మెయిన్ ఫీచర్

సరస్వతీ నిలయాల్లో .. ‘బాలికా శక్తి’ పరిమళం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మారుతున్న కాలంలో సామాజిక పరిస్థితులు ఏలా ఉన్నా అతివలకు మర్యాద ఇవ్వడం అనేది ఇప్పటికీ కొనసాగుతునే ఉంది. వీరికి మరింత రక్షణ, భవితపై భరోసా, సాధికారతలను పెంపొందింపజేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ‘బాలికా శక్తి’ని తీసుకురానుంది. ఇంటర్, డిగ్రీ, పిజీ కళాశాలల్లో విద్యార్థినుల భాగస్వామ్యంతో బాలికా శక్తి బృందాలను ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయ. చదువులో వెనుకబడినా, చదువుకు పేదరికం అడ్డుపడినా, ఈవ్‌టీజింగ్‌తో వేధిస్తున్నా, విద్యాలయాల్లో అసౌకర్యాలు వెంటాడినా వాటిని గుర్తించి చక్కటి మార్గాన్ని ఈ బృందాలు చూపిస్తాయ. లోకజ్ఞానం, వర్తమాన సామాజిక స్థితిగతులను వివరించనున్నాయి. జీవితంలో ఎదిగేందుకు అవసరమైన స్ఫూర్తి కథనాలు, మహిళల విజయాలు, వారిలో ఆత్మవిశ్వాసం, మానసిక శాంతిని పెంచేలా ఆధ్యాత్మిక సదస్సులు ఏర్పాటుకు శ్రీకారం చుడతాయి. ఆపదలో ఉన్న తోటి మహిళలకు ఏ విధంగా సాయం అందించాలో వారిలో శక్తియుక్తులను పెంపొందించేలా నిష్ణాతులతో ఈ బృందాలుశిక్షణ ఇస్తాయి. ఈ పథకం అమలు తీరు సక్రమమైన రీతిలో జరగాలని, విద్యార్థినికి కవచంగా ఉంటుందని విశాఖపట్నంలోని కొంతమంది మహిళలు తమ మనోగతాన్ని ‘్భమిక’తో పంచుకున్నారు.

మహిళా సమస్యలకు పరిష్కారం
వర్తమానంలో మహిళలకు సంపూర్ణ రక్షణ లేదనే చెప్పాలి. ఈ సంగతి ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలను ఒక్కసారి పరిశీలిస్తే అర్థమవుతుంది. పాఠశాల, కళాశాలలకు వెళ్ళిన తమ బిడ్డ ఇంటికి క్షేమంగా చేరుకునే వరకూ తల్లిదండ్రులకు బెంగగానే ఉంటుంది. లైంగిక వేధింపులు, వరకట్న సమస్యలను ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్ర భుత్వం సరికొత్తగా విద్యాలయాల్లో ఏర్పాటు చేయనున్న ‘బాలికా శక్తి’ బృందాల వల్ల పై సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నాను.
- జి.అనురాధ

శక్తిని వెలికితీయొచ్చు
విద్యార్థినులు తమలో ఉన్న అపారమైన శక్తిని తెలుసుకోలేకపోతున్నారు. దీనికి కారణం ప్రో త్సాహం, సరైన శిక్షణ అందకపోవడమే. ఉన్నతస్థాయికి ఎదగాలనే తపన ఉన్నప్పటికీ బిడియం అనే భూతం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోతున్నారు. విద్యార్థిని స్థాయిలోనే మహిళా చట్టాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. పాఠశాలలో చేరినప్పటి నుంచే పరీక్షలపై, సమాజ పరిస్థితులపై అవగాహన కలిగివుండడం అవసరం. ‘బాలికా శక్తి’ బృందాలు పై అవగాహన కల్పిస్తే విద్యార్థినులు ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు.
- ఎల్.వౌనిక

ప్రతిభా వికాసానికి దోహదం
జీవితంలో చదువు అనేది అతి ముఖ్యమైనది. పల్లెప్రాంతాల్లోని విద్యార్థినులు ప్రపంచ జ్ఞానం తెలియక ‘పోటీ’లో వెనుకబడిపోయి, విలువైన సేవలను దేశానికి అందివ్వలేకపోతున్నారు. విద్యార్థినుల్లో ఇవన్నీ దరికి చేయనీయకుండా ఉండాలంటే ‘బాలికా శక్తి’ బృందాలు అవసరమనే చెప్పాలి. ప్రభుత్వం ఈ బృందాల ఏర్పాటు కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా, అచరణలో పెట్టాల్సివుంది.
- నివేదిత

ఆనందం కలిగింది
ప్రభుత్వం కొత్తగా ‘బాలికా శక్తి’ బృందాలను ఏర్పాటు చేస్తుందన్న విషయం తెలిసి, ఆనందం కలిగింది. విద్య, పోటీ పరీక్షలకు సంబంధించి ఎన్నో కొంగొత్త విషయాలను ఈ బృందాల ద్వారా సులువుగా తెలుసుకోవచ్చును. పరీక్ష అంటే భయం పోతుంది. అయితే, ఈ బృందాలకు మేధావులతో ప్రత్యేక శిక్షణ ఇప్పించాలి. అప్పుడే ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వస్తాయి. విద్యార్థినుల మోముల్లో వెలుగులు పూస్తాయి.
- నాగమణి

పథకాలపై అవగాహన
కొన్ని ప్రాంతాల్లో విద్యార్థినులు సంప్రదాయ చదువుల వైపే మొగ్గుచూపుతున్నారు. వృత్తి విద్యా కోర్సులు ఎప్పటినుంచో ఉన్నప్పటికీ వాటిపై సరైన అవగాహన లేదు. నేటి పరిస్థితుల్లో వాటి ఉపయోగం చాలామందికి తెలియడం లేదు. ముఖ్యంగా విద్యార్థినులకు వీటిపై అవగాహన కల్పించాల్సివుంది.‘బాలికా శక్తి’ బృందాలు స్వచ్ఛంద సంస్థల సాయం తీసుకుని, వృత్తివిద్యా కోర్సుల విలువలను విద్యాలయాల్లో తెలపాల్సిన అవసరం ఉన్నది.
- దుర్గాదేవి

సమాజమూ ఆదరించాలి
ప్రభుత్వం కళాశాల్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఈ బృందాలను సమాజమూ ఆదరించాల్సి వుంది. రాజకీయాలకు అతీతంగా వీటిని ప్రోత్సాహించి, సలహాలు అందించాలి. అప్పుడే బాలికల్లో కొత్త ‘శక్తి’ని వెలికితీసినవారవుతారు. విద్యాభ్యాసంలో ఉన్న లోటుపాట్లు తెలుసుకుని, వాటిని సరిదిద్దుకుని ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. అలాగే, సమాజంలోని అన్యాయాలను, అక్రమాలను ఎదుర్కొవచ్చును. ప్రపంచ స్ర్తిల్లో భారత మహిళకు ఎంతో గౌరవం ఉంది. రాణి రుద్రమదేవి, ఝాన్సీలక్ష్మీబాయ్ వంటి నారీమణులు దేశ కీర్తిప్రతిష్ఠలను నలుదిక్కులా చాటిచెప్పిన వారే. ఇటువంటి స్ఫూర్తి గాథలను బృందాలకు వివరించి, తద్వారా విద్యార్థినుల భవితకు బాటలు వేయాలని కోరుతున్నారు.
- జి.విజయలక్ష్మి

స్ర్తిశక్తి విరాజిల్లుతుంది
పూర్వం కంటే ఆధునిక యుగంలో స్ర్తిల్లో చైతన్యం వెల్లివిరుస్తోంది. చదువును ఆదరించి, మేధావులుగా ఎదుగుతున్నారు. ఎటొచ్చీ రక్షణే కరవవుతోంది. తమని తాము రక్షించుకోగలిగే శక్తిని విద్యాలయా ల నుంచి నూరిపోయాల్సివుంది. ఉపాధ్యాయ సిబ్బంది, తల్లిదండ్రులు కూడా సమాజంలో ఎలా మెలగాలన్న విషయాలను పిల్లలకు బోధించాల్సివుంది. ఈ బృందాలు విద్యార్థినుల్లోని శక్తిని వెలికితీసి, ఆణిముత్యాలుగా తీర్చిదిద్దుతాయని ఆశిస్తున్నాను.
- జగదాంబ

దేశానికి ఆదర్శం
విద్యాలయాల్లో చదువుతోపాటు సమాజ స్థితిగతులు, వర్తమాన విషయాలపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలి. అప్పుడే ఇంటినే కాకుండా దేశానే్న తీర్చిదిద్దగల సామర్థ్యాన్ని అందిపుచ్చుకుంటారు. ఆడపిల్ల అనే చులకన భావం నశించాలంటే విద్యార్థినులు ఊరూరా చైతన్య సదస్సులు ఏర్పాటు చేయాలి. ఇటువంటి కార్యక్రమాలు ఒక్క ‘బాలికా శక్తి’ బృందాలతోనే సాధ్యమని అభిప్రాయపడుతున్నాను.
- అడపా కృష్ణవేణి

-గున్న కృష్ణమూర్తి, విశాఖపట్నం.