మెయిన్ ఫీచర్

లోకం చుట్టేస్తా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ చిత్రాల్లో కన్పిస్తున్న వనిత పే రు ట్రేసీ కుర్టిస్ టేలర్. ప్రపంచంలో 24 దేశాలను ఒంటరిగా విమానంలో చుట్టిరావడం ఆమె లక్ష్యం. ఈ ఏడాది అక్టోబర్ 1న ఆమె తనకు అత్యంత ఇష్టమైన ‘1942-బోయింగ్ స్టీర్‌మన్ ఓపెన్ కాక్‌పిట్ బై ప్లేన్’లో ప్రయాణాన్ని ప్రారంభించింది. తాను ఎంతగానో అభిమా నించే అమీ జాన్సన్ స్ఫూర్తితో ఈ విమాన యాత్రకు ఉపక్రమించానని ఆమె అంటోంది. బ్రిటిష్ ఏవియేటర్ అమీ జాన్సన్ 1930లో ఒంటరిగా విమానంలో ప్రయాణించి రికార్డు సృష్టించింది. ఆమెలా తనూ రికార్డు సృష్టించాలని కుర్టిస్ తపన పడుతోంది. ఇప్పటికే ఆమె యూరప్, జోర్డాన్, అరేబియా ఎడారి, ఒమన్, పాకిస్తాన్, ఇండియా మీదుగా 6 వేల మైళ్ల ప్రయాణం పూర్తి చేసింది. మరో 7 వేల మైళ్ల ప్రయాణం చేయాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం భారత్‌కు చేరుకుంది. దిల్లీలో ఆమెకు మహిళా పైలట్ల నుంచి ఘన స్వాగతం లభించింది. అహమ్మదాబాద్, ఆగ్రా, వారణాసి, కోల్‌కతల్లో పర్యటించి, ఆ తర్వాత మయన్మార్‌కు అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లి 2016 ప్రారంభానికి తన యాత్ర ముగించాలని భావిస్తోంది. తన పర్యటన ఆసాంతం రికార్డు చేసేందుకు ఆమె ప్రయాణిస్తున్న విమానం వెనుకే ఓ బృందం మరో విమానంలో అనుసరిస్తూంటుంది. మొదట ఒంటరిగా ఈ ప్రయాణం చేయగలనా? అని అనుకున్నానని, కానీ తన వెనుక ఎంతోమంది పర్యవేక్షణ, ప్రోత్సాహం ఉన్నాయని తెలిశాక ధైర్యం వచ్చిందని ఆమె అంటోంది. (చిత్రం) దిల్లీలో భారతీయ మహిళా పైలెట్లతో.. (ఇన్‌సెట్‌లో) ట్రేసీ కుర్టిస్ టేలర్