జాతీయ వార్తలు

హత్యకేసులో లాలూ కుమారుడికి సుప్రీం నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు, బిహార్‌ మంత్రి తేజ్‌ ప్రతాప్‌కు జర్నలిస్టు రాజ్‌దేవ్‌ రంజన్‌ హత్య కేసులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇటీవల బెయిల్‌పై విడుదలైన ఆర్జేడీ మాజీ ఎంపీ షాబుద్దీన్‌కు కూడా నోటీసులు పంపింది. కేసును దర్యాప్తు చేపట్టి, అక్టోబర్‌ 17లోగా నివేదికను అందించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజ్‌దేవ్‌ రంజన్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడు, షార్ప్‌ షూటర్‌ మహ్మద్‌ కైఫ్‌తో తేజ్‌ప్రతాప్‌, షాబుద్దీన్‌ కలిసి దిగిన ఫొటోలు వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. బిహార్‌ పోలీసులపై తమకు విశ్వాసం లేదని, కేసు విచారణను దిల్లీకి బదిలీ చేయాలని రంజన్‌ భార్య ఆశా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.