జాతీయ వార్తలు

భగవంత్ మాన్‌పై రభస: లోక్‌సభ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: భద్రతావ్యవస్థను దాటుకుంటూ పార్లమెంటులోకి ఎలా వెళ్లాలన్న విషయమై వీడియో తీసి సామాజిక మీడియాలో పోస్టు చేసిన ఆప్ ఎంపీ భగవంత్ మాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభలో శుక్రవారం కూడా సభ్యులు డిమాండ్ చేశారు. లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ, దేశ భద్రతకు సంబంధించి ఎవరు ఎలాంటి తప్పు చేసినా క్షమించరాదన్నారు. ఇతర పార్టీలకు చెందిన సభ్యులు కూడా ఈ విషయమై నినాదాలు చేయడంతో గందరగోళం ఏర్పడింది. భగవంత్‌మాన్‌పై చర్యలు తీసుకుంటానని స్పీకర్ సుమిత్రా మహాజన్ హామీ ఇచ్చినప్పటికీ సభ్యులు శాంతించలేదు. తీవ్ర గందరగోళం నడుమ లోక్‌సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు.