మెయన్ ఫీచర్

దేశ సమగ్రత పట్టని చిదంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాట చిదంబరం గొప్ప పుణ్యక్షేత్రం. భక్తనందనార్ ‘చిదంబరమే నా జీవితం గమ్యం, చిదంబరమే రమ్యం’ అని పరవశించిపోయేవాడు. అంతమంచి పేరు పెట్టుకొని ‘రహస్య’ అజెండా అమరలు చేసిన యుపిఎ ఏలికలో గృహమంత్రి చిదంబంరం గురించి ఎంత రాసినా తక్కువే. గుజరాత్ ఎన్‌కౌంటర్‌లో మరణించిన లష్కరే తోయిబా తీవ్రవాది ఇషరత్ జహాన్ విషయంలో ఈయన వేసినవన్నీ పిల్లిమొగ్గలే, కుప్పిగంతులే. రాహుల్, సోనియాలపైని వీరాభిమానం ఆయనతో అలా చేయించిందనే విషయంలో సందేహం అక్కరలేదు. సమాచారహక్కు చట్టం తెచ్చామని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఆ చట్టం ద్వారా వెలుగులోకి వస్తున్న అనేక వాస్తవాలను అంగీకరించేందుకు ఒప్పుకోవడం లేదు. 2010లో ‘ఎకనమిక్ టైమ్స్’లో ఒక వ్యాసం ప్రచురితమైంది. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ రాసిన ఈ వ్యాసంలో ఆయన చిదంబరంనుద్దేశించి ‘మేధావే, కాని అహంకారి’ అని వ్యాఖ్యానించారు. చిదంబరం తనకు 1985 నుంచి తెలుసునని, తెలివిగల, నిబద్ధత గల రాజకీయవేత్త అనీ, కానీ ఒకసారి నిర్ణయం తీసుకుంటే మొండి చేస్తాడని సింగ్ రాశాడు. తానుకూడా ఆయన ‘అగ్రవాదానికి’ చాలాసార్లు బలి అయ్యానన్నాడు. మణిశంకర్ అయ్యర్ కూడా ఇది లక్షశాతం నిజం అన్నారు. రాజీవ్ హత్య విషయమై విచారణ బాధ్యత యివ్వబడిన మంత్రిగా 1994- 1996 మధ్య ఆయన ప్రదర్శించిన నిర్లక్ష్యాన్ని, 1986-89 మధ్య ఆంతరంగిక భద్రతశాఖ మంత్రిగా ఆయన సామర్ధ్యలేమిని ఇందుకు నిదర్శనంగా వారు ఉదహరించారు.
1985లో జన్మించిన ఇష్రాత్ జహాన్ రజా సైన్స్ డిగ్రీ చదువుతున్న 19 ఏళ్లపడుచుపిల్ల. ముంబైలోని గురునానక్ ఖల్సా కళాశాలలో ఆమె చదివింది. బిహారునుంచి వలస వచ్చిన ఏడుగురు పిల్లల కుటుంబం వారిది. ముస్లింల ఆధిక్యత గల ముంద్రాలోని రషీద్ కాంపౌండ్‌లో వారి నివాసం. ఆమె తండ్రి మహమ్మద్ హలీమ్ రజా ఓ నిర్మాణ సంస్థ యజమాని. ఆమె తల్లి వాసిలో ఒక మందుల ప్యాకేజింగ్ సంస్థలో పనిచేసేది. 2002లో తండ్రి చనిపోయాడు. ఖర్చులకోసం ఇషత్ ట్యూషన్లు చెప్పేది. కుట్టుపని చేసేది. ప్రణేష్ పిళ్లై వద్ద ఆమె ఎక్కౌంట్స్ వ్రాసింది. ఈ ప్రణేష్ పిళ్లై 1991లో జావేద్ షేక్‌గా మతం మార్చుకొని సజిదా అనే ముస్లిం యువతిని పెళ్లాడాడు. 2004లో తాను ఎన్‌కౌంటర్ కావడానికి రెండురోజుల ముందు ఇష్రాత్, జావెద్‌ను కలిసింది. అతనితో కలిసి నాసిక్, బెంగళూరు, లక్నోలు తిరిగింది. అమ్జద్ అనే పాకిస్తాన్ తీవ్రవాదితో ఆమెకు పరిచయం అయింది. 2003లో దుబాయ్, 2004లో ఒమన్ పర్యటనలు జరిపిన జావెద్ పాకిస్తాన్ మత్తును నెత్తికెక్కించుకున్నాడు. ఇష్రాత్‌కు కొంత ఆ మత్తెక్కించాడు. ముంబైలో నకిలీ కరెన్సీ రాకెట్ నడిపిన వాడిగా అతని మీద నాలుగు కేసులు నమోదయ్యాయి. అమ్జద్ ద్వారా జావెద్, ఇష్రాత్‌లు, జీషన్ అనే మరో తీవ్రవాదిని కూడా కలిశారు. ఈ నలుగురు 2004, జూన్ 15న గుజరాత్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతులయ్యారు.
గుజరాత్ పోలీసుల కథనం ప్రకారం వీరంతా నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని అంతమొందించేందుకు కుట్ర చేశారు. 2008 ముంబై తాజ్ హోటల్ పేలుళ్ల కుట్రదారుడు డేవిడ్ హెడ్లీ, ఎఫ్‌బిఐ విచారణలో ఇష్రాత్‌ను ఫిదాయి (ఆత్మాహుతి దళ సభ్యురాలు)గా వర్ణించాడు. 2004, జూన్‌లో భారత్‌లోని మీడియా ‘లష్కర్-ఎ-తోయిబా ప్రచురించిన వ్యాసంలో ఇషత్‌న్రు తమ దళ సభ్యురాలిగా పేర్కొన్నట్టు వార్తలు రాశాయి. జమాత్ ఉద్ దావా పేరుగల వెబ్‌సైట్‌లో ఈ వ్యాసం 2009, ఆగస్టులో నాటి యుపిఎ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌లో 2004 నాటి వీడియో వార్తల్ని ఉటంకించింది. కాని సెప్టెంబర్ 2009లో హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో చిదంబరం జరిగింది నకిలీ ఎన్‌కౌంటర్ అంటూ కొన్ని మార్పులు చేసినట్లు అంగీకరిస్తూనే తన ద్వంద్వ ప్రమాణాల్ని సమర్థించుకుంటూ కాంగ్రెస్ అసలు అజెండా చెప్పకనే చెప్పారు. నరేంద్రమోదీని రాజకీయంగా అంతం చేయడం, ముస్లిం ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టడం తప్ప, 130 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి జాతిహితం యిసుమంతైనా పట్టకపోవడం, చిదంబరం వంటి మేధావులు సైతం కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు భయపడిపోవడం, భ్రష్టుపట్టిపోవడం ఈ జాతి దురదృష్టం.
2004, ఫిబ్రవరిలో జమ్మూకశ్మీర్ పోలీసులు ఇష్ ఇల్లహి అనే పేరుగల ఎల్‌యిటి తీవ్రవాదిని మట్టుపెట్టారు. తరువాత నిఘావర్గాల పరిశీలనలో జావెద్ వివరాలు వెల్లడయ్యాయి. జావెద్‌ను పోలీసులు మభ్యమపెట్టి అహ్మదాబాద్ రప్పించగలిగారు. ఇషత్ 2004, జూన్ 11 అంటే ఎన్‌కౌంటర్‌కు నాలుగు రోజుల ముందే ఇల్లు విడిచింది. ఆమె తమ్ముడికి, అమ్మకు ఆమె జావెద్‌తో వెళ్లడం ఇష్టం లేదు. అందుకే ఎవరికీ చెప్పకుండా ఆతనితో నాసిక్ వెళ్లింది. జూన్ 11న ఆమె తల్లికి పబ్లిక్ ఫోన్ నుంచి కాల్ చేసింది. జావెద్‌తో మరికొందరు కొత్త వ్యక్తులున్నారని ఆమె భయపడుతూ తల్లికి చెబుతూ మధ్యలోనే ఫోన్ పెట్టేసింది. 2004, జూన్ 15న మిగిలిన ముగ్గురితో కలిసి అహమ్మదాబాద్‌కు చేరువలో ఆమె ఎన్‌కౌంటర్‌లో మరణించింది. ఆరోజు టైమ్స్ ఆఫ్ ఇండియా, ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్, రిడిఫ్ డాట్ కామ్, ఆవుట్‌లుక్ అంతా ఇష్రాత్ జహాన్ ఎల్‌యిటి సభ్యురాలని, హోర్‌నుంచి ప్రచురితమయ్యే ఎల్‌యిటి పత్రిక ‘ఘజ్వా టైమ్స్’ ధృవీకరించినట్టు వార్తలు ప్రచురించాయి. కాని తర్వాత అంతా ఆమె అమాయకురాలని వాదించడం మొదలుపెట్టారు. ఆమె కుటుంబం ముంబై పోలీసులనువిచారణ చేయించమంది. మైనారిటీ కమిషన్ విచారణకు పట్టుపట్టింది. ఇష్రాత్ అంతిమయాత్రలో పదివేలమంది పాల్గొన్నారు.
దేశభక్తులై స్వాతంత్య్రోద్యమంలో విప్లవ పంథాలో బ్రిటిష్ తెల్లదొరలను కాల్చి చంపిన భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్‌లకు కూడా చివరకు అనాథప్రేత సంస్కారమే మిగిలింది. కాని కాంగ్రెస్ హయాంలో తీవ్రవాదులకు రాచమర్యాదలు జరిగాయి. మానవహక్కుల ఉల్లంఘన అంటూ గుజరాత్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారు. సమాజ్‌వాది పార్టీ మహారాష్టశ్రాఖ అధ్యక్షుడు అబు అజ్మి సిబిఐతో విచారణ జరపాలన్నాడు. 2007లో చాలామంది పోలీసులను, అధికారులను నకిలీ ఎన్‌కౌంటర్లకు బాధ్యులను చేసింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. 2005లో సోహ్రాబుద్దీన్, అతని భారతీయ ఎన్‌కౌంటర్ విషయమై పోలీసు అధికారి డిజి వంజరా జైలుపాలయ్యాడు. 2013లో వచ్చిన రాడియా టేపుల కథనం ప్రకారం, ఐబి అధిపతి అసిఫ్ అబ్రహం, అప్పటి ప్రధానమంత్రి కార్యాలయానికి, గృహమంత్రిత్వశాఖకు, ఇష్రాత్ జహాన్ ఎల్‌యిటికి చెందిందని , నరేంద్రమోదీ, అద్వానీలను హత్య చేసేందుకు వినియోగింపబడిందని సమాచారమిచ్చాడు. ఈ విషయమై హెడ్లీ వెల్లడి చేసిన వివరాల మేరకు అమెరికాకు చెందిన ఎఫ్‌బిఐ భారత గృహమంత్రిత్వశాఖకు సమాచారమిచ్చింది. 2013లో ఎన్‌ఐఏ కూడా ఇష్రాత్ జహాన్ తీవ్రవాది అని తేల్చిచెప్పింది. 2009, సెప్టెంబర్ 7న అహ్మదాబాద్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎస్‌పి తమంగ్ ఇచ్చిన నివేదిక, ఇష్రాత్ జహాన్ మరి ముగ్గురు చనిపోవడాన్ని నకిలీ ఎన్‌కౌంటర్ అని తప్పు పట్టింది. ఆ వినేదికను సవాలు చేస్తూ గుజరాత్ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 2010లో హైకోర్టు తమంగ్ నివేదికను తప్పు పట్టింది. తరువాత ఏర్పడిన ‘సిట్’ కూడా పోలీసు అధికారులకు శిక్ష విధించాలంది. సిబిఐ 2014లో అప్పటి గుజరాత్ హోంమంత్రి అమిత్ షాపై అభియోగాలు మోపింది. కాని యిదంతా ఒక గుజరాత్‌కు చెందిన కాంగ్రెస్ నేత ప్రోద్బలంతో జరిందని, సిబిఐ మాజీ చీఫ్ రాజేందర్ కుమార్ అన్నారు. ఏతావాతా తేలిందేమంటే 2004లో జరిగిన ఘటనను తమ రాజకీయ పబ్బం గడుపుకుంనేందు నాడు కేంద్రంలో ఉన్న యుపిఎ శాయశక్తులా ప్రయత్నించింది. అందుకు అన్ని రాజ్యాంగ సంస్థలను ప్రభావితం చేసేందుకు యత్నించింది. హోంశాఖ మాజీ కార్యదర్శి పిళ్లై సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించారు.
చెట్టినాడ్‌కు చెందిన ధనిక వ్యాపారి, బ్యాంకర్, అయిన అన్నామలై చెట్టియార్ చిదంబరంకు తాతయ్య వరుస. మద్రాసు లా కళాశాలలో న్యాయవిద్య నభ్యసించిన చిదంబరం ‘హార్వర్ట్ బిజినెస్ స్కూల్ నుంచి ఎమ్‌బిఎ చదివారు. ముందు వామపక్ష భావాలున్న చిదంబరం ది హిందూ సంపాదకుడు ఎన్. రామ్, మహిళా ఉద్యమనేత మైథిలీ శివరామన్‌తో కలిసి ‘రాడికల్ రివ్యూ’ అన్న పత్రిక ప్రారంభించారు. కుటుంబం వ్యాపార రంగంలో స్థిరపడినా చిదంబరం న్యాయవాద వృత్తిని స్వీకరించారు. మద్రాసు హైకోర్టునుంచి ప్రారంభించి, క్రమంగా సుప్రీంకోర్టు స్థాయికి ఎదిగారు. 1984లో తమిళనాడు శివగంగ స్థానం నుంచి నెగ్గారు. కాంగ్రెస్ పార్టీలో తమిళనాట అనేక పదవులు నిర్వహించారు. తరువాత లోక్‌సభకు 2004, 2009ల్లో శివగంగ నియోజకవర్గం నుంచే ఎన్నికయ్యారు. కేంద్రంలో రాజీవ్ గాంధీ మంత్రివర్గంలో అనేక మంత్రిపదవులు నిర్వహించారు. 1996లో తమిళ మనిల కాంగ్రెస్‌లో చేరారు. ఆ సంవత్సరం తమిళనాడులో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిత్వశాఖ నిర్వహించారు. 2004లో కేంద్రంలో కూడ ఆర్థిక శాఖను నిర్వహించారు. ఆర్థికశాఖ పరంగా ఆదాయపు పన్ను చెల్లింపు దారులు అవకతవకలకు పాల్పడితే ఆయన భార్య నళినీ చిదంబరం ఐటి ప్రాక్టీషనర్‌గా వాటిని క్రమబద్ధీకరించడం జగమెరిగిన సత్యం.
2009లో యుపిఎ-2లో ఆయన హోమ్‌శాఖను చేపట్టారు. ఆయన కొడుకు కార్తీక్ టెక్సాస్ నుంచి బిబిఎ డిగ్రీ, కేంబ్రిడ్జి నుంచి న్యాయపట్టా పొందారు. ఆయన దేశంలో, వివిధ దేశాలలో ఇబ్బడి ముబ్బడి వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అవి వివాదాస్పదమవుతున్నాయి. 2011 ముంబై పేలుళ్లను నిరోధించడంలో చిదంబరం హోంమంత్రిగా విఫలమయ్యారు. ఢిల్లీలో 1984లో జరిగిన అల్లర్లలో జగదీష్ టైట్లర్‌ను నిర్దోషి అన్నందుకు జర్నైల్ సింగ్ అనే పాత్రికేయుడు ఆయనపై చెప్పు విసిరాడు. వేలకోట్ల 2జి కుంభకోణాన్ని నిరోధించలేకపోయారు. దేశంలో జరిగిన అతిపెద్ద అవినీతి కుంభకోణం ఇది. 2008-09 మధ్యప్రాంతంలో ఆయన ‘హిందూ టెర్రర్’ అనే కొత్తపల్లవిని అందుకున్నారు. ఆ పేరున రాజకీయ ప్రత్యర్థుల పీచమణచాలని చూశారు. కాని 2009-11 మధ్య దేశవ్యాప్తంగా పెల్లుబుకిన జాతీయ ప్రజాచైతన్యం ముందు ఆయన తలవంచక తప్పలేదు. అనేక మంది విశుద్ధ జాతీయ వాదులను అక్రమ కేసుల్లో ఇరికించే యత్నం చేశారు. 2014 ఎన్నికల్లో చివరకు ఆయన అస్తస్రన్యాసం చేశారు. తాజాగా అఫ్జల్ గురును ఉరితీసి ఉండాల్సింది కాదేమో అంటూ సోకాల్డు కుహనా సెక్యులర్ కూతలు కూశారు. ఉగ్రవాదులను వెనకేసుకొస్తున్న కాంగ్రెస్ పార్టీ అసలు సిసలు సైనికుడనిపించుకోవాలనుకున్నారు. హార్వర్డ్‌లో చదివినా ఆయనకు సగటు భారతీయుడికి పట్టలేదు. ఆర్థికమంత్రిగా ఆహార ద్రవ్యోల్బణం కట్టడి చేయలేకపోయారు. ఖజానాను ఖాళీచేసి వెళ్లారు. 2014లో వచ్చిన కొత్త ప్రభుత్వం ముందు అనేక ఆర్థిక సవాళ్లను ఉంచారు. అగ్రవాదం, ఉగ్రవాదం తప్ప సమగ్రవాదం పట్టని ఈ తరహా నాయకులవల్ల భారత్‌కు ఎంతో నష్టం జరిగింది.

- తాడేపల్లి హనుమత్ ప్రసాద్ సెల్: 9676190888