మెయిన్ ఫీచర్

చక్కటి ఆహారంతో కమ్మటి నిద్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరుకులు పరుగుల జీవనయానంలో కమ్మటి నిద్ర పోయి ఎన్ని రోజులైందో అని చాలామంది బాధపడుతుంటారు. నిజమే ఉదయం హడావుడిగా బయలుదేరి రాత్రికి ఏ వేళకో గూటికి చేరుకునే ఉద్యోగస్తులు కడుపు నింపుకోవటానికి ఏదో ఒకటి తిన్నామని అనిపించి బెడ్ ఎక్కేస్తే వచ్చేది నిద్ర కాదు మగత నిద్ర అంటున్నారు వైద్య నిపుణులు. హాయిగా నిద్రపోవటానికి మానసిక ప్రశాంతతో పాటు మనం తినే ఆహారంలో కొద్దిపాటి మార్పులు చేసుకుంటే కమ్మటి నిద్ర పడుతుందని చెబుతున్నారు. అవేమిటో చూద్దాం.
**
మంచి నిద్రకు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు

సొయాబీన్స్, గుమ్మడికాయ విత్తనాలు
రాత్రివేళలో మీరు తీసుకునే ఆహారంలో సొయాబీన్స్ గుమ్మడి విత్తనాలు ఉండేలా తీసుకుంటే మంచిది. వీటిలో ఎక్కువ శాతం ట్రిప్ట్ఫొన్ ఉంది. వీటిని రాత్రివేళలో తీసుకోవటం వల్ల మంచి నిద్ర పడుతోందని పలు పరిశోధనలలోనూ వెల్లడైంది.
చెర్రీస్
చెర్రీ పండ్లు తినటం వల్ల మెలటోనిన్ అనే హార్మోన్ సక్రమంగా పనిచేయటానికి దోహదం చేస్తోంది. ఈ హార్మోన్ నిద్రపై ప్రభావం చూపుతుందని జర్మల్ ఆఫ్ ఎక్స్‌పర్మెంటల్ అనే మ్యాగ్‌జైన్‌లో సైతం ప్రచురించటం జరిగింది. 2014లో జరిగిన కొత్త అధ్యయనం సైతం ఇదే విషయాన్ని నిర్ధారించింది. కాస్తంత వయసు మళ్లినవారు నిద్రలేమితో బాధపడుతుంటారు. వీరు ప్రతిరోజూ రెండుసార్లు చెర్రీ జ్యూస్ తాగితే ఈ జబ్బు నుంచి బయటపడటమే కాదు. ప్రశాంతంగా నిద్రించగలుగుతారు.
అరటిపండ్లు
అరిటిపండ్లలో మాగ్నీసియం, పోటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాలు రిలాక్స్‌గా ఉండేలా ఈ విటమిన్లు పనిచేస్తాయి. దీంతోపాటు ట్రిప్ట్ఫొన్ అనేది కూడా ఈ అరిటిపండులో ఉంటుంది. దీంతో చక్కగా నిద్రపోగలుగుతారు.
ఓట్స్
రాత్రివేళల్లో ఓట్స్ తినటం ఆరోగ్యానికే కాదు మంచి నిద్రకు ఉపయోగపడుతోంది. కాల్షియం, మాగ్నిషియం, ప్రాస్పరస్, సిలికాన్, పొటాసియం ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి నిద్ర పోవటానికి దోహదం చేస్తాయి. ఓట్స్‌కు పంచదార ఎక్కువ కలపకుండా తినాలి.
గ్రీన్ టీ
రాత్రిపూట గ్రీన్ టీ తీసుకుంటే కమ్మటి నిద్ర పడుతోందట. అయితే ఈ టీలో కెఫిన్ ఉండకుండా చూసుకోవాలి.

ఇవి తింటే నిద్ర దూరం..

కారం, మసాలా కూరలు
రాత్రి వేళల్లో మనం తినే కూరలలో స్పైసీ ఫుడ్ లేకుండా చూసుకోండి. ఆహారంలో ఘాటైన పదార్థాలు తినటం వల్ల రాత్రంతా నిద్రపట్టక బాధపడతారని ఇటీవల ఆస్ట్రేలియాలో నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. యువకులంతా ఘాటైన పదార్థాలు తిని కమ్మగా నిద్రపోవచ్చనే భ్రమలో ఉంటారు. కాని ఆస్ట్రేలియాలో వీరిపై జరిపిన అధ్యయనాల్లో సరిగా నిద్రపట్టక బాధపడినట్లు గుర్తించారు. కారం, ఘాటైన మసాలాలు లేని పదార్థాలు తినని యువకులు కమ్మగా నిద్రపోయినట్లు గుర్తించారు.
కెఫిన్
రాత్రిపూట కెఫిన్‌లాంటి పదార్థాలు ఉన్న పానియాలు తీసుకోవటం మంచిదికాదు. శక్తినిస్తాయని చెప్పే కొన్నిరకాల పానియాలను కూడా తీసుకోకపోవటమే మంచిది. కెఫిన్‌లాంటి పదార్థాలు కండరాల మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. కాఫీ, టీ, శీతల పానియాలు, తదితర వాటిల్లో చాక్లోట్ అధికంగా ఉంటుంది. కారం, మసాలాలు అధికంగా ఉన్న బిర్యానీ కడుపునిండా తిని, కాసేపాగిన తరువాత ఓ కోక్ తాగితే హాయిగా నిద్రపోవచ్చనుకుంటారు నేటి యువతరం. కాని మగత నిద్రే పడుతుందని ప్రశాంతమైన నిద్రకు దూరమవుతున్నామని గ్రహించటం లేదు.
కొవ్వు పదార్థాలు
బర్గర్ తింటే కడుపు నిండిపోతుంది. దీంతో హాయిగా నిద్రపోవచ్చనుకుంటారు. తిని బెడ్ ఎక్కగానే మగత ప్రారంభమవుతుందే తప్ప కమ్మటి నిద్ర కరువవుతోంది. కొవ్వు అధికంగా ఉండే భోజనం రాత్రివేళ తీసుకుంటే యాసిడ్ ఫామ్ అవ్వటం మినహాయించి నిద్ర మాత్రం పట్టదని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఆల్కాహాల్
రాత్రిపూట ఒక గ్లాసు లేదా రెండు ఔన్సుల వైన్ తీసుకుంటే కమ్మటి నిద్రపోవచ్చని అనుకుంటారు. కాని అది కూడా మగత నిద్రే. ఇది హాయిగా నిద్రపోవటానికి ఏమాత్రం ఉపకరించదని కేంబ్రిడ్జ్‌కి చెందిన స్లీప్ సెంటర్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ స్నీర్సన్ వెల్లడిస్తున్నారు.