద్దు కేవలం ఆర్డినెన్స్ రూపంలోనే వున్నందున దీనికి రాజ్యాంగ సవరణ ద్వారా శాశ్వత చట్ట్భద్రత రావాలని.. మహిళలకు చట్టసభలో రిజర్వేషన్ బిల్లు రాబోయే కొత్త ప్రభుత్వంలోనైనా రూపుదిద్దుకోవాలని కోరుకోవడమైనది.

-తిప్పినేని రామదాసప్పనాయుడు 99898 18212