మెయిన్ ఫీచర్

పిల్లలు ఏ వయసులో ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లల్లో గ్రాహ్యశక్తి అధికంగా వుంటుందని, వారిలో పెరుగుదల కూడా ఎక్కువగా వుంటుందనే విషయాన్ని మనం తరచూ వింటుంటాం. ముఖ్యంగా మొదటి పనె్నండు మాసాల్లో ఇవి మరింత అధికంగా వుంటాయి. పిల్లలకు మొదటి సంవత్సరం మాత్రమే కాకుండా తరువాత నాలుగు సంవత్సరాలు కూడా అత్యంత ముఖ్యమైనవే. ఈ నాలుగేళ్ళకాలంలో పిల్లల అభివృద్ధి ఆశ్చర్యం కలిగించే రీతిలో వుంటుంది. ముఖ్యంగా మానసికంగా వారెంతో అభివృద్ధి చెందుతారు. ఐదేళ్ల వయసు వచ్చేసరికి పిల్లల మెదడు ఒక వయోజనుని మెదడు బరువులో 90 శాతం స్థాయికి చేరుకుంటుంది. ఐదేళ్ళ వయసు పిల్లల్లో అధికులు దాదాపు 1500 నుండి 2000 వరకు పదాలను అర్థంచేసుకుని ఉపయోగించగలుగుతారు. వారు తమ పూర్తి పేరు, పుట్టిన తేదీ, వయసును తమ చిరునామాను స్పష్టంగా చెప్పగలుగుతారు.
ఎదుటివారి చర్యలు, మాటలను అర్థం చేసుకునే స్థాయికి చేరుకున్నప్పటినుండి పిల్లల్లో మానసిక వికాసం అభివృద్ధి చెందడం ప్రారంభమవుతుంది. ఇలా మానసికంగా అభివృద్ధి చెందే ప్రక్రియ జీవితాంతం కొనసాగుతుంది. అనేకరకమైన ఆలోచనలు చేయాల్సి వుంటుంది. అందులో కొన్ని సంక్లిష్టమైనవి, కొన్ని తేలికపాటివి వుంటాయి. పిల్లల అభివృద్ధిలో వారు తీసుకునే ఆహారం ఎంతో కీలకపాత్ర పోషిస్తుంది. వారికి పౌష్టికాహారం ఎంతో అవసరం. ముఖ్యంగా ఏడాదిన్నర వయసు వరకు వారు తీసుకునే ఆహారం వారి భవిష్యత్ జీవితాన్ని నిర్థారిస్తుందని చెప్పవచ్చు. ఈ వయసులో వారికి తగినంత పౌష్టికాహారం లభించకపోతే వారు మానసికంగా అభివృద్ధి చెందలేరు. అవగాహనా శక్తిని పెంపొందించుకోలేరు. రెండేళ్ళ వయసులో పిల్లల ఆలోచనలు పరిమిత స్థాయిలో వుంటాయి. వారు తమ పేరులో మొదటి భాగాన్ని తెలుసుకోగలుగుతారు. కళ్ళు, ముక్కు, జుట్టు, బూట్లు మొదలైన సాధారణ వస్తువులను గుర్తించగలుగుతారు. కాగితంపై పెన్సిల్‌తో చిన్న చిన్న గీతలు గీయగలుగుతారు.
మూడేళ్ల ప్రాయంలో తమ వయసు గురించి తెలుసుకోగలుగుతారు. నిర్దిష్టమైన ఆకారాలను ఏదో విధంగా గీయగలుగుతారు. సున్నాలను గీయగలుగుతారు. కొన్ని రంగులపేర్లు చెప్పగలగుతారు. పదివరకు అంకెలు చెప్పగలుగుతారు. ఏమిటి? ఎక్కడ? ఎవరు? ఏది? అనే పదాలను అర్థం చేసుకోగలుగుతారు. నాలుగేళ్ల వయసు వచ్చేసరికి స్పష్టంగా మాట్లాడగలుగుతారు. పెద్దది, చిన్నది వంటి చిన్న చిన్న పోలికలను అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకు? ఏమిటి? ఎలా? అనే ప్రశ్నలు వేయగలుగుతారు. మొదటి ఐదేళ్ల కాలంలో సమన్వయం చేసుకునే శక్తి క్రమంగా పెరుగుతుంటుంది. 18 నెలల ప్రాయంలో చిన్న చిన్న కట్టడాలు నిర్మించగలుగుతారు. కుడి లేదా ఎడమ చేతివాటం ఈ వయసులోనే ప్రారంభం అవుతుంది. రెండేళ్ళ వయసులో బంతిని విసరగలరు. పుస్తకాల్లో పేజీలను అటూ ఇటూ తిప్పగలరు. మూడేళ్ల వయసువారికి చెంచాలు, ఫోర్క్‌లు ఉపయోగించే సామర్థ్యం అబ్బుతుంది.
ఒకటి నుండి నాలుగేళ్ళలోపు టాయిలెట్‌కు సంబంధించిన అలవాట్లు ఏర్పడతాయి. సాధారణంగా 24 నుండి 28 మాసాల మధ్య మూత్రం విసర్జన చేసినట్లు తమ పెద్దలకు తెలియజేయగలుగుతారు. మూడేళ్ళ వయసు వచ్చేసరికి రాత్రిపూట పక్క తడిపే అలవాటు మానేయగలుగుతారు. అయితే కొంతమందిలో ఈ అలవాటు నాలుగేళ్ళ వయసు వచ్చేవరకు కొనసాగుతుంది. ఒకటి నుండి రెండేళ్ళ లోపు వయసుగల పిల్లలకు రోజుకు 1200 కేలరీల శక్తినందించే ఆహారం అవసరం అవుతుంది. పదేళ్ళ వయసులో ఇది 1600 కేలరీలుగా పెరుగుతుంది.
ఇదే వయసులో ఎక్కువమంది రాత్రి సమయంలో సుమారు 10 గంటలసేపు నిద్రపోతుంటారు. నిద్రపోయే ముందు పిల్లలు తమ తల్లిదండ్రుల రక్షణను కోరుకుంటారు. ముఖ్యంగా చీకట్లో తల్లిదండ్రులనే ఆలంబనగా భావిస్తారు. చీకటి గురించి పిల్లలు ఎక్కువగా భయపడుతూ వుంటారు.
పిల్లలు చురుకుగా తయారవుతున్నకొద్దీ అనారోగ్య భయం పెరుగుతూ వుంటుంది. అయితే ప్రధాన ఇనె్ఫక్షన్లు సోకే అవకాశం తక్కువగా వుంటుంది. చిన్న చిన్న ప్రమాదాలు సంభవించే అవకాశం వుంది. వయసు పెరిగేకొద్దీ పిల్లలు స్వంత ప్రతిపత్తి కోరుకోవడం ప్రారంభిస్తారు. వారిలో ఉద్వేగం చోటుచేసుకుంటూ వుంటుంది. ముఖ్యంగా పిల్లలు 2, 3 ఏళ్ళ వయసువారైతే తల్లిదండ్రులకు పరీక్షాకాలమేనని చెప్పాలి. పిల్లలు మారాం చేస్తూ వుంటారు. తమ తల్లి నిరంతరం శ్రద్ధ చూపుతూ వుండాలని కోరుకుంటారు. ఇతరుల పట్ల ఈర్ష్య పెంచుకుంటారు. ఉద్రేకపడుతూ వుంటారు.

- బి.మాన్‌సింగ్