మెయన్ ఫీచర్

జనాల పల్స్‌ను పెంచుతున్న సాధికారిక సర్వే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజాప్రయోజనాల పేరున వ్యక్తిగత ప్రయోజనాలను పొందడం, ఏ నేతలకు లేనంతగా పేరుప్రఖ్యాతలు సాధించడం.. అనే ముసుగులో మొదటి అంశం ప్రధానంగా కనపడినా, వ్యక్తిగత ప్రయోజనాలే రాజకీయ చోదకశక్తిగా పనిచేయిస్తున్నాయనడానికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే చక్కని ఉదాహరణ. తన నీడను తానే చూసుకొని బావిలోకి దూకిన పంచతంత్ర కథలోని సింహంలా బాబు, కెసిఆర్ విధానాలు, పథకాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఒక్క రోజుననే అట్టహాసంగా చేపట్టిన సామాజిక కుటుంబ సర్వే ద్వారా ఏ లక్ష్యసాధన జరిగిందో తెలియదు గాని, పత్రికల్లో కెసిఆర్ పతాక శీర్షికన కనపడ్డాడు.
వ్యవసాయం చేసుకొనే అన్నదమ్ములిద్దరికి నువ్వులు బాగా పండగా, తెలివైన పెద్దోడి భార్య రోజు పొయ్యిలో చిత్తుని కర్రను పెట్టి చిటపటలాడించేదట! ఇలా రోజు తోడికోడలు నువ్వుల్ని వేయించుక తింటుందని భ్రమించిన చిన్నోడి భార్య అదే పనిగా రోజు నువ్వుల్ని వేయించుక తిన్నట్లుగా, కెసిఆర్ ఏది చేస్తే బాబు దాన్ని చేయడం, బాబు ఏదో చేయబోతున్నట్టు పసిగట్టె కెసిఆర్ దాన్ని ముందే చేపట్టడం జరుగుతున్నది. లోకేష్ అమెరికా, డల్లాస్ చుట్టూ తిరిగి వస్తే, కెటిఆర్ అమెరికా ఖండాన్ని చుట్టి వస్తున్నాడు. బాబు, కెసిఆర్‌లు సరేసరి! సింగపూర్, జపాన్, చైనాలు వీరికి ఢిల్లీలా మారిపోయాయి. తామో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రులమని మరిచి, స్వతంత్ర దేశాధినేతల్లా ఒకరిని మించి మరొకరు దేశాటనలు చేస్తూ పెట్టుబడులకై వెంపర్లాడడం చూస్తూనే వున్నాం.
ఓవైపు ఆర్థిక స్థితి బాగుందంటూ, ఆదాయ వనరులు అద్భుతం అంటూనే పెట్టుబడులు పెట్టి లాభాల్ని ఆర్జించండి అని బహిరంగంగా ప్రకటించడం వీరి పెట్టుబడి మనస్తత్వానికి నిదర్శనం. ఎక్సైజ్ ద్వారా, వాణిజ్య పన్నుల ద్వారా, పర్యాటక రంగం ద్వారా, ల్యాండ్ రెవెన్యూ ద్వారా రాబడి అమోఘంగా వుందని ప్రకటించిన తెరాస ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలు వున్న అప్పులో కనీసం ఓ పది శాతాన్ని కూడా తగ్గించుకోలేక పోయింది. ఇసుక రీచ్‌లతో, ఎక్సైజ్ ఆదాయంతో, ఎర్రచందనం ద్వారా కావాల్సినంతగా రాబడివున్న బాబు కేంద్రం ఆదుకోవడం లేదంటూ రోజు ప్రకటనల్ని గుప్పిస్తూనే వున్నాడు. పైగా మామిడి, బొప్పాయి, నిమ్మ, టొమాటో, మిర్చి, పసుపు, గుడ్ల ఉత్పత్తిలో ప్రథమస్థానంలో, వరి, వేరుశనగ, మొక్కజొన్న, మాంసం ఉత్పత్తుల్లో రెండో స్థానంలో, పాల ఉత్పత్తిలో మూడో స్థానంలో వున్న ఆంధ్రప్రదేశ్ నిజానికి స్వయం సమృద్ధి రాష్ట్రంగా విరాజిల్లాలి. కెసిఆర్‌కు మిషన్ కాకతీయ, భగీరథ, హరితహారం ఊపిరిపోసి, ఈ త్రైమాసికంతో దేశంలోనే ప్రథమస్థానంలో నిలబెట్టగా, అమరావతి నిర్మాణంలో, ఉద్యోగుల తరలింపులో అహర్నిశలు శ్రమిస్తున్న బాబు పదమూడో స్థానంలో నిలవడం, నిజంగా పుండుమీద కారం లాంటిదే!
ఇలా ఎవరి రాజకీయాలు వారికున్నా, ఎవరి ఓటు బ్యాంకు వారికి భద్రమని తెలిసినా, ఏదో నీడ ఇరు ముఖ్యమంత్రుల్ని వెంటాడుతూనే వున్నది. నెత్తిన ఎక్కించుకున్న జనం ఏనాడైనా ఎత్తేయడం ఖాయం అని వీరి అనుభవ పాఠం అయి వుంటుంది. అందుకే జనాల్ని ఆశల పల్లకిలో ఊరేగించడం, అభద్రతకు గురిచేయడం నిత్యకృత్యంగా మారాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా ప్రజాసాధికార సర్వే (డ్ఘూౄఆ -ఖఒళ డఖ్పూళక) పేరున సర్వే చేపట్టడం గమనార్హం!
జులై 8నుంచి 31దాకా, ఆగస్టు 6 నుంచి 14దాకా రెండు దఫాలుగా సాగే ఈ సర్వేలో దాదాపు 4.90 కోట్ల ప్రజల వివరాలను నూతన సాంకేతిక (డిజిటల్) పరిజ్ఞానమైన 2జి, 3జి పద్ధతిని ఉపయోగించి సేకరిస్తారు. ఇలా ఆన్‌లైన్‌లో నమోదుచేసే సమాచారంతో, భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఇదిమిద్ధంగా తెలియకున్నా, జనాల పుట్టుపూర్వోత్తరాలను, వ్యక్తిగత జీవన విధానాల్ని రికార్డు చేయడం జరుగుతున్నది.
ప్రపంచ బ్యాంకు ఆదేశాల మేరకే ఈ సర్వే జరుగుతున్నదని అనంతపురం జిల్లా కుల విమోచన పోరాట సమితి (కెవిపిఎస్) ఆరోపిస్తూ ఈ సందర్భంగా ఓ కరపత్రాన్ని విడుదల చేయడం కూడా జరిగింది. దాదాపు తెలంగాణలో జరిగిన తంతే అయినా, ఈ సర్వే జనాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. స్వయాన ముఖ్యమంత్రే కుటుంబ సభ్యులతో ఉండవల్లిలో ఆధార్, ఓటర్ గుర్తింపుకార్డుతో హాజరై మొదటి రోజునే నమోదు చేసుకోవడంతో ప్రజలకు మరింత గుబులు పట్టుకున్నది. స్వయాన ముఖ్యమంత్రే సర్వేకు వివరాల్ని తెలిపినప్పుడు, తాము తెలపకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కోవల్సి వస్తుందనేది అందరికి పట్టుకున్న భయం. పైగా ఈ సర్వే సందర్భంగా ప్రతి వ్యక్తి విధిగా చూపించాల్సినవి ఆధార్, ఓటర్ గుర్తింపు పత్రాలు కాగా, పుట్టిన తేదీ ధృవీకరణ, పాన్‌కార్డ్, జాబ్‌కార్డ్, కులధృవీకరణలతోపాటు, కుటుంబానికి సంబంధించిన గ్యాస్ బుక్కు, ఇంటికి సంబంధిత డాక్యుమెంట్లు, భూసంబంధ పాస్‌బుక్కులు, రేషన్‌కార్డు, మొబైల్ సెల్ నెంబర్లు, కరెంటు బిల్లు, విద్యాసంబంధ అర్హతలు, చదివిన సంస్థల వివరాలు, వాహనాలకు సంబంధించిన ఆర్‌సి పుస్తకాలు విధిగా చూపించాల్సిందే! ఇలా 22 రకాల ఆధారాలతో వ్యక్తుల వివరాల్ని నమోదుచేయడం దేశంలోనే మొదటిసారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అంటూ, ప్రజల సమస్యల్ని రియల్ టైంలో పరిష్కరించడానికి ఈ సర్వే వివరాలు ఉపయోగపడతాయని అనడం గమనార్హం!
ఇలా వ్యక్తులకు సంబంధించిన ఆర్థిక, విద్యా, సామాజిక, కుల, మత, సంపదలకు సంబంధించిన సర్వేలు కొత్తవేమి కావు. నిజానికి ప్రతి దశాబ్దానికోసారి జరిగే జనాభా, ఇండ్ల గణనలో ఈ సమాచారం పూర్తిగా సేకరించడం జరుగుతూనే వున్నది. ఇలాంటి సర్వే సందర్భంగా కుటుంబ యజమానో లేదా సంబంధిత వ్యక్తో సమాచారం ఇవ్వడమే కాకుండా, తెలిపిన సమాచారం వాస్తవమేనని ధృవీకరిస్తూ సంతకం కూడా చేస్తారు. కాని ప్రస్తుతం చేపట్టిన సాధికారిక సర్వే కెసిఆర్ జనాల్ని హైరానా చేసినట్లు గానే, సంబంధిత కుటుంబ సభ్యులందరు విధిగా సర్వే సందర్భంగా వుండాలనడమే అనేక అనుమానాలకు తావిస్తున్నది. కాందిశీకుల వివరాల్ని అస్సాంలో సేకరించిన విధంగానే ఈ సర్వే కొనసాగడం జరుగుతున్నది. ఉద్యోగ విద్యా, ఉపాధి రీత్యా విదేశాల్లో, సుదూర ప్రాంతాల్లో వున్న వ్యక్తులు, వలస పోయిన జనాలు ఉన్నఫళంగా తమతమ ఇళ్ళకు తిరిగి రావల్సిందే! లేకపోతే ‘చచ్చినట్టె’లెక్క అనే జనం నానుడి నిజమైతుంది.
ఏ సర్వే జరిగినా ఏదో లబ్ధి జరుగుతుందనే వెర్రి జనాలున్న దేశంలో ప్రభుత్వ పథకాలకై ఎదురు చూడడం.. మన రక్తంలో భాగంగా మారింది. పోగుపడిన సంపదలో కొంత మొత్తాన్ని నెలనెలా పంచుతామన్న స్విస్ ప్రభుత్వానికి ఆ దేశ ప్రజలు పెట్టిన వాతలు నిజంగా మన జనాలకు తెలియదు. ఇలా తెలియకుండా ప్రజల్ని వ్యామోహపరుల్నిగా ఎదిగించిన ఘన వ్యవస్థ మనది. ఇంకా నయం, ఉచితాలతో రాష్ట్రాల్ని ఏలుతున్న జయమ్మగారు, అఖిలేష్‌యాదవ్‌గారు ముఖ్యమంత్రుల కొలతబద్దలో మొదటి రెండు స్థానాల్ని ఆక్రమించలేదు.
మరి సర్వేల ద్వారా జరిగేదేంటి...? ఒరిగేదేంటి? ఇదే బ్రిటన్లో అయితే ఎన్నో సంస్కరణలు చోటుచేసుకునేవి. మనదగ్గర ఏం జరుగుతాయో అందరికీ అనుభవంలో వున్నదే! సత్వరమే పరిష్కరించాల్సిన సమస్యల నుంచి జనాల దృష్టి మరల్చడానికి ఇవి బాగా పనిచేయగా, కొత్త పథకం దేవుడెరుగు, ఉన్న లబ్ధి ఊడకుండా ఉండడానికై చాకచక్యంగా సమాధానాలు చెప్పడం మన జనాలకు కూడా ఈ సర్వేల సందర్భంగా అబ్బిన గొప్ప విద్య. ఈ విద్య అందరికీ రాదనేది ఓ నగ్న సత్యం. అందుకే అందే పథకాలు అందకూడని వారికి, అందాల్సిన వారికి జీవిత కాలంలో అందకుండా వుండడానికి ఈ సర్వేలు సహకరిస్తూనే వున్నాయి. పోతే, కోట్లాది రూపాయల అప్పుల్ని ఇస్తున్నప్పుడు, అభివృద్ధి రేటు ఎంత జరిగిందో ప్రపంచ బ్యాంకుకు చెప్పాలంటే, దారిద్య్రరేఖ కింద వున్నవారు ఈ రేఖ పైభాగానికి (ఇ్య్పళ -్య్పళూఆక జజశళ-జ) చేరారని చెప్పడానికి ఒకసారి, అప్పులు తెచ్చేటప్పుడు మాత్రం జనాలంతా ఇంకా బిపిల్ కిందనే వున్నారంటూ దండిగా డబ్బుల్ని తేవడానికి ఇవి బాగా పనిచేస్తాయి.
ప్రస్తుతం చైనా, జపాన్, కొరియా, సింగపూర్ తదితర దేశాలనుంచి పెట్టుబడులు రావాలంటే, ప్రజల కొనుగోలుశక్తి బాగా వుండాలి కదా? అప్పుడే ఈ దేశాలు మన దేశంలో తయారుచేసే వస్తువుల్ని వినియోగిస్తారు. ఇలా వినియోగించాలంటే, ప్రజల ఆర్థిక స్థితి వాపు కాదు, నిజంగా బలుపేనని నిర్ధారించాలి. దీంతో కొన్ని పథకాలు ఊడిపోవచ్చు! అలాగే మానవ వనరుల్ని వ్యక్తిగత నైపుణ్యతల్ని వినియోగించుకోవాలంటే జనాల పల్స్ తెలియాల్సిందే! ఇలా చౌకగా లభించే మానవ శ్రమను ఇక్కడ ఏర్పడే మల్టినేషనల్ కంపెనీలలో ఎంతమేరకు వినియోగించుకునే అవకాశం వుందో తేలాలంటే ఈ సర్వేలు కావల్సిందే! ఇలా జనాల జాతకాలను బహుళజాతి సంస్థల ముందర పెడితే, విద్యారంగాన్ని, వ్యాపార రంగాన్ని, వినిమయ రంగాన్ని, హోల్ మొత్తంగా సాంస్కృతిక రంగాన్ని ఎలా తీర్చిదిద్దాలో, అమెరికా పెద్దలు, వీరి కనుసన్నల్లో నడిచే బుద్ధులు (జశజూఒ) సెలవిస్తూ వుంటాయి.
ఇలా మన సార్వభౌమత్వాన్ని, వ్యక్తిత్వాన్ని విదేశీయులకు తాకట్టుపెట్టడమే ప్రస్తుత మన జాతీయ, రాష్ట్రీయ విధానాలు, ఈస్టిండియా కంపెనీ వ్యాపారం పేరున రాజ్యాధికారం చేపట్టిన బ్రిటీషు వారికి వ్యతిరేకంగా పోరాడిన మన జాతీయ నాయకులందరు నేటి నాయకుల దగ్గర పాఠాలు వినాల్సిందే! ఇందుకైనా వారు పునర్జన్మించాలని ఆశిస్తూ- క్విట్ ఇండియా అంటూ, విదేశీ వస్తు బహిష్కరణ అంటూ గాంధీ ఇచ్చిన నినాదాన్ని ఆయన ఎక్కడ వున్నా పునఃసమీక్షించాలని కోరుతూ-

- డా.జి.లచ్చయ్య 9440116162